తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్‌.. | KTR Tweet On Telangana Dashabdi Utsavalu | Sakshi
Sakshi News home page

తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్‌..

Published Tue, May 21 2024 8:03 PM | Last Updated on Tue, May 21 2024 8:59 PM

KTR Tweet On Telangana Dashabdi Utsavalu

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. జూన్‌ నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ పేర్కొన్నారు.

‘ఇది తెలంగాణ దశాబ్ది!

ఆరున్నర దశాబ్దాల పోరాటం..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..
వేల బలిదానాలు, త్యాగాలు..
బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..
ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..
ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!

ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా
స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని
సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!

పల్లె, పట్నం తేడా లేకుండా 
ప్రగతి రథం పరుగులు తీసింది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి
ఐటి ఎగుమతుల దాకా
రికార్డులు బద్దలయ్యినయి.

మీ అందరి మద్దతుతో
నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.
నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.
రైతన్నల, నేతన్నల, కష్టజీవుల 
కలత తీర్చినం.. కడుపు నింపినం.

వృద్ధులకు ఆసరా అయినం..
ఆడబిడ్డలకు అండగా నిలిచినం.
సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.

గుండెల నిండా జై తెలంగాణ
నినాదం నింపుకున్నం.
మన భాషకు పట్టం గట్టినం.
మన బతుకమ్మ, మన బోనం
సగర్వంగా తలకెత్తుకున్నం.
గంగా జమునా తెహజీబ్ కు
సాక్షీభూతంగా నిలిచినం.

అవమానాలు
అవహేళనలు
ఎదుర్కొన్న గడ్డ మీదనే
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
అంబరమంత ఎత్తున ఎగరేసినం.

కేసీఆర్ పాలన సాక్షిగా
ఇది తెలంగాణ దశాబ్ది!
వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!.. 

జై తెలంగాణ ’ అని ట్వీట్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement