June 2
-
బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది. -
ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ..అమరవీరులకు నివాళులతో మొదలుజూన్ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..2న సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్బండ్ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లుతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఉన్నాయి. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈసీ అనుమతి లభించిన నేపథ్యంలో వేడకులకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.అదే రోజు ముందుగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. -
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. జూన్ నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ పేర్కొన్నారు.‘ఇది తెలంగాణ దశాబ్ది!ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగాస్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడనిసమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది.ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండిఐటి ఎగుమతుల దాకారికార్డులు బద్దలయ్యినయి.మీ అందరి మద్దతుతోనీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చినం.. కడుపు నింపినం.వృద్ధులకు ఆసరా అయినం..ఆడబిడ్డలకు అండగా నిలిచినం.సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.గుండెల నిండా జై తెలంగాణనినాదం నింపుకున్నం.మన భాషకు పట్టం గట్టినం.మన బతుకమ్మ, మన బోనంసగర్వంగా తలకెత్తుకున్నం.గంగా జమునా తెహజీబ్ కుసాక్షీభూతంగా నిలిచినం.అవమానాలుఅవహేళనలుఎదుర్కొన్న గడ్డ మీదనేతెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్నిఅంబరమంత ఎత్తున ఎగరేసినం.కేసీఆర్ పాలన సాక్షిగాఇది తెలంగాణ దశాబ్ది!వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!.. జై తెలంగాణ ’ అని ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ దశాబ్ది!ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగాస్వతంత్ర… pic.twitter.com/i7WD2IwOC2— KTR (@KTRBRS) May 21, 2024 -
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల కమిషన్(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఉత్సవాలకు కాంగగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్ నిర్ణయించింది.అమ్మ ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. -
ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల క్రితం దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థుల కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అద్భుతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఒకనాడు వెనుకబాటుకు గురైన తెలంగాణ నేడు సమస్త రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముందెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్’పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని.. ఇది తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమని చెప్పారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందకర సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నో కష్టనష్టాలు, అవమానాలను అధిగమించి.. తెలంగాణ కోసం ఆరు దశాబ్ధాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజలను మమేకం చేస్తూ.. మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను.. ‘బోధించు, సమీకరించు, పోరాడు’అనే పంథా ద్వారా రాష్ట్రంలో సకల జనులను సమీకరించి, అందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించామని యాది చేసుకున్నారు. ఇది కూడా చదవండి: పండుగ వాతావ‘రణం’ -
అన్ని జిల్లాల్లో ‘అవతరణ’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, జెండావిష్కరణ చేసే వారి పేర్లను ఆయన ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని జెండావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఐకే రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్ రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగ్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి)లు ఆయా జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో పాల్గొననున్నారు. -
ఇంటింటికీ కంటి వెలుగు
సాక్షి, వికారాబాద్ : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఏ ప్రాణికైనా అన్ని అవయవాల్లోకెల్లా అతి ముఖ్యమైనవి కళ్లు. ఇవి ఉంటేనే విశ్వంలో దేన్నయినా చూడగలం. ముఖ్యంగా మానవునికి చూపు బాగుంటేనే ఏ పనినైనా సక్రమంగా నిర్వర్తించగలడు. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యం, బీమాకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 30శాతం మంది మూడు పూటలా తిండికి కరువై.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పౌష్టికాహారం అందకపోవడంతో నేత్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. ఈ రోజుల్లో కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు ఖరీదైపోయాయి. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్నవారు కంటి పరీక్షలు చేయించుకోలేక పోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. చక్కని చూపు కోసం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ శిబిరాలు ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రైతుబంధు పథకం అమలులో అధికారులు బిజీగా ఉన్న కారణంగా వచ్చేనెల నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే చెక్కుల పంపిణీ, పాసుపుస్తకాల పంపిణీ కోసం వచ్చే 20 వరకు గడువు పొడిగించడంతో.. ఈ కార్యక్రమం నిర్దేశిత సమయానికి ప్రారంభమవుతుందా.. లేదా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నిత్యం 25 గ్రామాల్లో పరీక్షలు... జిల్లాలో 367 గ్రామపంచాయతీలు, 501 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం జనాభా 9,67,356 మంది. తాండూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు వికారాబాద్, పరిగి, కొడంగల్‌లో నియోజకవర్గ స్థాయి దవాఖానాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో నిత్యం 25 గ్రామాల్లో కంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో బృందం ఒక్కో గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైనవారికి అక్కడే ఉచితంగా కంటి అద్దాలు అందజేయనున్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం నగరంలోని సరోజినీదేవి, ఎల్వీ.ప్రసాద్ తదితర ప్రముఖ కంటి వైద్యాలయాలకు రిఫర్ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. శుక్లం, మెల్ల కన్ను, కార్నియా అంధత్వం, రెటినోపతి, డయాబెటిక్, దృష్టిలోపాలు, రిఫ్రాక్టివ్ దోషం, టెరిజియమ్ తదితర సమస్యలను గుర్తించి చికిత్స చేయనున్నారు. దృష్టిలోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహా రం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సమాచారం లేదు ఊరూరా కంటి పరీక్షల కో సం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం, ఆదేశాలు అందలేదు. కార్యక్రమం ఉంటుంది కానీ.. ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. రైతు బంధు, రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా అన్ని శాఖల అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. ఈ కారణంగా నేత్ర శిబిరాలపై స్పష్టత లేదు. – దశరథ్, జిల్లా వైద్యాధికారి -
అసంపూర్తి అక్షరాస్యత
ఆగిపోయిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యతకు గ్రహణం ఇన్చార్జి డీడీ ఉష రిలీవ్ జెడ్పీ డిప్యూటీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు కొత్త మార్పులతో మరో కార్యక్రమం 100 గ్రామాల్లోనే అమలు హన్మకొండ : సంపూర్ణ అక్షరాస్యత సాధించడం సాధ్యం కాదని తేలిపోయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత ల క్ష్యంగా 2016 జూన్ 2న ప్రతిష్టాత్మక కార్యక్రమం మొదలైంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం(సెప్టెంబ ర్ 8) నాటికి ఈ లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా లో 3.20 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు. వంద రోజుల్లో 3.20 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి 64 వేల మంది స్వచ్ఛంద వలంటీర్లను గుర్తించారు. వీరు స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకం కూలీల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సి ఉంటుంది. అయితే, లక్ష్యం మేరకు గడువు రాకముందే కార్యక్రమాన్ని మధ్యలో ఆపేశారు. రెండు నెలలు దాటినా ప్రగతి కనిపించకపోవడంతో కలెక్టర్ వాకాటి కరుణకు సాక్షర భారతి అధికారులు, సిబ్బందిపై నమ్మకం సన్నగిల్లింది. ఉద్యోగుల నడుమ బేదాభిప్రాయాలు అంతేకాకుండా వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనపై సాక్షర భారతి డీడీగా పని చేసిన ఉష, కింది స్థాయి అధికారులు, సిబ్బంది మధ్య బేదాభిప్రాయాలు పొడసూపాయి. డీడీ ఉష కింది స్థాయి అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌కు సరెండర్ చేశారు. సరెండర్ చేసిన అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిసి వాస్తవాలను వివరించగా తిరిగి ఆమె ఉద్యోగులకు సాక్షర భారతికి పంపించారు. జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా చేయాలనే కలెక్టర్ కరుణ ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చగా సాక్షరభారత్ అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశా రు. మెదక్ జిల్లా సాక్షర భారత్ డిప్యూటీ డైరక్టర్ ఉషను జిల్లా సాక్షర భారతి డీడీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్య త కార్యక్రమం విఫలమవడంతో ఉషను ఇ¯Œæచార్జి బాధ్యతల నుంచి తప్పించి జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈ ఓ అనిల్‌కుమార్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారం రోజుల క్రితం సాక్షర భారతి జిల్లా డిప్యూ టీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్‌రెడ్డి అక్షరాస్యత కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. మండలానికి రెండు గ్రామాలు... వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం.. వంద గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంగా మారింది. దీంతో డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్‌రెడ్డి కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు నడుం బిగించారు. మండలానికి రెండు గ్రామాల చొప్పున 30 నుంచి 45 రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చాలని, ప్రతీ గ్రామంలో 30 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం నిర్థేశించుకున్నారు. ప్రతీ మండల కోఆర్డినేటర్ రెండు గ్రామాలను, ప్రతీ గ్రామ కోఆర్డినేటర్ 15 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ధేలా, ఒక్కో గ్రామంలో ఇద్దరేసి కోఆర్డినేటర్లు 30 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే ప్రతీ మండలంలో సాక్షరభారతి మండల, గ్రామ కోఆర్డినేటర్ల సమావేశం ఏర్పాటు చేసి కార్యచరణ అమలును వివరిస్తూ, అక్షరాస్యత సాధన వైపు అడుగులు వేస్తున్నారు. అందుబాటులో ఉన్న పుస్తకాలను వినియోగించుకోవడం ద్వారా నిరక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చనున్నారు. వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యత విఫలమైన క్రమంలో వంద గ్రామాల్లోనైనా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. -
జూన్ 2 నుంచి 8 వరకు నవ నిర్మాణ దీక్ష
విజయనగరం కంటోన్మెంట్ : జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 2వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లాలో ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రసంగం, ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటాయని తెలిపారు. 3వతేదీ నుంచి 7వతేదీ వరకు వివిధ అంశాలపై నియోజకవర్గ స్థాయిలో ప్రసంగాలు, చర్చలుంటాయని, 8న మహాసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రాజమండ్రి, కాకినాడ, ఏలూరులలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రత్యేకాధికారులు వీరే కురుపాం నియోజకవర్గానికి పార్వతీపురం ఆర్డీవో గోవిందరావు, పార్వతీపురం నియోజకవర్గానికి గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎ.వి.సుబ్బారావు, బొబ్బిలి నియోజకవర్గానికి జిల్లా అటవీ అధికారి రమణమూర్తి, గజపతినగరానికి డీఆర్డీఏ పీడీ ఢిల్లీరావు, విజయనగరం నియోజకవర్గానికి జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, ఎస్.కోట నియోజకవర్గానికి కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత, చీపురుపల్లికి విజయనగరం ఆర్డీవో శ్రీనివాసమూర్తి, నెల్లిమర్లకు భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ అనిత, సాలూరు నియోజకవర్గానికి పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతిరావును ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. -
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులు
-
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులు
హైదరాబాద్: వచ్చే జూన్ 2 నుంచి మంత్రులు విజయవాడలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాన శాఖల కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయానికి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ప్రతి శాఖలో ఈ గవర్నెన్స్ అమలు చేయాలని, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. -
జూన్ 2న నవ నిర్మాణ దినం
- రాష్ట్ర కేబినెట్ తీర్మానం హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన రోజు(జూన్ 2)ను నవ నిర్మాణ దినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా, మండల కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించి.. అడ్డగోలు విభజనతో కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని తీర్మానించింది. వచ్చే నెల 3 నుంచి 7 వరకు శాఖలవారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించి.. ఏడాదిలో సాధించిన ప్రగతిని జూన్ 8న విజయవాడలో నవ నిర్మాణ దినోత్సవం పేరిట నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. సీఎం నేతృత్వంలో సోమవారం ఉదయం పది గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం రాత్రి ఎనిమిది గంటల వరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నిర్ణయాలను ప్రసార, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు వెల్లడించారు. - డ్వాక్రా రుణాల మాఫీకి మూలధనాన్ని మూడు దశల్లో అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి విడతగా ఒక్కో మహిళకు రూ.3 వేల వంతున 88 లక్షల మంది మహిళలకు మొత్తం రూ.3 వేల కోట్లను (30 శాతం) జూన్ 3 నుంచి 7 లోగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు రూ.1,284 కోట్లను వడ్డీ రూపంలో చెల్లిస్తారు. రెండో దశ కింద 35 శాతం.. మూడో దశ కింద 35 శాతం మూలధనాన్ని రాబోయే రోజుల్లో అందించాలని కేబినెట్ తీర్మానించింది. - విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీని ఏర్పాటుచేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఏవియేషన్ అకాడమీతో పాటు నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్నీ ఏర్పాటుచేస్తారు. ఇందుకు అవసరమైన భూమిని సమీకరిస్తామని మంత్రి పల్లె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతిలో కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ టెర్మినల్‌ను జూలైలో ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచి రాజమండ్రి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యాన్ని కల్పిస్తారు. - గుంటూరు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విజయనగరం జిల్లా భోగాపురం, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదించారు. - ఈనెల 10 నుంచి 30లోగా అన్ని శాఖల్లోనూ బదిలీలను పూర్తిచేయనున్నారు. - బొగ్గు గనుల్లో వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంపై కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చమురు, సహజవాయు నిక్షేపాల ద్వారా వచ్చే ఆదాయంలోనూ రాష్ట్రానికి వాటాకు కేంద్రానికి లేఖ రాయనున్నారు. - వ్యవసాయ, నీటిపారుదల, వాటర్ షెడ్ ల పర్యవేక్షణకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ. - కాయగూర పంటలు సాగుచేసే రైతులకు 50 శాతం రాయితీపై విత్తనాల సరఫరా స లక్ష హెక్టార్లలో బిందు, తుంపర నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయం. ఇందుకు రూ.534 కోట్ల కేటాయింపు. స ప్రతి శాఖలోనూ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సీఎఫ్ఎంఎస్ (కాంప్రెహ న్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) విధానంలో ఒక అధికారి నేతృత్వంలో ఈ-నిధి ఏర్పాటు. - టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఉండే తుడా చైర్మన్‌ను బోర్డు నుంచి తొలగిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. - ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి రవాణా, ఆర్థిక, కార్మికశాఖల మంత్రులు శిద్ధా రాఘవరావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేసింది. - మంత్రులను.. శాఖల ఉన్నతాధికారులను సమన్వయం చేస్తూ ఆ శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అమాత్యులకు, అధికారులకు వివరించడానికి ప్రతి శాఖకూ ఓ ఎమ్మెల్వో (మీడియా లైజనింగ్ ఆఫీసర్)ను ఏర్పాటుచేయడానికి కేబినెట్ ఆమోదం. రాష్ట్ర అవతరణ దినోత్సవం మాటేంటి..? రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వలేదు. ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్వో వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమా అని అడగ్గా.. సమాధానం దాటవేశారు. ఉన్నతాధికారులను, మంత్రులను సమన్వయం చేసే స్థాయి ఎమ్మెల్వోలకు ఉంటుందా?, ఏ ప్రాతిపదికన ఆ పోస్టులను భర్తీ చేశారన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఓ కమిటీ ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసిందని చెప్పారు. -
తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా జూన్ 2
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన రోజు జూన్ 2ను తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా జరపనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరులు స్తూపం ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాతే ఆ రోజు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని కేసీఆర్ తెలిపారు. -
సంబరాలకు సిద్ధమైన తెలంగాణ
-
రేపటి ఉదయం కోసం..
నేటి అర్ధరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు నాలుగు కోట్ల గుండెలు ఈ రాత్రి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందాని నిరీక్షిస్తున్నాయి. జయజయహే తెలంగాణ... జననీజయకేతన గీతాన్ని ఆలపిస్తూ రేపటి సూర్యుడి రాకకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాయి. అర్ధరాత్రి నుంచే సంబురాలకు సిద్ధమైన తెలంగాణ సమాజం.. ఊరూవాడా ధూంధాం జరుపుకొంటూ తమ ఆకాంక్ష ఎంత ప్రగాఢమైందో, కోరిక సిద్ధించిన తమ సంబుర మెంత అపురూపమైందో ప్రపంచానికి ఈ వేడుకల రూపంలో చాటడానికి సమాయత్తమైంది. సాక్షి, హైదరాబాద్: భౌగోళికంగా తెలంగాణ విడిపోతోంది. తెలంగాణ పాలనకు అనువుగా అధికారిక భవనాలను పంచేశారు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ సహా రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నీ విడిపోయాయి. ఫైళ్లు పంచేసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ సహా అధికారులు, ఉద్యోగుల విభజన ప్రకటనను జారీ చేశారు. కీలక ప్రభుత్వ సంస్థలు, ఆస్తులు, అప్పులు ఎవరికేమిటో, ఎవరికెంతో తేల్చేశారు. సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారమే విందు వేడుకలతో ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. కొత్త సీఎం పాలన సారథ్య బృందమూ ఖరారైంది. సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువు తీరటానికి రంగం సిద్ధమైంది. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ కొత్త రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగానే జరపటానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయ పార్టీలు, టీ ఉద్యమ సంఘాలు సహా అన్ని వర్గాలూ ఘనంగా ఆవిర్భావ వేడుకలకు పిలుపునిచ్చాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లోనూ అధికారిక వేడుకల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టిక్.. టిక్.. టిక్.. గెట్ రెడీ.. ఆకాశాన్నంటే ఆనందోత్సవానికి అంతా సిద్ధం! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇది తెలంగాణ బొడ్రాయి వేడుక!! నేటి అర్ధరాత్రి నుంచే సంబురాలు షురూ సోమవారం నాటి తెలంగాణ ఆవిర్భావ (అపాయింటెడ్ డే) దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రమంతటా సంబురాలు అంబరాన్ని అంటనున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు రాజధానితోపాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ఉత్సవాలు జరపాలని ఇప్పటికే టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ జేఏసీతో పాటు వివిధ వర్గాల ఐక్య కార్యాచరణ సంఘాలన్నీ 60 ఏళ్ల కల నెరవేరిన సందర్భంగా ఎక్కడికక్కడ తెలంగాణ ధూంధాం, పటాకుల పండుగ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ‘ఆట-మాట-పాట’ పేరుతో ఉత్సవాలు జరుపుతోంది. రాత్రి 12 గంటలకు పటాకులతో తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం చెపుతూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ టీఎన్జీవోలు కూడా ఆదివారం నుంచి గన్‌పార్క్ వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. ఇక హైదరాబాద్‌లో గుర్తించిన 120 సెంటర్లలో అర్ధరాత్రి పటాకుల (బాణాసంచా) పండుగ నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్... హైదరాబాద్ నగరాన్ని గులాబీమయం చేసింది. టీఆర్ఎస్ శ్రేణులు, ఇతర తెలంగాణవాదులకు తోడుగా జీహెచ్ఎంసీ కూడా ఉత్సవాలను భుజానికెత్తుకుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టింది. ఐలాండ్లు, పార్కులతో పాటు అసెంబ్లీ, సచివాలయం, గన్‌పార్కు, పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఇతర చారిత్రాత్మక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తోంది. ఇక ఆవిర్భావ దినోత్సవం రోజు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని 67 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్యారడైజ్ బిర్యానీ, చాట్బండారు పాయింట్లను ఏర్పాటు చేసింది. రోడ్లు, ఐలాండ్లు ఇప్పటికే టీఆర్ఎస్ జెం డాలు, కటౌట్లతో నిండిపోయాయి. 50 నుంచి 60 అడుగుల ఎత్తున్న కేసీఆర్ కటౌట్లు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. వెయ్యికి పైగా హోర్డింగ్‌లను 100 సెంటర్లలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. వారం రోజుల ఉత్సవాలు: రాజధానితో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అనధికారికంగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు వివిధ సాంస్కృతిక రూపాల్లో సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను తెలియజేసే ప్రదర్శనలు, ఒగ్గుకథ, బుర్రకథ వంటి జానపద కళలను ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు శుక్ర, శనివారాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులతోతో సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఆయా శాఖల అధికారులకు అప్పగించారు. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపాలని కలెక్టర్లు అధికార యంత్రాంగానికి ఆదేశించారు. జిల్లాల్లోని ప్రభుత్వ భవనాలను, చారిత్రక కట్టడాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఉదయం 8.45 గంటలకు జిల్లాల్లోని పరేడ్ గ్రౌండ్స్ లేదా కలెక్టర్ కార్యాలయాల వద్ద కలెక ్టర్లు జాతీయ పతాకాన్ని ఎగరేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. వారం రోజుల పాటు వివిధ రూపాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆవిర్భావ దినోత్సవం రోజే మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, నల్గొండ కలెక్టర్ చిరంజీవులు జిల్లాలోని ప్రముఖులను సత్కరించే కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, సాహస బాలురు, ఇతర ప్రముఖులను సన్మానించాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం జిల్లాలో సైతం ఇదేరీతిన ప్రభుత్వ పరంగా ప్రముఖులకు సన్మానం జరగనుంది. కొత్త రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పురోగమిస్తుందని ఆ జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆశాభావంతో ఉన్నారు. వారం రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ముస్తాబైన రాజ్‌భవన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరులు, అతిథుల కోసం రాజ్‌భవన్ సిద్ధమైంది. రాజ్‌భవన్ లాన్లో ప్రమాణ స్వీకార వేదికను, అతిథులు కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేశారు. తెల్లటి షామియానా కింద ఈ వేడుక సాగనుంది. అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించే సభకు పరేడ్‌గ్రౌండ్స్ కూడా సిద్ధమైంది. లక్షలాదిగా తరలివచ్చే ప్రజానీకం కోసం ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. టీఆర్ఎస్ పార్టీ పరంగా కమిటీలు ఏర్పాటు చేసి నాయకులకు బాధ్యతలు అప్పగించింది. లక్షలాదిగా తరలివచ్చే ప్రజానీకాన్ని ఉద్దేశించి కేసీఆర్ తన ప్రాధమ్యాలను ఈ సభలో తెలియజేయనున్నారు. రాత్రంతా సంబురాలే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం సాయంత్రం దాకా సంబురాలను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. రాత్రి 8 నుంచి 12 దాకా ‘ఆటా పాటా మాట’లతో ధూంధాంలను నిర్వహించాలని జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్ కోరారు. రాత్రి 12 తర్వాత జేఏసీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి జాతీయ జెండాలను, తెలంగాణ జెండాలను ఆవిష్కరించాలన్నారు. ఆ తర్వాత ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని, అమరవీరుల స్థూపాలు, చిత్రపటాల దగ్గర కొవ్వొత్తులతో నివాళులు అర్పించాలని సూచించారు. తెలంగాణ ధూంధాం ఆధ్వర్యంలో.. తెలంగాణ ధూంధాం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో రాత్రి 11.59 దాకా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా కన్వీనర్ రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత సినీ, ఇతర కళాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. అన్ని పార్టీలదీ ఉత్సవ బాటే తెలంగాణ కోసం మలిదశ ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తిచేసి 60 ఏళ్ల కలను సాకారం చేసిన టీఆర్ఎస్తో పాటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కూడా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. టీడీపీ తెలంగాణ శాఖ నాయకులు కూడా ఉత్సవాల్లో భాగం కావాలని నిర్ణయించారు. బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ప్రజా, కార్మిక సంఘాలతో పాటు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం కూడా ఉత్సవాల్లో పాల్గొనాలని నిర్ణయించడం గమనార్హం. -
కల సాకారమవుతున్న వేళ..
* తెలంగాణ ఆవిర్భావం.. ఆనందపరవశం * జూన్ 2న శుభకార్యాలకు ముహూర్తాలు * జూన్ ఒకటి అర్ధరాత్రి విందులు, వినోదాలు సాక్షి, హైదరాబాద్: జనవరి 1.. ఆగస్టు 15.. అక్టోబర్ 2.. నవంబర్ 14.. ఈ తేదీలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలంగాణ ప్రజలకు జూన్2 కూడా అంతటి ముఖ్యమైన రోజు కాబోతుంది. వందలాది మంది అమరుల త్యాగం, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం చేస్తున్న జూన్ 2 చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఈ కీలకమైన రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజున జీవితంలో గుర్తుండిపోయే పని చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆరే ముందున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా తన జీవితంలో కీలకమైన ఘట్టంగా ఆవిర్భావ దినోత్సవాన్ని మలచుకుంటున్నారు. ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జూన్ 2 గుర్తుండిపోయే రోజే. తెలంగాణ అంతటా ఆసక్తి... ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలు ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు కార్యం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు అదేరోజు తమ వివాహ ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. జూన్‌లోనే పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఈ విద్యాసంవత్సరంలో బడులకు పంపాలనుకునే తల్లిదండ్రులు 2వ తేదీన అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు గృహప్రవేశాలకు ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంకొందరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా తమ జీవితాన్ని మలచుకోవాలని చూస్తున్నారు. సంబురాలకు సిద్ధం..: జూన్1 నుంచే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులైతే ఉద్యమవీరులను స్మరించుకునేందుకు ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌లో జూన్ ఒకటి అర్థరాత్రి గన్‌పార్కు వద్ద ఉద్యమవీరులకు నివాళి అర్పించాలని నిర్ణయించారు. తెలంగాణ అంతటా అర్థరాత్రి 12 గంటల సమయంలో బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీలు తీయనున్నారు. రక్తదాన శిబిరాలు, మరణానంతరం అవయవదానాలు చేసేందుకు వీలుగా పత్రాలు సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గర్భిణీలు ఈ ప్రత్యేకమైన రోజున తమ బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా వైద్యులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన పలువురు వివిధ రాష్ట్రాల్లో, సీమాంధ్రలో ఉన్న వారు ఆవిర్భావ దినోత్సవం రోజు స్థానికంగా ఉండేట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే నూతన సంవత్సర వేడుకల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి ఫస్ట్ నాటి వేడుకల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శుభకార్యాలకు దివ్యమైన రోజు.. జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అది జేష్ఠ శుద్ధ పంచమి సోమవారం. ఈ జేష్ఠ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. పైగా జూన్ 2 సోమవారం నాడు పంచమి పూర్తి రోజు ఉంటుంది. అది అన్ని ముహూర్తాలకు అత్యంత దివ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. నా వద్దకు భక్తుల్లో చాలామంది జూన్ రెండున ఏదో ఒక శుభకార్యం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను పూర్తిస్థాయిలో ఆచరించేందుకు ఆరోజు నుంచి శ్రీకారం చుట్టాలని పలువురు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్లు, గహప్రవేశాలు, అక్షరాభ్యాసం, స్థిరాస్తుల కొనుగోలు వంటివి చేయడం ద్వారా జూన్ రెండును తమ జీవితంలోనూ కీలక ఘట్టంగా మార్చుకోవాలని పలువురు యోచిస్తున్నారు. - ద్రోణ వెంకటరమణ శర్మ, పురోహితులు సంబరాలు చేసుకోవాలని టీఆర్ఎస్ సందేశం జూన్ 2న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తెలంగాణలోని అన్ని గ్రామాల్లో సంబురాలను నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినాయకత్వం సందేశాన్ని పంపింది. ప్రమాణస్వీకారం పూర్తికాగానే టపాకాయలను కాల్చాలని, పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించుకోవాలని సూచించింది. ర్యాలీలు.. జెండావిష్కరణలు తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ రెండున పెద్ద ఎత్తున ర్యాలీలు, తెలంగాణ జెండావిష్కరణలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తాం. సాంసృ్కతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులు కృషి చేయాలని, పని సంస్కృతిని అలవర్చుకోవాలని విన్నవించాం. జూన్ రెండు నుంచి తెలంగాణలో ఉద్యోగుల బాధ్యత మరింత పెరగనుంది. - దేవీప్రసాద్, టీఎన్జీవోల అధ్యక్షుడు -
జూన్ 2 నుంచి హైకోర్ట్ అట్ హైదరాబాద్.
అదే పేరుతో తీర్పులు, ఉత్తర్వులు సర్కులర్ జారీ చేసిన రిజిస్ట్రార్ జనరల్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే జూన్ 2 నుంచి తెలంగాణ హైకోర్టును హైకోర్టు అట్ హైదరాబాద్‌గా సంబోధించాలంటూ రిజిస్ట్రార్ జనరల్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. హైకోర్ట్ అట్ హైదరాబాద్ కొంత కాలం పాటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తుంది. దీంతో జూన్ 2 నుంచి వెలువరించే అన్ని తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు, డిక్రీలు, ఇతర ప్రత్యుత్తరాలన్నీ కూడా హైకోర్ట్ ఆఫ్ జూడికేచర్ అట్ హైదరాబాద్ పేరుతో వెలువడుతాయని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్ ఏడాది పొడిగింపు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి డెప్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జిగా ఉన్న సంతోష్‌రెడ్డి గత ఏడాది న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఆవిర్భావం రోజున సెలవు ఇస్తారా?
హైదరాబాద్: జూన్ 2న సమైక్య తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోవడంతో పాటు కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటవుతున్నందున ఆ రోజును ఇరు ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటిస్తాయా? లేదా? అన్న అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం రోజున సెలవు ప్రకటిస్తామని గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అయిన నవంబర్ 1న లోగడ ప్రభుత్వ సెలవు ఉండేది. అయితే, కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం సెలవును రద్దు చేసింది. మరిప్పుడు జూన్ 2న రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవుతున్నందున ఆ రోజు సెలవు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై కొత్త ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
ఆశల పల్లకి
తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం ఎంతోదూరం లేదు. ఇక, ఆ తర్వాత తమకు ఎలాంటి అవకాశాలు అందివస్తాయి..? పద్నాలుగేళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కుతుందా..? షరా మామూలుగా వడ్డించిన విస్తరి ముందు వేరే వారు వచ్చి కూర్చుంటారా..? అసలు ఎవరెవరికి పదవులు దక్కుతాయి...? ఇవీ.. ప్రస్తుతం సగటు టీఆర్ఎస్ కార్యకర్త మదిని తొలుస్తున్న ప్రశ్నలు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్కు ఏమాత్రం బలం లేదని జోరుగా ప్రచారం జరిగిన జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎన్నికయ్యారు. ఒక విధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ పట్టు అంతంతమాత్రమే అనుకున్న దశలో జిల్లాలో ఆరు స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక, ఎన్నికల ముందు వివిధ సమీకరణలతో టికెట్లను త్యాగం చేసినవారు, ఇప్పుడు తమకు ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్నారు. వివిధ కారణాలతో ఈసారి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. ఎన్నికలముందు పార్టీలో చేరిన పైళ్ల శేఖర్‌రెడ్డికి భువనగిరి టికెట్ కేటాయించడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ మొదటినుంచీ పనిచేస్తున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి గురించి అధినాయకత్వం ఆలోచించాల్సి ఉంది. ఇదే రకమైన పరిస్థితి నల్లగొండలోనూ ఉంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న చకిలం అనిల్‌కుమార్‌ను కాదని, దుబ్బాక నర్సింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒక రకంగా అనిల్‌కుమార్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ అధినాయకత్వంపై ఉందన్న అభిప్రాయం ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడలో మొదటినుంచీ పార్టీలో పనిచేసిన నాయకత్వం ఉంది. అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి చేరికతో ఆయనకే నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయనే అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. కానీ, మొదటినుంచీ పార్టీ జెండాను మోసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సైతం, స్థానిక నాయకత్వం అండదండలు లేకున్నా, కొద్దోగొప్పో కేడర్ పార్టీనే నమ్ముకుని ఇన్నాళ్లూ పనిచేశారు. ఇక, పార్టీ ఆవిర్భావం నుంచి ఎలాంటి పదవుల్లేకుండా పనిచేస్తున్న సీనియర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, కార్పొరేషన్ల డెరైక్టర్ల పదవులు ఉంటాయి. ఇవి కాకుండా, జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, పాలకవర్గ సభ్యుల పోస్టులు ఉంటాయి. ప్రధాన దేవాలయాలకు ధర్మకర్తల మండ ళ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు తదితర నామినేటెడ్ పోస్టులు ఉండనే ఉంటాయి. మండల పరిషత్‌లలో సైతం కో-ఆప్షన్ సభ్యుల పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం ఈ పోస్టులు, సంఖ్య, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోటీ, ముఖ్య నాయకుల ప్రయత్నాలు.. తదితర చర్చలతో టీఆర్ఎస్ శ్రేణులు బిజీబిజీగా ఉన్నాయి. మరికొద్ది రోజులు ఆగితే కానీ, ఎవరె వరికి ఏయే పదవులు దక్కుతాయో.. తెలియదు. ఈ పదవుల భర్తీ పూర్తిగా పూర్తయితే, నేతల పదవుల దాహం తీరడమే కాదు, టీఆర్ఎస్లో రాజకీయ నిరుద్యోగం కూడా చాలా వరకు తీరిపోయినట్టేనని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. -
ఆవిర్భావం రోజున తెలంగాణకు పెళ్లి కళ
-
కొత్త స్టేట్.. కొత్త కోడ్
సాక్షి, కాకినాడ :వాహనాలపై కోడ్‌ను బట్టి అది ఏ రాష్ర్టంలో ఏ జిల్లాకు చెందిందో ఇట్టే చెప్పవచ్చు. ఇప్పటి వరకూ 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను ‘ఏపీ’గా పరిగణించి, జిల్లాలను ఆంగ్లాక్షరక్రమాన్ని అనుసరించి అంకెల్లో పేర్కొంటు న్నారు. ఉమ్మడి రాష్ర్టంలో అక్షరక్రమంలో అనంతపురం, ఆదిలాబాద్, చిత్తూరు, కడపల తర్వాత తూర్పు గోదావరి నిలిచేది. అందుకు అనుగుణంగా మన జిల్లా కోడ్ ఏపీ 05గా ఉంది. వాహనం నంబర్లో ఏపీ-05 అనేది చూడగానే అది తూర్పు గోదావరి జిల్లాకు చెందిందని ఠక్కున చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలు కానున్న నేపథ్యంలో మన జిల్లా కోడ్ ఏపీ-05 నుంచి ఏపీ-04గా మారనుంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడ నుండడంతో మిగిలిన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను నిర్ణయించనున్నారు. దీని ప్రకారం అక్షరక్రమంలో అనంతపురం, చిత్తూరు, కడపల తర్వాత వచ్చే తూర్పుగోదావరి కోడ్ ఏపీ-04గా మారనుంది. జూన్ 2 నుంచి జిల్లాలో రిజిస్టరయ్యే వాహనాలకు కోడ్‌నే వినియోగిస్తారు. ఆ మూడురోజులూ వాహనాల అమ్మకాలూ బంద్ వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి జమయ్యేది. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ కార్యాలయాన్ని కొత్త రాజధాని ఏర్పడే వరకు హైదరాబాద్‌లోనే తాత్కాలికంగా ఏర్పా టు చేస్తున్నారు. జూన్ 2 నుంచి ఈ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏ రాష్ర్ట పరిధిలోని జిల్లాల ఆదాయం ఆ రాష్ట్రానికి జమయ్యేందుకు వీలుగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండువరకు వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల జారీని నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మూడు రోజులూ వాహనాల అమ్మకాలను నిలిపి వేయాలని డీలర్లను కూడా ఆదేశించింది. తిరిగి జూన్ 3 నుంచి కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. -
నేతలు అమ్ముడుపోతారనే ఈ తొందరా..!
-
జూన్ 2 దాకా ఆగలేం..!
-
జూన్ 2 నుండి రెండు రాష్ట్రాలకూ వేర్వేరు బడ్జెట్లు