అదే పేరుతో తీర్పులు, ఉత్తర్వులు సర్కులర్ జారీ చేసిన రిజిస్ట్రార్ జనరల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే జూన్ 2 నుంచి తెలంగాణ హైకోర్టును హైకోర్టు అట్ హైదరాబాద్‌గా సంబోధించాలంటూ రిజిస్ట్రార్ జనరల్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. హైకోర్ట్ అట్ హైదరాబాద్ కొంత కాలం పాటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తుంది. దీంతో జూన్ 2 నుంచి వెలువరించే అన్ని తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు, డిక్రీలు, ఇతర ప్రత్యుత్తరాలన్నీ కూడా హైకోర్ట్ ఆఫ్ జూడికేచర్ అట్ హైదరాబాద్ పేరుతో వెలువడుతాయని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.
సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్ ఏడాది పొడిగింపు
న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి డెప్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జిగా ఉన్న సంతోష్‌రెడ్డి గత ఏడాది న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
జూన్ 2 నుంచి హైకోర్ట్ అట్ హైదరాబాద్.
Published Thu, May 29 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement