Registrar General
-
అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు
సాక్షి, అమరావతి: సీబీఐ, ఏసీబీ నమోదు చేసే అవి నీతి కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా ఆ కేసులను సంబంధిత కోర్టు లు మూసివేయడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లకు సాక్ష్యం చెప్పే అవకా శాన్ని నిరాకరిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు 2014లో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఇద్ద రు అధికారులకు సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువ రించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో తన పేరు ఎక్కించేందుకు చిత్తూరు జిల్లా ఏర్పేడు తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వో బాలకృష్ణారెడ్డి రూ.2,500 లంచం డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి 2009లో ఏసీ బీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాది నుంచి బాలకృష్ణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఈ కేసును కర్నూలు కోర్టు విచారణ చేసింది. అయితే, లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టు కుని ఈ కేసులో సాక్షులుగా ఉన్న డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ఎన్నికల విధుల్లో ఉండటంతో సాక్ష్యం చెç³్పలేక పోయారు. వారు సాక్ష్యం ఇచ్చేందుకు కేసును రీ ఓపెన్ చేయాలని కర్నూలు కోర్టును ఏసీబీ అధికా రులు అభ్యర్థించారు. దీనిని ఆ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీబీ 2014లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. ఏసీబీ తరఫు న్యాయవాది ఎస్ఎం సుభానీ వాదనలు వినిపిస్తూ మరో అధికారిక విధుల్లో ఉండటంతో ఆ ఇద్దరు అధికారులు సాక్ష్యం చెప్పలేకపోయారని,ఎన్నికల విధులు ముగిశాక సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని చెప్పినా కర్నూలు కోర్టు పట్టించుకోలేదన్నారు. వీఆర్వో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సాక్ష్యం చెప్పేందుకు అధికారులకు ఏసీబీ కోర్టు పలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేదని, దీంతో కోర్టు వారి సాక్ష్యాలను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. కర్నూలు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కేసులను త్వరగా పరిష్కరించడం అంటే సాక్షులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వకపోవడం కాదన్నారు. ఈ కేçÜులో వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వక పోవడం సరికాదన్నారు. మూసివేసిన సాక్ష్యాలను తిరిగి తెరిచే అవకాశాన్ని కోర్టులకు చట్టం కల్పిస్తోందన్నారు. అవకాశం ఇచ్చినా అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రాకపోతే ఆ విషయాన్ని లేఖ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సాక్షులుగా ఉన్న సంబంధిత అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా అవినీతి కేసులను మూసివేయకుండా న్యాయాధికారులకు ఆదేశాలు ఇస్తూ సర్క్యులర్ జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. -
బాల్య వివాహాల్లో జార్ఖండ్ టాప్
రాంచీ: చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి. ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలను రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు పల్లెల్లో 7.3%, పట్టణ ప్రాంతాల్లో 3% జరుగుతున్నాయి. 21 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 21 ఏళ్లు రాకుండా 54.0% మంది యువతులకు మూడుముళ్లు పడుతుండగా, జార్ఖండ్‌లో ఇది 54.6% గా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు 29.5% మాత్రమే. జార్ఖండ్ మరో అపప్రథ కూడా మూటగట్టుకుంది. మంత్రాల నెపంతో ఇక్కడ 2015లో 32 హత్యలు చోటుచేసుకోగా 2018లో 18 మంది, 2019, 2020ల్లో 15 మంది చొప్పున హత్యకు గురయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. -
జనగణన మరింత ఆలస్యం!
న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా ఉధృతి పెరుగుతున్నందున, దశాబ్దానికి ఒకమారు జరిపే సార్వత్రిక జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరగకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ గణన 2020–21లో జరగాల్సిఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా శాంతించనందున ఇప్పట్లో గణన ఉండకపోవచ్చంటున్నారు. జిల్లాల సరిహద్దులను, సివిల్ మరియు పోలీసు యూనిట్ల హద్దులను 2022 జూన్ వరకు మార్చవద్దని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు సెన్సస్ రిజిస్టార్ జనరల్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. జనగణనకు మూడు నెలల ముందు ఇలా హద్దుల మార్పుపై నిషేధం విధిస్తారు. ఇప్పటికే జూన్ వరకు నిషేధం ఉన్నందున ఇది తొలగిన అనంతరమే జనగణనకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే జూన్‌లో నిషేధం తొలగిన అనంతరం జనగణన నోటిఫికేషన్ జారీ చేయదలిస్తే మరోమారు సరిహద్దుల మార్పును నిలిపివేస్తూ ఆదేశాలిస్తారు. తర్వాత 3నెలలకు గణన ఆరంభమవుతుంది. అంటే ఎంత కాదన్నా, వచ్చే అక్టోబర్ వరకు జనగణన జరిగే అవకాశం లేదని నిపుణుల విశ్లేషణ. జిల్లాల, ఇతర యూనిట్ల హద్దుల మార్పుపై నిషేధాన్ని కేంద్రం తొలుత 2020 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు విధించింది. ప్రస్తుత నిషేధం ఈ జూన్ 30 వరకు ఉంటుంది. -
కోవిడ్ వల్ల జనగణన–2021 వాయిదా
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వల్ల జనగణన–2021, సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రాలవారీగా జనగణన–2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయించలేదని వివరించింది. జనగణన–2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు ఉన్న మ్యాపింగ్‌ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్–19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీ ని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్, సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపింది. -
జనగణనలో మొబైల్ నంబర్!
న్యూఢిల్లీ: జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్‌ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్‌పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. -
రిజిస్ట్రార్ జనరల్‌కి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ను బెదిరించి, దూషించిన వ్యవహారంలో హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఆర్.లక్ష్మీనర్సింహాచార్యులు (ఆర్ఎల్ఎన్ చార్యులు)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ పరిపాలనాపరంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్ఎల్ఎన్ చార్యులపై హైకోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చార్యులుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా జడ్జి అయిన మానవేంద్రనాథ్ రాయ్ డిప్యుటేషన్‌పై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జడ్జీల క్వార్టర్స్‌లో నివాసముంటున్న మానవేంద్రనాథ్ రాయ్ విధి నిర్వహణలో సూటిగా, కఠినంగా వ్యవహరిస్తారని పేరు. ఈనెల 2వ తేదీ అర్థరాత్రి ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఆయనను తీవ్రంగా దూషించారు. ఎవరని రాయ్ ప్రశ్నించేలోపే కాల్ కట్ అయింది. తిరిగి మరుసటి రోజుకూడా ల్యాండ్‌ఫోన్‌కు ఆ వ్యక్తి ఇదేవిధంగా ఫోన్ చేసి దూషించడమే కాక, బెదిరింపులకు సైతం దిగాడు. దీంతో రాయ్ తనకు వచ్చిన ఫోన్ నెంబర్ గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయ సిబ్బంది ఆ నెంబర్ హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఆర్ఎల్ఎన్ చార్యులదని తేల్చారు. ఇదే విషయాన్ని వారు రాయ్‌కి తెలియజేశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీజే, చార్యులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనపై ఫిర్యాదుకు ఆదేశాలిచ్చారు. దీంతో దిగొచ్చిన చార్యులు అటు మౌఖికంగా, ఇటు రాతపూర్వకంగా మానవేంద్రనాథ్కి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా సీజే ఆదేశాల మేరకు చార్యులుపై హైకోర్టు అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, వివాదాస్పదుడిగా చార్యులుకు హైకోర్టులో పేరుంది. -
2 నుంచి 13 వరకు హైకోర్టుకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యవసర కేసులను విచారించేందుకు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ పి.నవీన్‌రావులను వెకేషన్ జడ్జీలుగా నియమించారు. మొదటి వెకేషన్ కోర్టులో జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కోదండరాం, జస్టిస్ రాజశేఖరరెడ్డి నేతృత్వం వహిస్తారు. అత్యవసర కేసులు ఉంటే కక్షిదారులు జనవరి 5న దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిని 7వ తేదీన విచారిస్తారు. అదే విధంగా రెండో వెకేషన్ కోర్టులో జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ భట్, జస్టిస్ నవీన్‌రావు ఉంటారు. 9వ తేదీన కేసులను దాఖలు చేస్తే, 13న విచారిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
జూన్ 2 నుంచి హైకోర్ట్ అట్ హైదరాబాద్.
అదే పేరుతో తీర్పులు, ఉత్తర్వులు సర్కులర్ జారీ చేసిన రిజిస్ట్రార్ జనరల్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే జూన్ 2 నుంచి తెలంగాణ హైకోర్టును హైకోర్టు అట్ హైదరాబాద్‌గా సంబోధించాలంటూ రిజిస్ట్రార్ జనరల్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. హైకోర్ట్ అట్ హైదరాబాద్ కొంత కాలం పాటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తుంది. దీంతో జూన్ 2 నుంచి వెలువరించే అన్ని తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు, డిక్రీలు, ఇతర ప్రత్యుత్తరాలన్నీ కూడా హైకోర్ట్ ఆఫ్ జూడికేచర్ అట్ హైదరాబాద్ పేరుతో వెలువడుతాయని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్ ఏడాది పొడిగింపు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి డెప్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జిగా ఉన్న సంతోష్‌రెడ్డి గత ఏడాది న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
వివాహం.. నమోదు చేసుకోండిలా...
వికారాబాద్, న్యూస్‌లైన్: మీరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..? మీకు తెలిసిన వారు పెళ్లి చేసుకోబోతున్నారా..? అయితే జరిగే వివాహానికి చట్టబద్ధత కల్పించుకోండి. తెలిసినవారికి మీ మాటగా చెప్పండి. వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం చ ట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. 2006 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. జిల్లాలకు జిల్లా వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్లు ఉంటారు. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాల వారీగా అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామ కార్యదర్శి, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు అధికారులుగా వ్యవహరిస్తారు. ఇదీ విధానం.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు/ కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా నిర్ధేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు/ కుమార్తె వయసు తెలియ జేయాలి. ఇరువురి తరపున ఇద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది. అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టర్లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే చోట, లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్ధేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రంపై వివాహాల అధికారి సంతకం, సీలు వేసి అందజేస్తారు. వివాహం జరిగిన 30 రోజుల తరువాత రిజిస్ట్రేషన్ చేయించాలంటే జరిగిన నాటి నుంచి రెండు నెలల లోపు రూ.100 ఫీజుతో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు నమోదు చేసుకోవాలి? వివాహాన్ని చట్టబద్ధం చేసుకుంటే ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అర్హులుగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాలు వర్తించేందుకు ఇది దోహదపడుతుంది. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటే భరణం కోరేందుకు ఉపయోగపడుతుంది. కట్నం వేధింపుల సందర్భంగా నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా పనికి వస్తుంది. హింసకు గురైన మహిళలు విడాకులు పొందడానికి అవసరమవుతుంది. విడాకులు కోరే వారు కూడా వివాహం జరిగిన ఆధారంగా చూపాల్సి ఉంటుంది. రెండో వివాహాలను అడ్డుకోవడానికి, బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారం ఇస్తే? వివాహ నమోదు పత్రంలో తెలిసి, మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా లేదా ఈ రెండూ అమలు చేస్తారు. వివాహం నమోదు చేయని అధికారికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా ఈ రెండు అమలు చేస్తారు.