అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు | High Court order to Registrar General | Sakshi
Sakshi News home page

అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు

Published Sun, Aug 20 2023 3:48 AM | Last Updated on Sun, Aug 20 2023 9:10 AM

High Court order to Registrar General - Sakshi

సాక్షి, అమరావతి: సీబీఐ, ఏసీబీ నమోదు చేసే అవి నీతి కేసుల్లో సాక్షు­లుగా ఉన్న అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా ఆ కేసులను సంబంధిత కోర్టు లు మూసివేయడం తగ­దని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ, ఇన్‌­స్పెక్టర్‌లకు సా­క్ష్యం చెప్పే అవకా శాన్ని నిరాకరిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు 2014లో జారీ చేసిన ఉత్తర్వు­లను హైకోర్టు రద్దు చేసింది. ఇద్ద రు అధికారులకు సాక్ష్యం చెప్పేందు­కు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువ రించారు.

పట్టా­దార్‌ పాస్‌ పుస్తకంలో తన పేరు ఎక్కించేందుకు చిత్తూరు జిల్లా ఏర్పేడు త­హ­సీల్దారు కార్యాలయంలో వీఆర్వో బాలకృష్ణారెడ్డి రూ.2,500 లంచం డిమాండ్‌ చేశారంటూ ఓ వ్యక్తి 2009లో ఏసీ బీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాది నుంచి బా­లకృష్ణారెడ్డి లంచం తీసు­కుంటుండగా ఏసీబీ అ­ధి­కా­రులు పట్టు కున్నారు. ఈ కేసును కర్నూలు కోర్టు వి­చా­రణ చేసింది. అయితే, లంచం తీసుకుంటున్న వీ­ఆ­ర్వోను పట్టు కుని ఈ కేసులో సాక్షులుగా ఉన్న డీ­ఎ­స్పీ, ఇన్‌స్పెక్టర్‌ ఎన్నికల విధుల్లో ఉండటంతో సాక్ష్యం చెç­³్పలేక పోయారు. వారు సాక్ష్యం ఇచ్చేందుకు కే­సును రీ ఓపెన్‌ చేయా­లని కర్నూలు కోర్టును ఏసీబీ అ­ధికా రులు అభ్యర్థించారు. దీనిని ఆ కోర్టు తి­ర­స్కరించింది.

ఆ ఉత్తర్వు­లను సవాలు చేస్తూ ఏసీబీ 2­0­14లో హైకోర్టులో పిటి­షన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీ­­వల తుది విచారణ జరిపింది. ఏసీబీ తరఫు న్యాయ­వాది ఎస్‌ఎం సుభానీ వా­దనలు వినిపిస్తూ మరో అధికారిక విధుల్లో ఉండటంతో ఆ ఇద్దరు అధికారులు సాక్ష్యం చె­ప్ప­లే­క­పో­యా­రని,ఎన్నికల విధులు ముగిశాక సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని చెప్పినా కర్నూలు కోర్టు పట్టించు­కోలేదన్నారు. వీ­ఆర్వో తరఫు న్యాయవాది వా­ద­న­లు వినిపిస్తూ సాక్ష్యం చెప్పేందుకు అధికారులకు ఏసీ­బీ కోర్టు పలు అవకా­శాలు ఇచ్చినా ఉపయోగించు­కో­లే­దని, దీంతో కోర్టు వారి సాక్ష్యాలను మూసివేస్తూ ఉ­త­్తర్వులు ఇచ్చిందన్నారు.

కేసులను త్వరగా ప­రిష్క­రించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింద­న్నా­రు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జ­స్టిస్‌ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. క­ర్నూలు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కే­సు­లను త్వరగా పరిష్కరించడం అంటే సాక్షులకు సా­క్ష్య­ం చెప్పే అవ­కా­శం ఇవ్వకపోవడం కాదన్నారు. ఈ కేç­Üులో వీఆ­ర్వోను లంచం తీసుకుంటుండగా ప­ట్టు­కున్న అధికా­రులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇ­వ్వక పో­వ­డం సరికాదన్నారు.

మూసివేసిన సా­క్ష్యా­ల­ను తిరిగి తెరిచే అవకాశాన్ని కోర్టులకు చట్టం క­ల్పి­స్తో­ం­దన్నారు. అవకాశం ఇచ్చినా అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రాకపోతే ఆ విషయాన్ని లేఖ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని పేర్కొ­న్నారు. సాక్షులుగా ఉన్న సంబంధిత అధికా­రు­ల సాక్ష్యాలను నమోదు చేయకుండా అవి­నీతి కేసు­లను మూసివేయకుండా న్యా­యాధికా­రులకు ఆ­దేశా­లు ఇస్తూ సర్క్యులర్‌ జారీ చేయాలని హైకో­ర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement