అసంపూర్తి అక్షరాస్యత | incomplete literacy | Sakshi
Sakshi News home page

అసంపూర్తి అక్షరాస్యత

Published Tue, Aug 30 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

incomplete literacy

  • ఆగిపోయిన ప్రతిష్టాత్మక కార్యక్రమం
  • వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యతకు గ్రహణం
  • ఇన్‌చార్జి డీడీ ఉష రిలీవ్‌
  • జెడ్పీ డిప్యూటీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు
  • కొత్త మార్పులతో మరో కార్యక్రమం
  • 100 గ్రామాల్లోనే అమలు 
  • హన్మకొండ : సంపూర్ణ అక్షరాస్యత సాధించడం సాధ్యం కాదని తేలిపోయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత ల క్ష్యంగా 2016 జూన్‌ 2న ప్రతిష్టాత్మక కార్యక్రమం మొదలైంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం(సెప్టెంబ ర్‌ 8) నాటికి ఈ లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా లో 3.20 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు. వంద రోజుల్లో 3.20 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి 64 వేల మంది స్వచ్ఛంద వలంటీర్లను గుర్తించారు. వీరు స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకం కూలీల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సి ఉంటుంది. అయితే, లక్ష్యం మేరకు గడువు రాకముందే కార్యక్రమాన్ని మధ్యలో ఆపేశారు. రెండు నెలలు దాటినా ప్రగతి కనిపించకపోవడంతో కలెక్టర్‌ వాకాటి కరుణకు సాక్షర భారతి అధికారులు, సిబ్బందిపై నమ్మకం సన్నగిల్లింది.
    ఉద్యోగుల నడుమ బేదాభిప్రాయాలు
    అంతేకాకుండా వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనపై సాక్షర భారతి డీడీగా పని చేసిన ఉష, కింది స్థాయి అధికారులు, సిబ్బంది మధ్య బేదాభిప్రాయాలు పొడసూపాయి. డీడీ ఉష కింది స్థాయి అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌కు సరెండర్‌ చేశారు. సరెండర్‌ చేసిన అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిసి వాస్తవాలను వివరించగా తిరిగి ఆమె ఉద్యోగులకు సాక్షర భారతికి పంపించారు. జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా చేయాలనే కలెక్టర్‌ కరుణ ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చగా సాక్షరభారత్‌ అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశా రు. మెదక్‌ జిల్లా సాక్షర భారత్‌ డిప్యూటీ డైరక్టర్‌ ఉషను జిల్లా సాక్షర భారతి డీడీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్య త కార్యక్రమం విఫలమవడంతో ఉషను ఇ¯Œæచార్జి బాధ్యతల నుంచి తప్పించి జిల్లా ప్రజాపరిషత్‌ డిప్యూటీ సీఈ ఓ అనిల్‌కుమార్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారం రోజుల క్రితం సాక్షర భారతి జిల్లా డిప్యూ టీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్‌రెడ్డి అక్షరాస్యత కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. 
     
    మండలానికి రెండు గ్రామాలు...
     
    వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం.. వంద గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంగా మారింది. దీంతో డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్‌రెడ్డి కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు నడుం బిగించారు. మండలానికి రెండు గ్రామాల చొప్పున 30 నుంచి 45 రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చాలని, ప్రతీ గ్రామంలో 30 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం నిర్థేశించుకున్నారు. ప్రతీ మండల కోఆర్డినేటర్‌ రెండు గ్రామాలను, ప్రతీ గ్రామ కోఆర్డినేటర్‌ 15 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ధేలా, ఒక్కో గ్రామంలో ఇద్దరేసి కోఆర్డినేటర్లు 30 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించారు.  ఈ క్రమంలోనే ప్రతీ మండలంలో సాక్షరభారతి మండల, గ్రామ కోఆర్డినేటర్ల సమావేశం ఏర్పాటు చేసి కార్యచరణ అమలును వివరిస్తూ, అక్షరాస్యత సాధన వైపు అడుగులు వేస్తున్నారు. అందుబాటులో ఉన్న పుస్తకాలను వినియోగించుకోవడం ద్వారా నిరక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చనున్నారు. వంద రోజుల్లో సంపూర్ణ అక్షరాస్యత విఫలమైన క్రమంలో వంద గ్రామాల్లోనైనా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement