జూన్ 2న సమైక్య తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోవడంతో పాటు కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటవుతున్నందున ఆ రోజును ఇరు ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటిస్తాయా? లేదా? అన్న అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హైదరాబాద్: జూన్ 2న సమైక్య తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోవడంతో పాటు కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటవుతున్నందున ఆ రోజును ఇరు ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటిస్తాయా? లేదా? అన్న అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం రోజున సెలవు ప్రకటిస్తామని గతంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అయిన నవంబర్ 1న లోగడ ప్రభుత్వ సెలవు ఉండేది. అయితే, కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం సెలవును రద్దు చేసింది. మరిప్పుడు జూన్ 2న రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవుతున్నందున ఆ రోజు సెలవు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై కొత్త ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.