హైదరాబాద్: వచ్చే జూన్ 2 నుంచి మంత్రులు విజయవాడలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాన శాఖల కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయానికి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ప్రతి శాఖలో ఈ గవర్నెన్స్ అమలు చేయాలని, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.
జూన్ 2 నుంచి విజయవాడలోనే ఏపీ మంత్రులు
Published Tue, May 12 2015 6:53 PM | Last Updated on Sat, Jun 2 2018 4:00 PM
Advertisement
Advertisement