
'చంద్రబాబు కేబినెట్ లో మంత్రులంతా దద్దమ్మలే'
విజయవాడ: చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ దద్దమ్మలేనని కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు ఘాటుగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి(గన్ కల్చర్) పెరిగిందని ఆయన ఆరోపించారు.
తిరుమలలో జరిగిన అన్యమత ప్రచారానికి నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయాలని విష్ణు డిమాండ్ చేశారు.