
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment