Downpour
-
బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది. -
భర్త కళ్లెదుటే కొట్టుకుపోయిన భార్య
పుణే: భర్త కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోయి భార్య ప్రాణాలు వదిలిన విషాద ఘటన పుణేలోని సహకార్ నగర్ ప్రాంతంలో ఉన్న టాంగేవాలే కాలనీలో చోటు చేసుకుంది. పుణేలో బుధవారం రాత్రి నాలుగు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. టాంగేవాలే కాలనీకి చెందిన సంజయ్ రాణె భార్య కూడా మృతుల్లో ఉన్నారు. ఆకాశానికి చిల్లులు పడినట్టుగా కురిసిన వర్షంతో వీధులన్నీ వరదలతో పోటెత్తాయి. సంజయ్ భార్య జోత్స్న(40) ఆయన కళ్లెదుటే వరదల్లో కొట్టుకుపోయారు. ‘ఒక్కసారి వరద నీరు పోటెత్తడంతో ఇంట్లోంచి బయటపడేందుకు ప్రయత్నించాం. భారీ ప్రవాహం ధాటికి జోత్స్న నా కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడలేపోయాను. తర్వాత ఆమె మృతదేహం సమీపంలో లభ్యమైంది. మా కుటుంబానికి ఇది ఊహించని షాక్. ముఖ్యంగా పదేళ్ల మా కుమారుడు వరద్ చిన్న వయసులోనే అమ్మను కోల్పోయాడు’ అంటూ సంజయ్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. గంగతీర్థ సొసైటీ వెనుక భాగంగా టాంగేవాలే కాలనీ ఉంది. సొసైటీ వెనుక భాగంలోనే కాలువ ఉంది. ఆక్రమణల కారణంగా ఈ కాలువ కుంచింకుపోయింది. బుధవారం రాత్రి కుండపోతకు కాలువ పోటెత్తడంతో సమీపంలోని కాలనీలు అన్ని వరదలో చిక్కుకున్నాయి. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కాలనీ వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇళ్లపైకి, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారని స్థానికుడు గోపినాథ్ జాదవ్ తెలిపారు. వరదల బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన కాలికి గాయమైంది. భారీ వర్షాల కారణంగా తమ ఇళ్లలోని వస్తువులన్నీ దెబ్బతిన్నాయని, వర్షాలు ఇలాగే కొనసాగితే తామంతా షెల్టర్లు చూసుకోవాల్సి ఉంటుందని యమునాబాయ్ షిండే అనే వృద్ధురాలు వాపోయారు. కుండపోత విధ్వంసానికి 800పైగా జంతువులు చనిపోయాయి. 2 వేలకు పైగా వాహనాలు మునిపోయాయి. ముందు జాగ్రత్తగా గురువారం పుణేలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. (చదవండి: వరుణుడా.. కాలయముడా?) -
దేశ రాజధానిలో కుండపోత
-
ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్
హైదరాబాద్: భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం అనూహ్యంగా నాలుగు అడుగుల మేర పెరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా పలు ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేశారు. రాజ్‌భవన్ సమీపంలో రైలు పట్టాలు నీటిలో ముగినిపోయాయి. -
దేశ రాజధానిలో కుండపోత
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. ఈ ఉదయం నుంచి కుండపోతగా వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు నీట ముగినిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులు, రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షాలతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఇండిగో ప్రయాణికులకు తెలిపింది. మరోవైపు అమెరికా మంత్రి జాన్ కెర్రీ నగర పర్యటన రద్దయింది. సిస్‌గంజ్ గురుద్వారా, జామా మసీదు, గౌరీ శంకర్ ఆలయంను ఆయన సందర్శించాల్సివుంది. వర్షం కారణంగా ఆయన పర్యటన రద్దు చేసుకన్నారు. యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసులకూ అంతరాయం కలిగింది. ఫోన్ చేసిన వినియోగదారులకు కార్లు అందుబాటులో లేవని ఓలా, ఉబర్ వంటి సంస్థల నుంచి సమాధానం వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ట్రాఫిక్ సమాచారం అందిస్తున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనదారులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లావ్యప్తంగా 400 కోట్ల రూపాయల పంటనష్టం