కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. కవిత కీలక ట్వీట్‌ | Mlc Kavitha Tweet On Ktr Formula E Case | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. కవిత కీలక ట్వీట్‌

Published Thu, Dec 19 2024 7:00 PM | Last Updated on Thu, Dec 19 2024 7:17 PM

Mlc Kavitha Tweet On Ktr Formula E Case

సాక్షి,హైదరాబాద్‌:రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ పార్టీ,కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌నాయిస్తున్న అక్ర‌మ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

ఈ మేరకు గురువారం(డిసెంబర్‌19) కవిత ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు.‘అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

సీఎం రేవంత్ రెడ్డి దయచేసి తెలుసుకోండి.మేము కేసీఆర్ సైనికులం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది.మీ చిల్ల‌ర‌ వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు. అవి మా సంకల్పానికి మ‌రింత బ‌లం చేకూరుస్తాయి.పోరాటం మాకు కొత్త కాదు.అక్ర‌మ కేసుల‌తో మా గొంతుల‌ను నొక్క‌లేరు’అని కవిత పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement