సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్,ఐఏఎస్ అరవింద్ కుమార్,హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కేసులో మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీలు, రూ.55కోట్ల లావాదేవీలు,స్పాన్సర్స్ షిప్ కంపెనీ వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఈడీ కేసులో కూడా కేటీఆర్‌తో సహా ఇతర నిందితులకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసుల్లో నిధుల గోల్‌మాల్ జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ ఏ1గా చేర్చింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేటీఆర్‌ను డిసెంబర్ 30 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. విచారణ కొనసాగించవద్దని ఏసీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment