మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు | Telangana Farmation Day Celebrations Grandly Organized In Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు

Published Mon, Jun 12 2023 11:58 AM | Last Updated on Mon, Jun 12 2023 12:05 PM

Telangana Farmation Day Celebrations Grandly Organized In Malaysia - Sakshi

తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిది  సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపడుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మలేషియా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. 

మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షులు చిరుత చిట్టిబాబు గారు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం మొదలయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరించి నేడు సాధించిన అభివృద్ధిని నాడు మనం అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనకై అమరుల ప్రాణత్యాగాలను ఎన్నడూ మరవలేమని వారికి నివాళులు అర్పించి,  కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కేంద్రంలో కూడా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఉపాధ్యక్షులు మారుతి కుర్మ. 

ఈ కార్యక్రమంలో అతిథులు మైటా డిప్యూటీ ప్రసిడెంట్ సత్య, మైటా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మరియు భారాస ఉపాధ్యక్షులు మారుతి కుర్మ,  కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సంపత్ రెడ్డి ,రవిందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, నవీన్ గౌడ్ పంజాల, కిషోర్, క్రాంతి , గౌతమ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

(చదవండి: సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్)

 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement