కెనడా  తెలంగాణ అసోసియేషన్  ధూమ్ ధామ్ వేడుకలు | Telangana Association In Canada Dhoom Dham Celebrations. | Sakshi
Sakshi News home page

కెనడా  తెలంగాణ అసోసియేషన్  ధూమ్ ధామ్ వేడుకలు

Published Mon, Jun 12 2023 5:32 PM | Last Updated on Mon, Jun 12 2023 6:02 PM

Telangana Association In Canada Dhoom Dham Celebrations. - Sakshi

తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో  గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూమ్‌ ధామ్‌ 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి గారు ప్రారంభించగా లావణ్య ఏళ్ల, అనూష ఇమ్మడి, స్వాతి అర్గుల, రాధిక దలువాయి, శ్రీమతి రజిని తోట తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెం గారు, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి గారు, ధర్మకర్తల మండలి  చైర్మన్ నవీన్ ఆకుల గారు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా గారు వేదికపై పాల్గొన్నారు.

ఆరంభ ప్రసంగంతో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం మునుపెన్నడు లేనట్టుగా చిన్నారులకు టాలెంట్ షో ని నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్, మెంటల్ మ్యాథ్స్ లాంటి విభాగాలలో వారి టాలెంట్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఉమా సలాడి, లక్ష్మీ సంధ్యా గారు, భరత్, మనస్విని తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దీనికి వ్యాఖ్యాతలుగా గుప్తేశ్వరి వాసుపిల్లి, మాధురి చాతరాజు వ్యవహరించారు. 

ఈ షోలో గెలిచిన చిన్నారులకి శ్రీ విష్ణు బోడ (రియల్టర్) బహుమతులను అందజేశారు. చిన్నారులని వారి వయసును బట్టి రెండు గ్రూపులుగా విభజించారు. తొలిస్థానంలో అనికా శ్యామల(10), సాయి స్నిగ్ధ తంగిరాల(8), రెండో స్థానంలో ఆకాంక్ష(11), శివాన్ష్ దవల(7)లు ఉండగా, జడ్జెస్ స్పెషల్ చాయిస్‌గా ఆర్యన్ పొనుగంటి(11) శ్రీతన్ పూల(10) మాన్య నాగబండి(9), శ్రీరామదాసు అరుగుల(7), విద్వాన్ష్ రాచకొండ(5) గెలిచారు. ఈ కార్యక్రమం మొత్తం నాలుగు గంటల పాటు ఉమెన్స్ కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి, మాధురి చాతరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. 

అనంతరం సాంస్కృతిక కార్యక్రమలను ప్రహళిక మ్యాకల, రాహుల్ బాలనేని, ధాత్రి అంబటి, స్ఫూర్తి కొప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఈ వేడుక స్పాన్సర్ బెస్ట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ట్యూటరింగ్ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రారంభించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శుభన్ క్రిషన్-  కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీసీఏ నిర్వహిస్తున్న కార్యక్రమాలని హర్షించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు టీసీఏను అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరింపజేసారు. 

అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ టీసీఏ ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్తో కలర్‌ఫుల్‌గా ఆర్గనైజ్ చెయ్యడంతో పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్‌లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా 16 విభిన్నమైన వెండర్ స్టాల్స్ ని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా టీసీఏ తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది. 

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల యూత్ డైరెక్టర్ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మురళి సిరినేని, మురళీధర్ కందివనం, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల, శ్రీనివాస్‌ తిరునగరి, హరి రావుల్, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రభాకర్ కంబాలపల్లి, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కెనడా తెలంగాణ అసోసియేషన్(టీసీఏ)  విందు ఏర్పాట్లు ఘనంగా జరిగింది. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ ధూంధాం 2023 వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగిసింది.

(చదవండి: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement