Dhoom Dham programs
-
కెనడా తెలంగాణ అసోసియేషన్ ధూమ్ ధామ్ వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూమ్ ధామ్ 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి గారు ప్రారంభించగా లావణ్య ఏళ్ల, అనూష ఇమ్మడి, స్వాతి అర్గుల, రాధిక దలువాయి, శ్రీమతి రజిని తోట తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెం గారు, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి గారు, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల గారు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా గారు వేదికపై పాల్గొన్నారు. ఆరంభ ప్రసంగంతో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం మునుపెన్నడు లేనట్టుగా చిన్నారులకు టాలెంట్ షో ని నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్, మెంటల్ మ్యాథ్స్ లాంటి విభాగాలలో వారి టాలెంట్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఉమా సలాడి, లక్ష్మీ సంధ్యా గారు, భరత్, మనస్విని తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దీనికి వ్యాఖ్యాతలుగా గుప్తేశ్వరి వాసుపిల్లి, మాధురి చాతరాజు వ్యవహరించారు. ఈ షోలో గెలిచిన చిన్నారులకి శ్రీ విష్ణు బోడ (రియల్టర్) బహుమతులను అందజేశారు. చిన్నారులని వారి వయసును బట్టి రెండు గ్రూపులుగా విభజించారు. తొలిస్థానంలో అనికా శ్యామల(10), సాయి స్నిగ్ధ తంగిరాల(8), రెండో స్థానంలో ఆకాంక్ష(11), శివాన్ష్ దవల(7)లు ఉండగా, జడ్జెస్ స్పెషల్ చాయిస్‌గా ఆర్యన్ పొనుగంటి(11) శ్రీతన్ పూల(10) మాన్య నాగబండి(9), శ్రీరామదాసు అరుగుల(7), విద్వాన్ష్ రాచకొండ(5) గెలిచారు. ఈ కార్యక్రమం మొత్తం నాలుగు గంటల పాటు ఉమెన్స్ కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి, మాధురి చాతరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమలను ప్రహళిక మ్యాకల, రాహుల్ బాలనేని, ధాత్రి అంబటి, స్ఫూర్తి కొప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఈ వేడుక స్పాన్సర్ బెస్ట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ట్యూటరింగ్ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రారంభించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శుభన్ క్రిషన్- కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీసీఏ నిర్వహిస్తున్న కార్యక్రమాలని హర్షించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు టీసీఏను అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరింపజేసారు. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ టీసీఏ ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్‌తో కలర్ఫుల్గా ఆర్గనైజ్ చెయ్యడంతో పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్‌లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా 16 విభిన్నమైన వెండర్ స్టాల్స్ ని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా టీసీఏ తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల యూత్ డైరెక్టర్ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మురళి సిరినేని, మురళీధర్ కందివనం, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల, శ్రీనివాస్ తిరునగరి, హరి రావుల్, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రభాకర్ కంబాలపల్లి, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కెనడా తెలంగాణ అసోసియేషన్(టీసీఏ) విందు ఏర్పాట్లు ఘనంగా జరిగింది. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ ధూంధాం 2023 వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగిసింది. (చదవండి: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..!) -
పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు?
సాక్షి,ఇల్లందకుంట(కరీంనగర్): ‘నేను వికలాంగుడిని కాదా.. సంవత్సరం నుంచి పింఛన్ వస్త లేదు.. కళ్లకు కనిపిస్తలేనా.. నాకెందుకు పింఛన్ ఇవ్వరు’ అంటూ ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలంలోని వావిలాలలో సోమవారం రాత్రి టీఆర్ఎస్ ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మడుపు రాజేశ్ వేదిక పైకి ఎక్కి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త అతని కాలర్ పట్టుకొని, కిందికి దింపేందుకు ప్రయత్నించగా పడిపోయాడు. అనంతరం రాజేశ్ మాట్లాడుతూ.. కార్యక్రమం ప్రారంభానికి ముందే తనకు ఏడాదిగా పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని వాపోయాడు. వారి నుంచి తప్పించుకొని స్టేజి ఎక్కి తన బాధను అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేశానన్నాడు. ఇందులో ఏ విధమైన రాజకీయాలు లేవని పేర్కొన్నాడు. పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్‌కు, పదిసార్లు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగినా రాలేదని చెప్పాడు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
డిపో ముందు ధూంధాం కార్యక్రమం
-
పాటే ప్రాణం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లోకి దిగిన టీఆర్ఎస్.. ప్రజలకు చేరేలా వీటిని వివరించాలని నిర్ణయించింది. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు చక్కని పాటలు తోడవుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మంచి పాటలను రూపొందిస్తున్నారు. నాలుగేళ్ల సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇతివృత్తాలుగా చేసుకుని... ప్రజలకు బాగా చేరే ట్యూన్లతో పాటల తయారీలో నిమగ్నమయ్యారు. కేసీఆర్ శనివారం రోజంతా పలువురు కవులు, కళాకారులతో చర్చలు జరిపారు. వీరు రాసుకొచ్చిన పాటలను, తీసుకొచ్చిన ట్యూన్లను పరిశీలించారు. ప్రజలకు సులభంగా చేరేలా తెలంగాణ యాసను జోడించి మార్పులు చేయించారు. టీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటికే పాటలు కీలకంగా మారాయి. ప్రతి సభలోనూ, అభ్యర్థుల ప్రచారంలోనూ ఇవే ఉంటున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బహిరంగ సభలకు ప్రత్యేక సాంస్కృతిక బృందాలు పనిచేస్తున్నాయి. అయితే పోలింగ్‌పై ప్రభావం చూపే స్థాయి పాటలను రూపొందించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రస్తు తం పాటల రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో పాటలే ప్రధాన భూమికయ్యాయి. ఇదే తరహాలో ఓటర్లు టీఆర్ఎస్ను ఆదరించేలా పాటలను సిద్ధం చేశారు. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా... ఇలా అన్నింటికీ వేర్వేరుగా ప్రచార పాటలను రూపొందించడంలో కేసీఆర్ అన్నీ తానై చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత ఎన్నికల ప్రచార పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలకు ముందే ఈ పాటల పెన్‌డ్రైవ్‌లను, సీడీలను అన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈసీ నిబంధనలు పాటించాలి... కేంద్ర ఎన్నికల సంఘం మార్గ దర్శకాలకు అనుగుణంగా టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం నిర్వహించేలా పార్టీ అధిష్టానం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. నామినేషన్ పత్రాల దాఖలు, అఫిడవిట్ తయారీ, రోజువారీ ఖర్చులు, ప్రచారంలో ప్రత్యర్థుల ఫిర్యాదులకు ఇవ్వాల్సిన వివరణ వంటి అంశాలను వెంటవెంటనే సిద్ధం చేసేందుకు టీఆర్ఎస్ ప్రతి జిల్లాలో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈసీ మార్గదర్శకాలపై పూర్తి అవగాహన ఉన్న న్యాయవాదిని, చార్టర్డ్ అకౌంటెంట్‌ను, జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలను ఈ ఎన్నికల సెల్లో నియమించింది. జిల్లాల ఎన్నికల సెల్లో పని చేసే న్యాయవాదులతో టీఆర్ఎస్ ముఖ్య నేత, న్యాయవాది బోయినపల్లి వినోద్‌కుమార్, సీనియర్ న్యాయవాది సుధాకర్‌రెడ్డిలు శనివారం భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సంక్షిప్తంగా రూపొందించి అభ్యర్థులకు, నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలకు పంపించాలని నిర్ణ యించారు. ప్రచారంలో ఎప్పటికప్పుడు అవసరమయ్యే సూచనలను ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయవాదులకు సూచించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్ పాటల రూపకల్పనలో నిమగ్నం కావడంతో వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. -
ధూంధాం కళాకారుడి ఆత్మహత్య
ఉద్యోగం, ఉపాధి లేక మనస్తాపం గీసుకొండ: తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన ఆ గొంతు మూగబోయింది. ఉద్యోగం, ఉపాధిలేకపోవడంతో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన బొల్లం మధు(26) ఆత్మహత్య చేసుకున్నాడు. బొల్లం మధు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివాడు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. కళాశాలలో చదువుతున్న క్రమంలో విద్యార్థి జేఏసీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే «తెలంగాణ ధూంధాం కళాకారుల బృందంలో ముఖ్యసభ్యుడిగా ఉండేవాడు. పలు ప్రాంతాల్లో ధూంధాం కార్యక్రమాల ద్వారా పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచాడు. మధు తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. తల్లి బొల్లం కనకలక్ష్మి, ఇద్దరు అన్నదమ్ములు, చెల్లెళ్లు ఉన్నారు. గతంలో వీరి వివాహాలు కాగా తల్లితో పాటు అన్నదమ్ములు ఇద్దరూ కూలిపని చేస్తున్నారు. 2011లో డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో పాటు ఎలాంటి ఉపాధి మార్గం లేకపోవడంతో మధు కొంత కాలంగా మనోవేదనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది ఈ నెల 23న ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.