వేదికపై రాజేశ్ కాలర్ పట్టుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్త
సాక్షి,ఇల్లందకుంట(కరీంనగర్): ‘నేను వికలాంగుడిని కాదా.. సంవత్సరం నుంచి పింఛన్ వస్త లేదు.. కళ్లకు కనిపిస్తలేనా.. నాకెందుకు పింఛన్ ఇవ్వరు’ అంటూ ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలంలోని వావిలాలలో సోమవారం రాత్రి టీఆర్‌ఎస్ ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మడుపు రాజేశ్ వేదిక పైకి ఎక్కి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్త అతని కాలర్ పట్టుకొని, కిందికి దింపేందుకు ప్రయత్నించగా పడిపోయాడు.
అనంతరం రాజేశ్ మాట్లాడుతూ.. కార్యక్రమం ప్రారంభానికి ముందే తనకు ఏడాదిగా పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని వాపోయాడు. వారి నుంచి తప్పించుకొని స్టేజి ఎక్కి తన బాధను అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేశానన్నాడు. ఇందులో ఏ విధమైన రాజకీయాలు లేవని పేర్కొన్నాడు. పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్‌కు, పదిసార్లు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగినా రాలేదని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment