అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ అభిమానులు ట్రంప్ గుడిలో ఏకంగా పూజలు చేశారు. ట్రంప్‌కు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ. ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట. ట్రంప్ కోసం ఏకంగా ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.
అంతేకాదు 2019లో కృష్ణ పెట్టిన ట్వీట్‌కు ట్రంప్ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట. ట్రంప్ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో ‘ట్రంప్ కృష్ణ’గా ముద్ర వేసుకున్నాడు.
Villagers in Telangana Celebrate Trump’s Re-Election by Worshipping His Statue in a Temple built for him
In a unique celebration, villagers in Konne, Jangaon district in Telangana, marked Donald Trump’s re-election as U.S. president by honoring Bussa Krishna’s devotion to the… pic.twitter.com/k1sS5bOPAQ— Sudhakar Udumula (@sudhakarudumula) November 7, 2024
తాజా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో గ్రామస్తులు తమ ‘ట్రంప్ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప నైవేద్యాలు, సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment