
సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్) ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు సిడ్నీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్‌కు ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం సిడ్నీలోని కింగ్స్ ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టి.ప్రకాష్ గౌడ్‌కు ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులు, వివిధ తెలంగాణ, ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ముఖ్య కార్యదర్శి ప్రదీప్ సేరి, ఏటీఫ్ సభ్యులు గోవెర్దన్ రెడ్డి, వాసు తాట్కూర్, డేవిడ్ రాజు, కిషోర్ పంతులు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏటీఫ్ మీడియా ప్రతినిధి ప్రశాంత్ కడపర్తి మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు శాసనసభ్యులు టి.ప్రకాష్ గౌడ్, టీఆర్‌ఎస్ డిస్ట్రిక్ట్ పార్టీ సెక్రటరీ పీ.చంద్రశేఖర్ రెడ్డి, రాజేంద్రనగర్ మండల్ ఎంపీపీ టీ. మల్లేష్‌లు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment