సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాలు జరుపుతోంది.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్‌లో పోరాడారు. ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని అన్నారు.
తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందరో త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాధన కోసం 1200 మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలి.
ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment