Golkonda fort
-
ఎన్సీసీ.. దేశ సేవకు మేము సైతం..!
నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ) అనేది జాతీయ యువజన విభాగం. ఇది ఒక స్వచ్ఛంద ప్రాతిపదికన ఏర్పాటు చేసిన సంస్థ. ఇది భారత సాయుధ దళాల అంతర్భాగం. దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది పాఠశాల స్థాయిలో మొదలై డిగ్రీ విద్యార్థులను కేడెట్స్‌గా సెలెక్ట్ చేసుకొని శిక్షణ అందిస్తారు. వీరికి డ్రిల్, ఆయుధాల వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇచ్చి ఏ, బీ, సీ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌వింగ్‌లో ఎన్సీసీ పూర్తి చేసిన వారికి రిజర్వేషన్ కల్పిస్తారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని దేశసేవకు మేముసైతం అంటున్న ఎన్సీసీ క్యాడెట్లపై సాక్షి ప్రత్యేక కథనం.. – రసూల్పురాస్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైన్యం, నావిక దళం, ఎయిర్‌ఫోర్స్ ట్రై సరీ్వసెస్‌లో శిక్షణ అందజేయడం కోసం ఏర్పడిన భారత సాయుధ దళాల యువ విభాగం నేషనల్ క్యాడేట్ కార్ప్స్(ఎన్సీసీ). మన భారత దేశ సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసే లక్ష్యంతో భారత రక్షణ చట్టం ప్రకారం 1948లో ఎన్సీసీ ఏర్పాటైంది. 1949లో బాలికల విభాగం, 1950లో ఎయిర్‌వింగ్, 1952లో నేవీ వింగ్ ఏర్పడ్డాయి. 1962 చైనా– ఇండియా యుద్ధం తర్వాత దేశం అవసరాన్ని తీర్చడానికి 1963లో ఎన్సీసీ క్యాడెట్లకు ఆయుధాల్లో, డ్రిల్ తదితర అంశాల్లో శిక్షణ తప్పనిసరి చేశారు. తెలంగాణ, ఏపీ ఎన్సీసీ డైరెక్టరేట్‌లో 9 గ్రూపులు..1949లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్సీసీ స్థాపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో టివోలీ థియేటర్ సమీపంలో రాష్ట్ర ఏన్‌సీసీ డైరెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1962లో ఎయిర్ కమోడోర్‌ను డైరెక్టర్‌గా నియమించారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్–4 గ్రూపులు, ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం 5 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో జూనియర్, సీనియర్ వింగ్‌లలో లక్షా నలభై వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. ప్రస్తుతం ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ కమోడోర్ వీఎం.రెడ్డి ఉన్నారు.ఎన్సీసీ క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ..తొమ్మిది గ్రూపుల పరిధిలోని వివిధ బెటాలియన్లు, పాఠశాల, కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ లేదా బాటిల్ క్రాఫ్ట్, ఫైరింగ్‌తో పాటు క్రమశిక్షణ, యోగా, నాయకత్వ లక్షణాలు, మార్చింగ్ డ్రిల్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విషయాలపై నిపుణులతో ఉపన్యాసాలు, క్రీడా పోటీలు, వ్యర్థాలను రిసైక్లింగ్ చేసే పద్ధతులు, కెరీర్ కౌన్సిలింగ్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్, రక్తదానం, వివిధ అంశాలపై అవగాహన ర్యాలీలు తదితర వాటిల్లో క్యాడెట్లకు తర్ఫీదు అందజేస్తారు.ఎన్సీసీ క్యాడెట్లకు ప్రయోజనాలు..ఏ-సర్టిఫికెట్ – జూనియర్ వింగ్ లేదా జూనియర్ క్యాడెట్ల విభాగంలో 2 సంవత్సరాల ఎన్సీసీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు ఏ సరి్టఫికెట్ అందజేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు జరుగుతాయి.బీ-సర్టిఫికెట్ – పాఠశాల, కళాశాలల తరఫున సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్లకు రెండు సంవత్సరాల కోర్సు పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు బి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు నిర్వహిస్తారు.సీ-సర్టిఫికెట్ – ఎన్సీసీలో సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్ల విభాగంలో మూడు సంవత్సరాల కోర్సు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు సీ సర్టిఫికెట్ జారీచేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. డిఫెన్స్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు సీ సరి్టఫికెట్ ఉపయోగపడుతుంది. వీరికి ఆర్మీ వింగ్‌లో 3–15 శాతం, నేవీలో 05–08, ఎయిర్‌వింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఇక క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అకాడమిక్ ఇయర్లో క్యాడెట్లకు రూ.6 వేల ఉపకార వేతనం, అత్యుత్తమ క్యాడెట్‌కు రూ.4,500, ద్వితియ అత్యుత్తమ క్యాడెట్లకు రూ.3,500 ప్రోత్సహకాలు అందజేస్తున్నారు.అవకాశాలు ఉంటాయి.. శిక్షణ పొంది వివిధ ఎన్సీసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన ఎన్సీసీ క్యాడెట్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాలు అందజేస్తోంది. సీ సరి్టఫికెట్లు సాధించిన క్యాడెట్లకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిజర్వేషన్లు ఉంటాయి. ఏ, బీ సరి్టఫికెట్లు పొందిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.– వి.ఎం.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కెసిఆర్
-
ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్లో పోరాడారు. ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందరో త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాధన కోసం 1200 మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలి. ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్ -
కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించామని, ఈసారి గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రేపు గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడంతోపాటు సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్ బృందం, మంజులా రామస్వామి బృందం ప్రదర్శనలు ఉంటాయన్నారు అలాగే, మంగ్లీ, మధుప్రియలు తెలంగాణ సంప్రదాయాన్ని, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటలు పాడతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాజ్భవన్లలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కుటుంబపాలనకు చరమగీతం రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడితే తమకు నష్టమని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అయితే, అవినీతి, నియంతృత్వ, కుటుంబపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతల మధ్య విభేదాల్లేవని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాలను సృష్టిస్తున్నారన్నారు. బీజేపీలో చేరిన నాయకులు బీజేపీలోనే ఉంటారని, పార్టీ కోసమే రోజూ పోరాడుతున్నారని స్పష్టత ఇచ్చారు. రాబోయే రోజుల్లో అనేక మంది నాయకులు తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సహకారాన్ని వివరిస్తూ త్వరలోనే ప్రజలముందు పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. ఈ విషయంలో విభేదాలకు తావిచ్చేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యాఖ్యానించవద్దని హితవు పలికారు. దక్షిణ భారతం–ఉత్తర భారతం అంటూ విభేదాలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న వారికి.. కేంద్ర ప్రభుత్వం ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కనిపించడం లేదా? అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాగా, ఇటీవల పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్టించిన పవిత్ర రాజదండం ‘సెంగోల్’రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనానికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ అంబలవాన పండారా సన్నిధి స్వామి కిషన్‌రెడ్డిని కలిసి ఆశీర్వదించారు. -
ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్ దర్శిని’ సిటీ టూర్ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు. - శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. - బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఛార్జీలు ఇవే.. - మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 . - మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 . -
సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: ‘‘స్వతంత్ర భారతంలో ఆరు దశాబ్దాలు అస్తిత్వం కోసం ఉద్యమించిన తెలంగాణ.. ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించి యావత్ దేశానికే దిక్సూచిగా మారింది. అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. వ్యవసాయం సంక్షోభం నుంచి పుంజుకొని 11.6 శాతం వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. బలీయ శక్తిగా ఎదుగుతున్నాం ‘‘తెలంగాణ ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తోంది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావమే దీనికి కారణం. పారిశ్రామిక రంగంలో 12.01 శాతం వృద్ధిరేటుతో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. ఐటీ ఎగుమతుల్లో 26.14% వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఎనిమిదేళ్లలోనే రాష్ట్రం బలీయ ఆర్థిక శక్తిగా ఎదిగి దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా మారింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. ఏడేళ్లలో రాష్ట్ర జీఎస్డీపీ 127 శాతం పెరిగితే.. దేశ జీడీపీ పెరిగింది 90 శాతమే. 2013–14లో సుమారు రూ.లక్షగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2021–22 నాటికి రూ.2.75 లక్షలకు పెరిగింది. ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే 84 శాతం అధికం. అదనంగా 10 లక్షల పింఛన్లు అమల్లోకి.. ఇది తెలంగాణ సంక్షేమంలో స్వర్ణ యుగం. ఈ పంద్రాగస్టు నుంచే మరో 10 లక్షల మందికి పింఛన్లను అందిస్తున్నాం. దళితుల అభ్యున్నతి కోసం విప్లవాత్మకంగా దళితబంధు పథకాన్ని తెచ్చి రూ.10 లక్షలను గ్రాంటుగా అందిస్తున్నాం. కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్‌షాపుల్లో 261 దుకాణాలను దళితులకే కేటాయించాం. గొల్లకుర్మల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ చేపట్టాం. వేల కోట్ల విలువైన మత్స్య సంపదను సృష్టించాం. నేతన్నకు బీమా అమలు చేస్తున్నాం. ఆరేళ్లలో 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాం. రూ.57,880 కోట్లను రైతు బంధు అందించాం. ఈ పథకం అత్యుత్తమమని ఐక్యరాజ్యసమితి కూడా కొనియాడింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బలోపేతం చేసేందుకు మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పల్లె ప్రగతి రూపంలో ఊళ్లు బాగుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే కావటం దీనికి ఉదాహరణ. వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం.. వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశాం, డయాలసిస్ సెంటర్లనూ అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. నిమ్స్‌లో మరో 2 వేల పడకల ఏర్పాటు, వరంగల్‌లో ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకోగా.. మరో 91,142 పోస్టులను భర్తీ చేసుకుంటున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది.. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగింది. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల స్థాపన సులభమై పెట్టుబడులు పెరిగాయి. ఎనిమిదేళ్లలో రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించాం. 1,500కుపైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువయ్యాయి. ఐటీ ఉద్యోగాల సృష్టిలో కర్ణాటకను వెనక్కి నెట్టి తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఐటీ ఎగుమతుల విలువ 1.83 లక్షల కోట్లకు పెరిగింది. టీ–హబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. అప్పుల పేరుతో బురద చల్లుతున్నారు తెలంగాణ అనూహ్య ప్రగతి సాధిస్తుంటే.. కొందరు మాత్రం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. కేంద్రం లెక్కల ప్రకారమే 2019–20 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,25,450 కోట్లు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75,577 కోట్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,49,873 కోట్లు మాత్రమే. దీన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడిగానే వినియోగించాం. జీఎస్డీపీ ప్రకారం దేశంలో 22 రాష్ట్రాలకు తెలంగాణ కన్నా అధికంగా అప్పులు ఉన్నాయి. జీఎస్డీపీలో రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23:5 శాతమే.. అదే జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50:4 శాతం. ఈ వాస్తవాన్ని గమనించకుండా కొందరు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి, విలువలకు తూట్లు పొడుస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీన పరిచే కుట్రలు చేస్తోంది. పన్నుల ఆదాయంలో న్యాయబద్ధంగా 41 శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉన్నా.. సెస్‌ల విధింపు రూపంలో దొడ్డిదారిన దోచుకుంటోంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి చివరికి తోక ముడిచింది. ప్రధాని స్వయంగా క్షమాపణ చెప్పారు. కేంద్రం పాల నుంచి శ్మశానవాటికల దాకా అన్నింటిపై పన్నులతో జనంపై భారం మోపుతోంది. ఉచితాలు అంటూ సంక్షేమ పథకాల అమలును అవమానిస్తోంది. తెలంగాణలో మత చిచ్చు రేపే యత్నం కేంద్రం అసమర్థత వల్లే దేశ ఆర్థిక వృద్ధి కుంటుపడింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ పడిపోయింది. వీటన్నింటినీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకే కొందరు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు తెగబడుతున్నారు. ఇది చూసి స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. తెలంగాణలోనూ మతచిచ్చు రేపి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి, అభివృద్ధిని ఆటంకపర్చేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరముంది. రవీంద్రుడి ప్రార్థనను గుర్తు చేసుకుందాం.. ‘ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో, ఎచట మనిషి ఆత్మ విశ్వాసంతో తలెత్తుకుని తిరగగలడో, ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకమూ ఉండదో, ఎచట లోకం ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, ఎచట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ ముందుకు సాగిపోతుందో.. అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల స్వర్గంలో.. తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు..’ అన్న విశ్వకవి రవీంద్రుడి ప్రార్థనలోని ఉదాత్త విలువలను మననం చేసుకుందాం. స్వాతంత్య్రోద్యమ ఆశయాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. నల్లగొండ గోస మీద పాట కూడా రాసిన.. ఫ్లోరైడ్ బాధితులకు అండగా ఉద్యమకాలంలో నల్లగొండ నగారా పేరుతో నేను స్వయంగా పోరాడాను. ‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ’ అంటూ అప్పట్లో ఓ పాట కూడా రాశాను. ఇప్పుడు ఆ ఫ్లోరైడ్ భూతం లేకుండా స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. మిషన్ భగీరథ పేరుతో 100 శాతం ఆవాసాలకు మంచినీళ్లు అందిస్తున్నాం. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని పార్లమెంటు వేదికగా కేంద్రం కొనియాడింది. గోల్కొండ కోటలో ఉత్సాహంగా వేడుకలు దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం 10.07 గంటలకు ఆయన కోట వద్దకు చేరుకున్నారు. లోపల రాణిమహల్ ముందున్న పచ్చిక బయళ్లలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత వాహనంలో లోపలికి వచ్చారు. 10.15 గంటల సమయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించారు. సీఎం ప్రసంగానికి ముందు, తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి. అయితే సీఎం ప్రసంగం కాసేపట్లో ముగుస్తుందనగా వర్షం ప్రారంభమైంది. త్రివర్ణ దుస్తుల్లో పరేడ్ నిర్వహించి నేలమీద కూర్చున్న విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. కోట గోడల మీద నిలబడ్డ కళాకారులు తడిసిపోయారు. ఇక సీఎం వెళ్లిపోగానే అంతా గోల్కొండ నుంచి బయటికి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ డుమ్మా.. ఆఖరి నిమిషంలో.. -
Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ
సాక్షి, హైదరాబాద్: ‘అతిథి దేవోభవ’ అంటూ భాగ్యనగరం పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్ వంటి శతాబ్దాల నాటి చారిత్రక కట్టడాలు యథావిధిగా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వివిధ దేశాల నుంచి ప్రతిరోజు 5000 మంది, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 10 వేల మందికి పైగా పర్యాటకులు హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య సాధారణ రోజుల్లో 3000 వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 7500 వరకు ఉంటుంది. మరో 2000 నుంచి 2500 మంది విదేశీ పర్యాటకులు నగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కోవిడ్ కారణంగా ఈ రాకపోకల్లో స్తబ్దత నెలకొంది. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి మొదలైంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, పర్యాటకులు నగరాన్ని సందర్శిస్తున్నారు. అలాగే విదేశీ రాకపోకలు కూడా పెరిగాయి. యూరోప్ దేశాల నుంచి నగరానికి ఎక్కువ మంది వస్తున్నట్లు జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ ఆంక్షలను తొలగించినప్పటికీ చాలా మంది వేచి చూసే ధోరణి వల్ల ప్రయాణం వాయిదా వేసుకున్నారని, రెండు నెలలుగా రాకపోకలు తిరిగి ఊపందుకున్నాయని పేర్కొన్నారు. ఇది ‘రివెంజ్ టూరిజం’... ఏడాదికోసారి ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి సేదతీరడం సాధారణమైన అంశం. అలాగే పర్యాటక ప్రియులు సైతం దేశవిదేశాలను సందర్శించి తమ అభిరుచిని చాటుకుంటారు. కానీ కోవిడ్ కారణంగా ఈ పర్యటనలు నిలిచిపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో గట్టు తెగిన ప్రవాహంలా జనం రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అనూహ్యంగా పెరిగిన పర్యాటకుల తాకిడిని ట్రావెల్స్ సంస్థలు ‘రివెంజ్ టూరిజం’గా అభివర్ణిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలోనే భారతదేశ సందర్శన కోసం తరలి వస్తున్నారు. ఢిల్లీ, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన వాళ్లు దక్షిణాదిలో హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, తదితర ప్రాంతాలతో పాటు రామప్ప ఆలయాన్ని సైతం ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. కోవిడ్‌కు ముందు ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే గత మే నెలలో 93 శాతం మంది జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 86 శాతం వరకు ఉండడం గనార్హం. జూన్ 10వ తేదీన ఒక్క రోజే 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్ తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల సంఖ్య పెరగడంతో అందుకనుగుణంగా ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. మే నెలలో 15 లక్షలకు పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 2.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరారు. నగరం నుంచి ఇప్పుడు లండన్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్, ఖతార్, షార్జా, దోహా, కువైట్లకు సర్వీసులు నడుస్తున్నాయి. హాంకాంగ్ మినహా, అంతకుముందున్న అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇప్పుడు విమాన సర్వీసులు ఉన్నాయి.కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకూ విమాన సర్వీసులను జోడించారు. (క్లిక్: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..) -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి
సాక్షి, చందుర్తి(కరీంనగర్): సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, ఖిల్లా మీది నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన చందుర్తి మండలంలోని ఎన్గల్‌లో విషాదం నింపింది. గ్రామానికి చెందిన సింగం స్వామి–రాజమణి దంపతులకు కుమారుడు రంజిత్(25) డిగ్రీ వరకు చదువుకుని, హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రంజిత్ (ఫైల్) బుధవారం గోల్కొండ ఖిల్లాను చూసేందుకు వెళ్లి, సెల్ఫీ దిగేందుకు ఖిల్లా ఎక్కాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి తమ్ముడు రాకేశ్, ఒక అక్క ఉన్నారు. -
గోల్కొండలో నల్ల పిల్లి కలకలం..
గోల్కొండ/బహదూర్‌పురా: గోల్కొండలో అడవిపిల్లి (ప్లామ్ సివెంట్) కలకలం సృష్టించింది. అయితే దీనిని మొదట స్థానికులు నల్ల చిరుత అనుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 గంటల పాటు ఇళ్లపై తిరిగిన ఈ అడవి జాతి పిల్లిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గోల్కొండ నూరాని మసీదు పై బుధవారం రాత్రి చిరుతను పోలిఉన్న ఓ జంతువు కనిపించింది. అనంతరం అది మసీదు పొరుగున ఉన్న ఇళ్లపై నుంచి దూకు తూ కలకలం సృష్టించింది. ఇది చిరుతను పోలి ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల తలుపులు, కిటికీలు మూసు కున్నారు. మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మోసిన్ బాకుల్కా ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బుధవారం రాత్రి అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ, జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 3 గంటల పాటు ఇళ్లపై తిరుగుతూ అది పట్టుబడకుండా తప్పించుకుంది. గురువారం ఉదయం ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. ఇది చిరుత కాదని, అడవిలో సంచరించే పిల్లి అని తెలిపారు. ఇది గోల్కొండ కోట ప్రహరీ, దానిని ఆనుకుని ఉన్న కందకాలు, చెట్లలో నుంచి జనావాసాలలోకి వచ్చి ఉంటుందని ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పిల్లి రకాల్లోన్ని మరణాంగి జాతికి చెందినదని జూ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సయ్యద్ అసదుల్లా చెప్పారు. ప్రస్తుతం ఇది జూలో సురక్షితంగా ఉందన్నారు. -
అన్నిరంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది
-
పంద్రాగస్టు.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ విభాగం పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతోంది. ‘కోట’ను పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఉంచనుంది. పరిసర ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గాలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదిక 120 అదనపు కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు... వీటిని బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)తో అనుసంధానించారు. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను వీక్షించేలాఏర్పాటు చేశారు. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఏవైనా సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరిస్తుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం అన్ని విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ చర్యల్లో భాగంగా కోటతో పాటు రాజ్‌భవన్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి సిటీ సీపీ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కోట, రాజ్‌భవన్‌ను సందర్శించి అవసరమైన మార్పుచేర్పులు సూచించనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ... గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి వీల్లేదు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా కచ్చితంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరవ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నిర్వహణకు ఏర్పాట్లు... పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్, రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ విభాగం తరఫున పటిష్ట ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ వింగ్ చీఫ్ అనిల్‌కుమార్ వెల్లడించారు. 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, బాబూరావులతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోల్కొండ, సికింద్రాబాద్, రాజ్‌భవన్‌లో జరిగే మూడు కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, అక్కడి నుంచి గోల్కొండ కోటకు వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఆయా రూట్లలో చేపడుతున్నట్లు వివరించారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా ప్రభుత్వం పాసులు జారీ చేసిందన్నారు. పాస్‌ల వెనకాల పార్కింగ్ స్థలం, వేడుకలకు వచ్చే మార్గం తదితర సూచనలు ఉన్నాయన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారన్నారు. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ గొడుగులను అందుబాటులో ఉచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్కొండకు వచ్చే వారి కోసం రూట్‌మ్యాప్ విడుదల చేశారు. పాస్‌లున్న వారు స్పష్టంగా కన్పించే విధంగా కారుకు ముందుభాగంలో అంటించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా...గోల్కొండ చుట్టుపక్కల... ♦ బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రాందేవ్‌గూడ–గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం 7:30–10గంటల వరకు ఈ రూట్లోకి అనుమతిస్తారు. ♦ సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్‌టర్న్ తీసుకొని బాలికా భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పుఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడ వారికి కేటాయించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేయాలి. రాజ్‌భవన్ రోడ్డులో... ♦ రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాల నేపథ్యంలో సాయంత్రం 4:30గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాజ్‌భవన్ రూట్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిదని అదనపు సీపీ సూచించారు. ♦ తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వేడుకకు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్–1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత వీటిని కేటాయించిన స్థలంలో పార్కు చేయాలి. ♦ పింక్ కారు పాస్ కల్గిన ఇతర అతిథులు గేట్–3 నుంచి లోపలికి వెళ్లి అక్కడే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గినవారు గేట్–3 వద్ద ఆగి ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి. సికింద్రాబాద్‌లో... పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు అమలులో ఉంటాయి. -
జనసంద్రమైంన గోల్కొండ కోట
-
గోల్కొండలో వైభవంగా ప్రారంభమైన బోనాలు
-
బోనమెత్తుదాం రండి
ఆషాఢ బోనాలకు గ్రేటర్ సిద్ధమయింది. ఆదివారం నుంచి గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాక్షి, సిటీబ్యూరో: ఆషాఢమాసం... ఆధ్మాత్మిక ఆదివారం. ఆబాలగోపాలాన్ని పులకింపజేసే అద్భుత క్షణాలు... నాలుగు శతాబ్దాల మహోన్నత చారిత్రక ఈ వేడుక. విభిన్న వర్గాలను, భిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. ఆదివారం గోల్కొండ జగదాంబిక బోనాలతో ఆరంభమయ్యే వేడుకలకు నగరం సర్వం సన్నద్ధమైంది. అదేరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఈ నెల 29, 30 తేదీల్లో మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ అధికారిక పండుగ అయిన బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఆ తరువాత లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల వేడుక జరుగనుంది. ఈ వేడుకలతో పాటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ జరుగనుంది. అన్ని ప్రధాన ఆలయాల్లో ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగదాంబిక ఆలయ మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. శుక్రవారం స్థానిక మహిళలు మెట్ల పూజలు చేశారు. ఆలయానికి వెళ్లే అన్ని మెట్లను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. ఆలయం వద్ద భక్తులు బోనాలు సమర్పించేందుకు అనుగుణంగా వాటర్‌ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు. రామదాసు బందీఖానా, నగీనాబాగ్, తదితర ప్రాంతాల్లోనూ భక్తుల కోసం అదనంగా వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవానికి సర్వం సన్నద్ధమైన గోల్కొండ కోటను రంగురంగుల విద్యుద్దీపాలతో అందమైన వెలుగుల కొండలా తీర్చిదిద్దారు. అధికార లాంఛనాలతో ఉత్సవాలు... డప్పు దరువులు, హోరెత్తించే పాటల పరవళ్లు, పోతరాజు నృత్య ప్రదర్శనల నడుమ ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్లె ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగత వేదికపై రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, అధికార లాంఛనాలు, అలాగే సాక సమర్పిస్తారు. దీంతో అట్టహాసంగా వేడుకలు ప్రారంభమవుతాయి. భారీ ఊరేగింపుతో తొట్టెల ప్రదర్శన ముందుకు సాగుతుంది. ఊరేగింపు చోటా బజార్‌కు చేరుకున్న తరువాత అనంతాచారి ఇంటి నుంచి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకొని బయలుదేరుతారు. అక్కడి నుంచి తొట్టెలు, రథం, అమ్మవార్ల విగ్రహాలు ప్రదర్శనగా బయలుదేరుతాయి. నిజాం కాలం నుంచి బోనం సమర్పిస్తున్న పటేలమ్మ బోనం ఈ ప్రదర్శనలో కలుస్తుంది. అంతా కలిసి జగదాంబిక ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో జగదాంబిక, మహంకాళి అమ్మవార్లను ప్రతిష్టించడంతో ఆ రోజు వేడుక ముగుస్తుంది. 15వ తేదీ నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురు వారాల్లో 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 22వ తేదీ ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క రోజు 3 లక్షల మందికి పైగా భక్తులు రానున్నట్లు అంచనా.. బోనాలు.... శక్తి స్వరూపినైన అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో తాము తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించడమే బోనం. స్త్రీలు తల స్నానం చేసి నూతన వస్త్రాలతో ఒక పాత్రకు పసుపును పూసి దానికి వేపాకు కొమ్మలతో పసుపు నీటిని తీసుకుని వచ్చి అమ్మవారికి సాకను సమర్పిస్తారు. మేళతాళాలు, డప్పుల దరువులతో అమ్మవారికి సాకను సమర్పిస్తారు. 163 ఏళ్లుగా ఉజ్జయిని అమ్మవారి సేవలో... మారేడుపల్లి: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మారేడుపల్లి ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఘటం అలంకరణ నుంచి జాతర ముగింపు, అమ్మవారిని సాగనంపే వరకు మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులు వంశపారంపర్యంగా అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. కీలక ఘట్టమైన రంగం (భవిష్యవాణి)కి పచ్చికుండను తరతరాలుగా ఈ కుటుంబ సభ్యులే అందజేస్తున్నారు. అమ్మవారికి మొదటి సేవ కుమ్మరి కులస్తులు చేయాల్సి ఉంటుంది. 163 ఏళ్ల క్రితం ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకువచ్చి మహంకాళి ఆలయంలో ప్రతిష్ఠించినప్పుడు కుమ్మరి వారిచే పూజ నిర్వహించాల్సి ఉండగా ఆ కులానికి పెద్దమనిషిగా ఉన్న డిఫెన్స్ కాంట్రాక్టర్ సికింద్రాబాద్‌కు చెందిన కుమ్మరి రత్నయ్యకు అవకాశం లభించింది. అనంతరం తరతరాలుగా అతడి కుటుంబ సభ్యులకే అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం లభించింది. ప్రస్తుతం అలంకరణ కార్యక్రమాన్ని వెస్ట్ మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులైన కుమ్మరి బిజ్జవరపు వినోద్ నిర్వహిస్తారు. పచ్చికుండకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈనెల 30న జరిగే రంగం కార్యక్రమానికి భాజాభజంత్రీలతో అర్ధరాత్రి మహంకాళి ఆలయానికి చేరుకుంటారు. -
ఐటీసీకి చార్మినార్, జీఎమ్ఆర్కు గోల్కొండ!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్ఆర్, ఐటీసీ హోటల్స్ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్ కమిటీ, ఒవర్‌నైట్ కమిటీ ఆమోదించాయి. అలానే జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ఈ ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్వోయూను కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ :... చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్ కంపెనీ 25 కోట్ల రూపాయల టెండర్ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) : ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం. -
అప్పట్లోనే ఖజానా బిల్డింగులు
సాక్షి, సిటీబ్యూరో: కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల పాలనా కాలంలోనే ట్రెజరీ వ్యవస్థ ఉంది. అప్పుడే నగరంలో ఖజానా బిల్డింగుల నిర్మాణం జరిగింది. ఇబ్రహీం కుతుబ్‌షా (1550–80) గోల్కొండ కోటలో ఖజానా బిల్డింగ్ నిర్మించగా... రెండో నిజాం నిజామ్‌అలీ 1876లో ఖిల్వత్ ప్యాలెస్ ఎదుట ఖజానా భవనం నిర్మించాడు. వీటిలో ప్రభుత్వ డబ్బు, విలువైన పత్రాలు, ధాన్యం, ఆభరణాలు తదితర ఉండేవి. ఔరంగజేబు దాడి వరకు గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ ప్రభుత్వ ఖజానాగానే కొనసాగింది. అనంతరం కుతుబ్‌షాహీల సైన్యం ప్రధాన కార్యాలయంగా మారింది. తర్వాత ఆసఫ్‌జాహీల కాలంలోనూ ఇది అలాగే కొనసాగింది. ఇప్పటికీ ఇది చెక్కుచెదరకుండా ఉంది. ఇందులో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఇక ఖిల్వత్ ఖజానా భవనం కూల్చివేయగా, స్థలం ట్రెజరీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది. -
అప్పుడే సిటీ వదిలెళ్లాలని లేదు
-
గోల్కొండ కోటలో 'నెలవంక'
సాక్షి, హైదరాబాద్: అమెరికా నెలవంక ఇవాంకా.. చారిత్రక గోల్కొండ కోటలో సందడి చేసింది. వైభవోపేతమైన కోట చరిత్ర తెలుసుకొని మంత్రముగ్ధురాలైంది. నాలుగు వందల ఏళ్ల నాటి భాగ్యనగర చారిత్రక విశేషాలను ఎంతో ఆసక్తిగా ఆలకించింది. హైదరాబాద్ నగరాన్ని స్థాపించిన కుతుబ్‌షాహీల ప్రస్థానం, శత్రుదుర్భేద్యమైన కోటలు, ప్రాకారాలు, దర్వాజాలు తదితర కట్టడాల నిర్మాణం చూసి అబ్బురపడింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాంకా బుధవారం మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.56 వరకు సుమారు 45 నిమిషాలకు పైగా గోల్కొండ కోటలో పర్యటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమె పర్యటన కొనసాగింది. కోట ప్రధాన ద్వారంలోకి ప్రవేశించింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. చప్పట్లు ప్రతిధ్వనించే క్లాప్పోర్టికో వద్ద చప్పట్లు తిరిగి వినిపించే తీరుపై అమితాసక్తిని ప్రదర్శించారు. కుతుబ్‌షాహీల రెండంతస్థుల ఆయాధాగారం, బ్యారక్‌లు, పచ్చటి పచ్చిక బయళ్లు, పూలతో ఎంతో అందంగా కనిపించే నగీనాబాగ్, కుతుబ్‌షాహీల అంతఃపురం రాణీమహల్, తారామతి మసీదు, రామదాసు బందీఖానా తదితర ప్రాంతాలను ఇవాంకా కాలినడనే సందర్శించారు. పర్యాటక, ఆర్కియాలజీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆమెకు గోల్కొండ కోట విశేషాలను వివరించారు. కుతుబ్‌షాహీల చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. హస్తకళల ప్రదర్శన గోల్కొండ మార్గంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారయ్యే బొమ్మలు ఇవాంకాను ఆకట్టుకున్నాయి. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక, లేపాక్షి, గోల్కొండ తదితర హస్తకళా వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాలు వంటి 12 స్టాళ్లను ఇవాంక రాక సందర్భంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించే హస్తకళల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆతిథ్యం అదరహో.. ఫలక్‌నుమాలో మొఘలాయీల వంటకాలు ఆరగించిన విదేశీ అతిథులు.. బుధవారం గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ వంటకాలను రుచి చూశారు. ప్రపంచంలో మరెక్కడా లభించని అద్భుతమైన రుచులు తెలంగాణ సొంతమని పలువురు ప్రతినిధులు కితాబునిచ్చారు. తెలంగాణ ప్రజలు వండుకొనే అన్ని రకాల వంటకాలను ఈ విందులో రుచి చూపించారు. జొన్నరొట్టె, సజ్జ రొట్టె, సర్వపిండి, అంబలి, జొన్నగట్క మొదలుకొని హైదరాబాద్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, బగారా రైస్, పులావ్, తలకాయ మాంసం, మటన్, కాళ్ల షోరువా, బోటి కూర, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పచ్చిపులుసు, రొయ్యల పులుసు, కోరమీను చేపల పులుసు, ఫిష్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్, ఎగ్ కర్రీ, ఎగ్పులుసు, పప్పు, సాంబారు వివిధ రకాల కూరగాయలతో చేసిన నాన్ వెజ్ వెరైటీలు, సకినాలు, గర్జెలు, లడ్డూలు, గారెలు, పకోడీ, మలీద ముద్ద తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోల్కొండ కోటలో విందు కొనసాగింది. సుమారు 1,500 మంది ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు. ఆర్టీసీ, పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఈ ప్రతినిధులంతా గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ నేతృత్వంలో సుమారు 200 మంది కళాకారులతో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది. శాస్త్రీయ, జానపద, గిరిజన కళారూపాలు విదేశీ అతిథులను అబ్బురపరిచాయి. తెలంగాణ బతుకమ్మ, బోనాలు, తెలంగాణ తల్లి, రాణీ రుద్రమ తదితర నృత్య ప్రదర్శనలు, డప్పు దరువు, పేరిణీ నృత్యం, కథక్, సూఫీ తదితర నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల రాణీరుద్రమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీపికారెడ్డి తెలంగాణ తల్లి కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. మంగళ్‌భట్ కథక్, కళాకృష్ణ పేరిణి, స్నేహ మంగాపు భరతనాట్యం, రాఘవరాజ్ భట్ సూఫీ, షేక్ హనీఫ్ అహ్మద్ మార్షల్ ఆర్ట్స్, ప్రమోద్‌రెడ్డి రామదాసు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు. మళ్లీ మళ్లీ హైదరాబాద్ రావాలనిపిస్తోంది హైదరాబాద్ చాలా బాగుంది. గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ వంటి గొప్ప కట్టడాలను చూస్తోంటే మళ్లీ మళ్లీ హైదరాబాద్‌కు రావాలనిపిస్తోంది. ఫూడ్స్ చాలా బాగున్నాయి. బిర్యానీ టేస్టీగా ఉంది. ఈ వంటకం తినడం ఇదే మొదటిసారి. –గోంజా, టాంజానియా అతిథి మర్యాదలు బాగున్నాయి ఆతిథ్యం చాలా బాగుంది. రకరకాల వంటలు రుచి చూశాం. హైదరాబాద్ ప్రజల టేస్ట్ తెలిసింది. మటన్, చికెన్, స్వీట్స్, ఒకటేమిటీ అన్నీ బాగున్నాయి. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. చాలా బాగుంది. రుచికరమైన వంటల్లో హైదరాబాద్ చాలా ఫేమస్ అని తెలిసిపోయింది. – మెరీనా, ఇటలీ గ్రేట్ వర్క్ ఇవాంకా.. జీఈఎస్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిచ్చావ్ కుమార్తె ఇవాంకాపై ట్వీటర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు వాషింగ్టన్: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తోందంటూ తన కుమార్తె, సలహాదారు ఇవాంకాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘గ్రేట్ వర్క్ ఇవాంకా’అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్లో మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. అమెరికన్ల కలలను నిజం చేసేలా పారిశ్రామికవేత్తల కోసం అమెరికా తీసుకుంటున్న చర్యలపై జీఈఎస్‌లో ఇవాంకా చేసిన వ్యాఖ్యలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. దీనిని రీట్వీట్ చేసిన సందర్భంగా ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ కూడా ఇవాంకాపై పొగడ్తలు కురిపించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవాంకా భారత్‌లో పర్యటించడం ఉద్విగ్నంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను పెట్టుబడిదారులుగా.. మెంటార్లుగా అవకాశంతో పాటు వారికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారని ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. వేల దిగ్గజాలు.. లక్షల ఆలోచనలు ఉత్సాహంగా రెండోరోజు సదస్సు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజున విజయవంతంగా సాగింది. దాదాపు 20కు పైగా చర్చాగోష్ఠులు, సామూహిక సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తమ ఆలోచనలు పంచుకున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లీనరీ సెషన్‌తో సదస్సు ప్రారంభమైంది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం, పని ప్రదేశాల్లో అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఇవాంకాతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ ఈఎంసీ సీసీవో కరేన్ క్వింటోస్ ఈ చర్చలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సెషన్ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్లీనరీకి ఇవాంకా హాజరవటంతో రెండోరోజు సదస్సు ఉత్సాహంగా ఆరంభమైంది. ఈ చర్చ ముగియగానే ఇవాంకా వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం సదస్సు నుంచి ఆమె తిరుగుపయనమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వరకు మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, వ్యాపార మెలకువలు, ఆరోగ్యరంగం, క్రీడలు, మీడియా వినోద రంగాలపై చర్చాగోష్ఠులు సాగాయి. -
గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్
-
గోల్కొండ కోటలో ఇవాంకా ట్రంప్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోట చేరుకున్నారు. జీఈఎస్‌కు హాజరైన ఇవాంకా ట్రంప్ రెండో రోజు బిజీబిజీగా గడిపారు. ఈ రోజు ఉదయం సమిట్‌లో సెషన్లకు హాజరైన ఆమె తర్వాత చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రత మధ్య ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటకు విచ్చేశారు. అక్కడ ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఇవాంకా వెంట తెలంగాణ సీఎస్ కూడా ఉన్నారు. జీఈఎస్‌కు హాజరయిన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. అంతకు ముందు యూఎస్ సీక్రెట్ ఏజెంట్స్ గోల్కొండ కోటలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోట పరిధిలో రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. -
గోల్కొండలో రాష్ట్ర ప్రభుత్వం విందు
-
మది నిండా.. మువ్వన్నెల జెండా!
గోల్కొండపై జెండా ఎగరేసిన సీఎం ఆకట్టుకున్న కళారూప ప్రదర్శనలు ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు సన్మానం సాక్షి, హైదరాబాద్ రాజన్న ఒగ్గుడోలు.. షేరీ బ్యాండు.. మర్ఫా.. బంజారా నృత్యాలు.. కొమ్ము బూరల సందడి.. పేరిణి శివతాండవం.. ముజ్రా, గుజరాతీ దాండియా.. పంజాబీ భాంగ్రా.. ఒక్కటేమిటీ భిన్న సాంస్కృతిక సౌరభాలు గుభాళిస్తుండగా మంగళవారం హైదరాబాద్ గోల్కొండ కోటలో 71వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కోట గోడలపై సైనికుల దుస్తుల్లో యువకుల కవాతు, అడుగడుగునా అలంకరణలు గోల్కొండకు కొత్త అందాలు తెచ్చిపెట్టాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా నాలుగో పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించింది. మంగళవారం ఉదయం పరేడ్ మైదానంలో అమర జవాన్లకు నివాళులర్పిం చిన సీఎం చంద్రశేఖర్‌రావు 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి అపూర్వ రావు ఆధ్వర్యంలో కోట ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అక్కడ్నుంచి కాన్వాయ్‌లో ప్రధాన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరిం చారు. నార్సింగి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థినులు త్రివర్ణ దుస్తులు ధరించి చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కవి సుద్దాల అశోక్ తేజ, గాయకుడు జయరాజ్, సాహితీవేత్త భాష్యం విజయ సారథి లను సీఎం సన్మానించారు. తర్వాత ఉత్తమ పని తీరు కనబరిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర విభాగాల ఉద్యోగులు, హరితహారంలో విశిష్ట కృషి చేసిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులను సన్మానించారు. మంచిపనితీరు కనబరిచిన పోలీసులకు అవార్డులు అందించారు. కొందరు ఉద్యోగులు సన్మాననం తరం సీఎంకు పాదాభివందనం చేశారు. చక్రాల కుర్చీలో వచ్చిన భాష్యం విజయసారథికి సీఎం పాదాభివందనం చేశారు. మరణానంతరం ఇద్దరు పోలీసు అధికారుల భార్యలకు పురస్కారం అందించారు. సిద్ధయ్య అనే ఎస్సై భార్య తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని, ఇతరత్రా రావాల్సిన లబ్ధికి సంబంధించి సీఎంకు విన్నవించగా వెంటనే వాటిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు. ఒక్కో కళారూపానికి అర నిమిషమే... తెలంగాణ సంప్రదాయ కళారూపాల ప్రదర్శనకు గోల్కొండ కోట వేదికైంది. కళాకారులను ఉదయమే తీసుకొచ్చి వేడుక జరిగే వేదిక చుట్టూ ఉన్న కోట గోడలపై వరుసగా నిలబెట్టారు. ముఖ్య మంత్రి వచ్చే ముందు వారితో కళారూపాలవారీగా ప్రదర్శనలు ఇప్పిం చాల్సి ఉంది. కానీ సమయాభావం పేరుతో ఒక్కో కళారూపానికి కేవలం అర నిమిషం సమయం మాత్రమే కేటాయించారు. దీంతో వారు ప్రదర్శన మొదలుపెట్టి ఊపందుకునే లోపే బలవంతంగా ఆపేయించాల్సి వచ్చింది. సీఎం వేదిక వద్దకు వచ్చిన వేళ అన్ని కళారూపాలను కలిపి ప్రదర్శించమన్నారు. వెరసి అటు కళాకారులు, ఇటు సందర్శకులు నిరుత్సాహానికి గురి కావాల్సి వచ్చింది. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ గోల్కొండలో వేడుక ఇరుకు ప్రాంతంలో జరగటంతో ఎక్కువ మంది కూర్చునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సాధారణ ప్రజలను పోలీసులు లోనికి అనుమ తించలేదు. తమ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేసి రాకుండా అడ్డు కోవటం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్లున్నప్పటికీ లోపల కూర్చునేందుకు స్థలం లేక వెనుదిరగాల్సి వచ్చింది. ఇక వాహనాలను పార్క్ చేయటం పెద్ద సమస్యగా మారింది. ఓ మైదానంతోపాటు హెచ్ఎండీఏ పార్కు స్థలాలను అందుకు కేటాయించినా ఇరుకు రోడ్లలో వాహనాలు ముందుకు కదల్లేక ఇబ్బంది ఎదురైంది. కోట ప్రధాన రహదారిపైనే భారీ సంఖ్యలో కార్లను నిలిపివేయటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇక కోట ప్రధాన రహదారులను సరిగా శుభ్రపరచలేదు. చెత్త, మురికినీళ్లు అలాగే ఉండడంతో ఆ ప్రాంతాలు దుర్గంధంతో నిండిపోయాయి. -
గోల్కొండ కోటపై జెండా పండుగ
-
ఏఐఎస్ అధికారులకు సీఎం సన్మానం
పథకాల అమల్లో చేస్తున్న విశేష కృషికి గౌరవం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకె ళ్లేందుకు అవిరళ కృషి చేస్తున్న ఆల్ ఇండియా సర్వీసు అధికారులను స్వాతంత్య్ర దినోత్సవాన సన్మానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ కిట్ పథకాన్ని విజయవంతం చేయడం, ప్రభుత్వ వైద్యశాలల పనితీరును మెరుగు పరచడంలో విశేష కృషి చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను విశిష్ట సేవలందించిన ఐఏఎస్ అధికారిగా గుర్తించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను సమర్థంగా నడుపుతూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, పౌరసరఫరాల వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్న సీవీ ఆనంద్‌లను ఐపీఎస్ కేటగిరీలో, మైనారిటీ గురుకుల పాఠశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎండీ షఫీవుల్లాను ఐఎఫ్ఎస్ అధికారుల విభాగంలో సన్మానానికి ఎంపిక చేశారు. మంగళవారం గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో సీఎం కేసీఆర్ వారిని సత్కరించ నున్నారు. -
గోల్కొండ కోటపై జెండా పండుగ
రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగోసారి స్వాతంత్య్ర వేడుకలు జాతీయ జెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్ ఘనంగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి వర్ష సూచనతో ప్రత్యేకంగా షెడ్ల ఏర్పాటు స్వాతంత్య్ర దినోత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలోనే అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోటపై జెండా ఎగరేయనున్నారు. ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కోటలోని రాణీమహల్ లాన్స్‌ను పూలతో అందంగా, ఆకర్షణీయంగా అలంకరించడమే కాకుండా భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేసింది. – సాక్షి, హైదరాబాద్ ఇదీ సీఎం షెడ్యూల్.. మంగళవారం ఉదయం అమర వీరుల స్మారక స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 9.50 గంటలకు పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులకు ఎంపికైన అధికారులు, ప్రజాప్రతినిధులు, అవార్డు గ్రహీతలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేస్తారు. పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. వేడుకల నిర్వహణకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయటంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. వర్ష సూచనతో అప్రమత్తం.. వరుసగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షం కురిసినా స్వాతంత్య్ర దినోత్సవాలకు అంతరాయం కలగకుండా గోల్కొండ కోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కోటలో సీఎం ప్రసంగించే వేదికకు ఇరువైపులా వీఐపీ గ్యాలరీల్లో వర్షం కురవకుండా రేకుల షెడ్లను అమర్చారు. గవర్నర్ శుభాకాంక్షలు తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న ఎందరో నిస్వార్థ దేశభక్తుల త్యాగ నిరతికి ఈ వేడు కలు జ్ఞాపకార్థంగా నిలుస్తాయని తన సందేశంలో పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛా ఫలాలను అందించిన దేశభక్తులను స్మరించుకుంటూ ప్రజలం దరూ స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
భువిలో దివి!
(300 ఏళ్ల నాటి మొఘల్ గార్డెన్ నమూనా) ‘నయా ఖిల్లా’ భూగర్భంలో అద్భుత ఉద్యానవనం - 300 ఏళ్ల నాటి ‘మొఘల్ గార్డెన్’ను గుర్తించిన పురావస్తు పరిశోధకులు - భారీ ఫౌంటెయిన్లు, నీటి కొలనులు, గార్డెన్లు - గ్రావిటీతోనే నీరు ఎగసిపడేలా ఏర్పాట్లు - కుతుబ్‌షాహీల సమయంలో నిర్మాణం - ఇరాన్ నిపుణుల ఆధ్వర్యంలో ఏర్పాటు - తాజ్‌మహల్ మొఘల్ గార్డెన్‌కు ఇదే మాతృక! సాక్షి, హైదరాబాద్: మూడు శతాబ్దాల కిందటి విశాల ఉద్యానవనం.. కరెంటు అందుబాటులో లేని ఆ కాలంలోనే అంతెత్తున నీటిని విరజిమ్మే ఫౌంటెయిన్లు.. గురుత్వాకర్షణ శక్తితో నీటిని తీసుకెళ్లే భూగర్భ కాలువలు.. మిగులు నీటిని ఇతర అవసరాలకు వినియోగించే ఏర్పాట్లు.. ఇదంతా ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే.. గోల్కొండ కోటలోని నయా ఖిల్లా ప్రాంతంలోనే అలరారిన ఉద్యానవనం అద్భుతాలివి. అద్భుతమైన ప్యాలెస్‌లు, ఉద్యానవనాలకు పెట్టింది పేరైన ఇరాన్లో రూపుదిద్దుకున్న పర్షియా గార్డెన్ల తరహాలోనే దీనినీ నిర్మించారు. తాజ్‌మహల్ వద్ద ఉన్న మొఘల్‌గార్డెన్‌కు మాతృక అనదగ్గ ఈ అద్భుత ఉద్యానవనం ఆనవాళ్లను పురావస్తు శాఖ తాజాగా వెలుగులోకి తెచ్చింది. మొఘలుల కాలం కంటే ముందే రూపుదిద్దుకున్న ఈ ఉద్యానవనం.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో కుతుబ్‌షాహీల పాలన ముగియటంతోనే కాలగర్భంలో కలిసిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కడుంది..? గోల్కొండ కోటలో అంతర్భాగంగా ఉన్న నయా ఖిల్లా వద్ద ఈ ఉద్యానవనం ఉంది. కాకతీయుల కాలంలో అబ్బురపడే రీతిలో నిర్మితమైన గోల్కొండ.. కుతుబ్‌షాహీల వశం అయ్యాక దాన్ని పర్షియన్ నమూనాలోకి మార్చడం ప్రారంభించారు. అందులో భాగంగా పక్కన 32 ఎకరాల విశాలమైన ప్రాంతం (ప్రస్తుతం నయా ఖిల్లా ఉన్న ప్రాంతం)లో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. అప్పట్లో ఇరాన్ నుంచి నిపుణులను పిలిపించి ఉద్యావనాన్ని రూపొందించారు. దీనికి ప్రస్తుతం లంగర్‌హౌజ్‌లో ఉన్న శాతం చెరువు, గోల్కొండ చెరువు నుంచి నీటిని వినియోగించారు. కాకతీయులు అప్పటికే నిర్మించిన ఆ చెరువుల నుంచి నీటిని తరలించేందుకు భూగర్భంలో టెర్రకోట పైపులతో ప్రత్యేక కాలువలు నిర్మించారు. నీరు గ్రావిటీతోనే తొలుత గోల్కొండలోని కటోరాహౌజ్కు, అక్కడి నుంచి ఈ ఉద్యానవనానికి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఉద్యానవనం చుట్టూ భారీ వృక్షాలను పెంచారు. మధ్యలో అందమైన పూల చెట్లు, నీటి కొలనులు ఏర్పాటు చేశారు. అప్పటికి కరెంటు వసతి లేకున్నా.. గ్రావిటీతోనే నీళ్లు పారి, ఎగజిమ్మేలా ఫౌంటెయిన్లను నిర్మించారు. అప్పట్లో ఈ ఉద్యానవనం దేశంలోనే ప్రముఖంగా వెలుగొందిందని భావిస్తున్నారు. దీనిని చూసే మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్ వద్ద మొఘల్‌గార్డెన్‌ను, ఔరంగజేబు ఔరంగాబాద్‌లో బీబీకా మక్బారా గార్డెన్‌ను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. (తవ్వకాల్లో వెలుగుచూసిన నిర్మాణం) కుతుబ్‌షాహీల అనంతరం కనుమరుగు మొఘలులు గోల్కొండను వశం చేసుకున్న తర్వాత.. పట్టించుకునేవారు లేకపోవటంతో ఉద్యానవనం క్రమంగా కనుమరుగైంది. నిర్మాణాలు మట్టి కింద కూరుకుపోయాయి. అసఫ్‌జాహీల హయాంలో ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడంతో కొంత ప్రాంతం సాగుభూమిగా మారింది. పాత రికార్డుల్లో అది సర్కార్ జమీన్‌గా ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందా అన్న స్పష్టత లేక ఎవరూ పట్టించుకోలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొన్నేళ్ల క్రితం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. తర్వాత సాగు నిలిచిపోయినా.. పాడుబడ్డ స్థలంగానే ఉండిపోయింది. ఆ ఆధారంతోనే.. హైదరాబాద్ సంస్థానంలో పురావస్తు విభాగాన్ని పర్యవేక్షించిన గులామ్ యాజ్దానీ ఈ ఉద్యానవనం గురించి పరిశోధించి ఆ ప్రాంతాన్ని గుర్తించారు. తాను రాసిన పుస్తకంలో ఈ వివరాలను పొందుపరిచారు. ప్రస్తుతం మనకున్న చారిత్రక ఆధారం అదే. అయితే దాదాపు రెండేళ్ల క్రితం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి, ఉద్యానవనం జాడ కనుగొనాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. ప్రాథమికంగా తవ్వి నిర్మాణాలున్నట్టు గుర్తించినా.. పనులు ముందుకు సాగలేదు. ఇటీవల పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు తాహిర్, ఇంజినీర్ గోపాలరావులు తవ్వకాలు ప్రారంభించి ఉద్యానవనాన్ని వెలుగులోకి తెచ్చారు. మరో నెలపాటు తవ్వకాలు జరగనున్నాయి. ఈ ప్రాంతాన్ని తిరిగి పాత ఉద్యానవనంలా మార్చాలని అధికారులు కేంద్రానికి ప్రతిపాదించారు. అనుమతి వచ్చి, నిధులు విడుదలయితే ఆ పనులు కూడా చేపడతామని చెబుతున్నారు. -
కోట పులకించింది
గోల్కొండ: చారిత్రక గోల్కొండ కోట తొలిసారి పూలవనమై పులకించింది. ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలతో పరవశించింది. గుమ్మడి పూలో.. అమ్మ.. బంతీపూలో.. తంగెడపూలో తల్లి.. ఎంగిలిపూలో.. అంటూ సాగిన జానపదాలు కొండ గాలితో కలిసి నగరాన్ని చుట్టేశాయి. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం కోటలో బతుకమ్మ వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. రకరకాల పూలతో కూర్చిన బతుకమ్మలను ప్రాంగణంలో ఉంచి.. చక్కని పాటలకు మహిళా నేతలంతా లయబద్దంగా కదులుతుంటే.. వారితో కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం పాదం కలిపారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి.పద్మజారెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు. -
బోనమెత్తిన గోల్కొండ
సాక్షి,గోల్కొండ: గోల్కొండ కోటలో ఆదివారం బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆషాడ మాసపు బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవార్లకు ఆరవ పూజ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు కోటకు తరలివచ్చారు. పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బంజార దర్వాజ, రాందేవ్‌గూడ ఫతే దర్వాజ నుంచి గోల్కొండకు వ్చచే భారీ వాహనాలు, బస్సులను అనుమతించలేదు. -
కొత్త సచివాలయంలోనే ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాలు.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ పండుగల వేళ జెండా వందన కార్యక్రమం ఇలా ఒక్కోచోట జరుగుతూ వస్తోంది! గోల్కొండ కోటపై జెండా రెపరెపలాడటం ఘనంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా.. అక్కడ స్థలాభావం ఇబ్బంది పెడుతోంది. ఇది కాదంటే మిగిలింది.. రక్షణ శాఖ అధీనంలోని పరేడ్ మైదానం. అసలు ఇవన్నీ ఎందుకు.. సచివాలయం చెంతనే జెండా వందనం నిర్వహిస్తే బాగుంటుంది కదా..! సీఎం మదిలో మెదిలిన ఆలోచన ఇది. కొత్త సచివాలయం ఏర్పడనున్న ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే పరేడ్ మైదానం కూడా కొలువుదీరబోతోంది. ఈ మైదానం కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించనున్నారు. జెండా వందనం, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాలను ఇందులోనే నిర్వహించనున్నారు. దేశంలో మరే సచివాలయం లేని తరహాలో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యంత అధునాతన సచివాలయం రాజధాని నయారాయ్‌పూర్‌లో రూపొందింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలో ఇటీవల అధికారుల బృందం వెళ్లి ఆ సచివాలయాన్ని పరిశీలించి వచ్చింది. అక్కడికన్నా ఎక్కువ ప్రత్యేకతలతో కొత్త సచివాలయం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ప్రస్తుత సచివాలయంలో భవనాల విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. కొత్తగా నిర్మించబోయే సచివాలయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు రాబోతున్నాయి. మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, సిబ్బంది కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండనున్నాయి. వాటితోపాటు ఒక విశాలమైన సమావేశ మందిరం ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేకంగా కేంద్ర సమావేశ మందిరం నిర్మిస్తారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ రూ. 500 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ఇక సందర్శకులు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ పొందే వెసులుబాటు కల్పిస్తారు. అక్కడికి వచ్చేవారికి ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఆధునిక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. 5 వేల వాహనాల సామర్థ్యంతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే హెలీప్యాడ్.. కొత్త సచివాలయంలో సీఎం భవనానికి చేరువలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సచివాలయంలో అనువైన హెలీప్యాడ్ లేక బేగంపేట విమానాశ్రయంలో దిగాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ హెలీప్యాడ్ రూపొందించినా అది భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవటంతో వాడటం లేదు. దీంతో హెలీకాప్టర్ నేరుగా సీఎం కార్యాలయం వరకు వచ్చేలా కొత్త సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలక్‌నుమా తరహాలో అసెంబ్లీ భవనం రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రగడ్డలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలని నిర్ణయించినందున ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో దాన్ని నగరానికి మకుటాయమానంగా మిగిలేలా రూపొం దించాలని అధికారులకు సూచించారు. మ్యూజియంగా మార్చాలా, ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో హోటల్‌గా రూపొందిం చాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో భారీ ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నారు. గతంలో సిగ్నేచర్ టవర్స్ కోసం లుంబినీ పార్కును గుర్తించగా, అక్కడ కుదరదని తాజాగా తేల్చారు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి సచివాలయ ప్రాంగణమే సరిపోతుందని భావిస్తున్నారు. ఐఏఎస్‌లకు ఆధునిక విల్లాలు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అధునాతన రీతిలో 100 విల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత వీటిని ఎర్రగడ్డలోనే నిర్మించాలనుకున్నా.. తాజాగా ఎర్రమంజిల్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇక్కడి పాత క్వార్టర్లు తొలగించి 25 ఎకరాలను నిర్మాణాలకు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం పక్కన ఐఏఎస్ అధికారుల సంఘం భవనం, పాత క్వార్టర్లను తొలగించి.. ముఖ్యమంత్రికి కొత్త అధికారిక నివాసం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు మరో రూ.400 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తమ్మీద కొత్త సచివాలయం, అందులో భవనాల నిర్మాణాలతోపాటు అధికారులకు భవనాలు, సీఎం అధికార నివాసానికి కలిపి రూ.900 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. డిజైన్లు మొదలు నిర్మాణం వరకు వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ వేయనున్నారు. గతంలో అయిదుగురు సభ్యులతో ప్రభుత్వం వేసిన కమిటీలో మరో ముగ్గురిని చేర్చాలని ఇటీవల సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
ఆర్బీఐ గవర్నర్ మనసు దోచిన గోల్కొండ
హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రాశస్త్యాన్ని చాటిచెప్పే చారిత్రక గోల్కొండ కోట అందాలు భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మదిని దోచాయి. రాజన్ శుక్రవారం కుటుంబసమేతంగా కోటను సందర్శించారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన 'సౌండ్ అండ్ లైట్ షో'ను తిలకించి మంత్రముగ్దులయ్యారు. 'అద్భుతమైన ప్రదర్శనిది. ఇక్కడ గొప్ప వాతావరణాన్ని సృష్టించారు. మీరు చరిత్రను సజీవంగా ఉంచున్నారు' అంటూ పర్యాటక శాఖను కొనియాడుతూ సందర్శకుల పుస్తకంలో రాజన్ తన సందేశాన్ని రాశారు. -
గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్
హైదరాబాద్: గోల్కొండ కోట సందర్శకులకు శుభవార్త. లోపలికి అడుగు పెట్టిన దగ్గర్నుంచి కోట పైకి ఎక్కి.. మళ్లీ దిగేవరకు ఆయాసం, చెమటలు అందరికీ అనుభవమే. అయితే ఇకపై ఈ బాధలన్నీ తీరిపోనున్నాయ్. పర్యాటకులు ఎంచక్కా గోల్కొండ కోటలోని స్విమ్మింగ్ పూల్ లో చల్లటి స్నానం చేసి బడలికను ఒదిలించుకోవచ్చు. ఇంతకీ ఆ ఈత కొలను ఎక్కడుందాంటారా.. కోటలోని షాహతిమ్ చెరువు లేదా కటోరా హౌస్ కుంటలను స్విమ్మింగ్ పూల్స్‌గా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శుక్రవారం షాహతిమ్, కటోరా చెరువులను సందర్శించారు. ఈ రెండు చెరువుల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని రూ. 1.25 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించనున్నట్లు సోమేశ్ చెప్పారు. తర్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. చారిత్రక గోల్కొండ కోటలోనే తెలంగాణ ప్రభుత్వం జెండా పండుగ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్: గోల్కొండ వేదికగా 69వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోల్కొండ వేదికగా గ్రామజ్యోతి పథకాన్ని ప్రకటించారు. ఉదయం 9.20 గంటలకు సికింద్రాబాద్‌లో అమరవీరుల, సైనిక స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం 9.50 గంటలకు గోల్కొండ చేరుకున్నారు. అక్కడ రాణీమహల్ వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు * 30 ఏళ్లు చాలా కష్టపడ్డాం * తెలంగాణ వస్తే చీకటి అన్నారు * కోతలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నాం * వచ్చే మార్చి నుంచి ఉదయం పూటే 9 గంటల విద్యుత్ * మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం * 46వేల చెరువులను ఏటా 9వేల చెరువుల అభివృద్ధి * పశ్చిమ బెంగాల్ హైకోర్టు మన పారిశ్రామిక రంగాన్ని మెచ్చుకుంది * పారిశ్రామిక రంగంలో సింగిల్ విండో విధానం అమలు * నాలుగు, రెండు లేన్ల రోడ్డు శరవేగంగా సాగుతోంది * 17వేల కోట్ల రుణాలు మాఫీ * 8500 కోట్లను ఇప్పటికే రైతులకు అందించాం * అన్ని రంగాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం * మిగులు రాష్ట్రం కోసం 91500 కోట్లు సమకూర్చుకున్నాం * దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది * మిషన్ కాకతీయతో ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించాం * హైదరాబాద్‌కు నీటి కొరత రాకుండా రెండు రిజర్వాయర్లు * కాగితాలకే ప్రాజెక్టులు పరిమితమయ్యాయి * తెలంగాణ వైభవానికి గోల్కొండ కోట నిలువెత్తు నిదర్శనం * సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది * రూ.480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు అందజేస్తాం * టీ-పాస్ చట్టం కింద పరిశ్రమల స్థాపనకు రెండు వారాల్లోనే అనుమతులు. -
'కోట'లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
గోల్కొండ: పంద్రాగస్టు పతాకావిష్కరణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటకు రానున్న దృష్ట్యా సెక్యూరిటీ విభాగం అధికారులు కోటలో సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ నర్సింహ పతాకావిష్కరణ వేదిక స్థలాన్ని, దాని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేదిక ఎదురుగా వీఐపీ, వీవీఐపీల కోసం సీట్లు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిల్లో సీఎం కేసీఆర్.. గోల్కొండ కోటకు హెలికాప్టర్లో రావాలనుకుంటే హెలిప్యాడ్‌కు అనువైన స్థలాలపై కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పోలీసుల ఆధీనంలో గోల్కొండ
హైదరాబాద్: రానున్న స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగురవేసే గోల్కొండ కోటను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కదలికలపై సమాచారం ఉన్న కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాయి. అదే విధంగా అమెరికా నిఘా సంస్థలు కూడా భారత్‌పై ఐఎస్ఐఎస్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉన్న గోల్కొండ కోటపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగుర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఫిర్యాదుకు అనుమతి లభించింది. దీంతో పోలీసులు కోట ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసులు, రాష్ట్ర నిఘా వర్గాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
గోల్కొండను అప్పగించండి
- నేడు రక్షణ మంత్రిని కోరనున్న సీఎం కేసీఆర్ - నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి - ప్రధానితోపాటు నలుగురు కేంద్ర మంత్రులను కలిసేలా షెడ్యూల్ హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హస్తినబాట పట్టారు. నాలుగు రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తదితరులు ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు నలుగురు కేంద్ర మంత్రులను కలుసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. గురువారం మధ్యాహ్నం రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కేసీఆర్ కలుసుకోనున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ అధీనంలో ఉన్న గోల్కొండ కోటను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరనున్నారు. దీంతోపాటు పలు అంశాలను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో కొత్త సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. గిరిజనులకు అందుబాటులో ఉండేలా ఈ స్కూల్‌ను వరంగల్ జిల్లాలో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు కంటోన్మెంట్ స్థలాల విషయాన్ని చర్చించనున్నారు. సికింద్రాబాద్‌లో ఇప్పుడున్న కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా నగర శివార్లలోని మెదక్ జిల్లాలో ఉన్న స్థలాలను కేటాయించటంతోపాటు కొత్త కంటోన్మెంట్ నిర్మించాలనే తన ఆలోచనను రక్షణ మంత్రికి వివరించనున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయనకు అందించనున్నారు. ఇదే పర్యటనలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కలుసుకొని హైకోర్టు విభజనను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడును కలుసుకుంటారు. శనివారం ప్లానింగ్ కమిషన్ బిల్డింగ్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సబ్ కమిటీకి కేసీఆర్ ఇప్పటికే చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలోనే ఏడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో ఈ సమావేశం జరగనుంది. ఆదివారం ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. -
కూలిన గోల్కొండ మోతీ దర్వాజా తలుపు
హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోట తలుపు విరిగిపడింది. 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కోట ద్వారాల్లో ఒకటైన మోతీ దర్వాజా తలుపు బుధవారం ఉదయం అకస్మాత్తుగా నేలకూలింది. అయితే, ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. గోల్కొండ కోటకు ఉన్న దర్వాజాలలో ఒకటైన మోతీ దర్వాజా కుడి తలుపు రెక్క బుధవారం ఉదయం దర్వాజాకు అటువైపున కూలింది. పెద్ద శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల్లో ఉండేవారు దర్వాజా వద్దకు పరుగెత్తుకొచ్చారు. సుమారు 20 అడుగుల ఎత్తు ఉన్న భారీ తలుపు రెక్క ఎడమవైపు తలుపు రెక్కపై కూలింది. స్థానికులు చూస్తుండగానే మరోసారి పెద్ద శబ్దం చేస్తూ తలుపురెక్క కింది భాగం చెక్కలు ఊడి దర్వాజా మరింత కిందికి ఒరిగింది. ఈ సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులతో పాటు టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యే సమయం కావడంతో పెరుగుతున్న ట్రాఫిక్‌ను బంజారా దర్వాజా, ఫతే దర్వాజా వైపు మళ్లించారు. బస్సులను ఎండీలైన్స్ నుంచి వెనక్కి పంపారు. గోల్కొండ కోట సీనియర్ పరిరక్షణాధికారి ఎం.సాంబశివకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విరిగిన తలుపు రెక్కను మరమ్మతుల నిమిత్తం కోట లోపలికి త రలించారు. -
గోల్కొండ కోట వద్ద బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్ : గోల్కొండ కోటలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు బుధవారం అడ్డుకుని అరెస్ట్ చేశారు. కోటపై జెండా ఎగురవేసందేకు వెళ్లిన బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, ఎంపీ బండారు దత్రాత్తేయ, పార్టీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కోటలోకి ప్రవేశించేందుకు యత్నం, అరెస్ట్
హైదరాబాద్ : గోల్కొండ కోట వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గోల్కొండ కోటలో జెండా ఎగరవేయడానికి వెళ్తున్న బిజెపి కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కోటకు వెళ్లే అన్ని దారుల వద్దా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కోటలో జెండా ఎగురవేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బాపూ ఘాట్ నుంచి బీజేపీ నేతలు గోల్కొండ కోట వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. -
గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత
హైదరాబాద్ : గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామని బీజేపీ ప్రకటన నేపథ్యంలో అటువైపు వెళ్లే అన్ని దారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా దళాలు మోహరించాయి. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గోల్కొండ కోటపై విమోచన దినోత్సవాల నిర్వహణపై ప్రభుత్వం స్పందించకుంటే తామే రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని బీజేపీ ప్రకటన చేసింది. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. -
అంతా నవాబుల స్టైల్!
సాక్షి, హైదరాబాద్: ‘చుట్టూ రాజభటులు.. మధ్యలో ముజ్రా నృత్యాలు.. ఒకవైపు నౌబత్ సంగీత వాద్యం.. మరోవైపు ఖవ్వాలీ బృందగానం.. ఇంకోవైపు షెహ్రీ బాజా.. మధ్యమధ్యలో పేరిణి శివతాండవం.. చిందు యక్షగానం.. కొమ్ము కోయ, గుస్సాడి, బంజారా, డప్పు నృత్యాలు.. ఒగ్గుడోళ్ల విన్యాసాలు.. కంచు బూరలు.. ఇంకా మంద హెచ్చుల కథలు...’.. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ఆవిష్కృతమైన దృశ్యమిది. నాటి నవాబుల దర్పానికి అద్దం పట్టేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఇలాంటి దృశ్యాలెన్నో శుక్రవారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న వారికి కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గోల్కొండ కోటలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొద్ది మందికే ఆహ్వానం ఉండటంతో... మిగతా వారంతా కోట బయట నిలుచుని వీక్షించేందుకు ప్రయత్నించారు. ఇక కోట లోపలికి వచ్చిన వారంతా ఉదయం నుంచే ప్రారంభమైన జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలను కళ్లార్పకుండా తిలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పరేడ్ మైదానానికి వెళ్లి సైనిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అటు నుంచి నేరుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. సీఎం కాన్వాయ్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే కోట చుట్టూ రాజభటుల వేషధారణలో ఉన్న కళాకారులు తలవంచి నమస్కారం చేయగా.. డప్పులు, సంగీత వాద్యాలు, కంచు బూరలతో మరికొందరు కళాకారులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం ఉత్సాహంగా అందరికీ అభివాదం చేస్తూ రాణిమహల్ వద్దకు చేరుకున్నారు. ఆయన రాగానే అక్కడున్న విద్యార్థులంతా ‘జై తెలంగాణ, జైహింద్’ అని నినదిస్తూ త్రివర్ణాల బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం సీఎం సరిగ్గా 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కేసీఆర్ బయలుదేరుతుండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన కాన్వాయ్ వద్దకు వచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు అదే సమయంలో మజ్లిస్ నాయకులంతా రాణిమహల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చి ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ సతీమణితోపాటు కుమార్తె, అల్లుడు కూడా హాజర య్యారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులంతా గోల్కొండ కోటకు తరలివచ్చారు. -
త్వరలో ఉద్యోగాల జాతర!
► పింఛన్ పెంపు, ‘కల్యాణ లక్ష్మి’ సహా వరాలన్నీ దసరా నుంచి అమలు ► 48 మంది మహిళలకు భూమి పట్టాలు అందజేసిన కేసీఆర్ ► తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండ కోటలో వైభవంగా వేడుకలు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తమకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభవార్త ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ద్వారా త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని... పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను వచ్చే దసరా నుంచి అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు డిపోలు సైతం దసరా నుంచి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో.. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి 23 నిమిషాలు ప్రసంగించారు. సీఎం ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. మహాత్ముడి బాటలోనే.. మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ చరిత్రను సమున్నతంగా చాటిచెప్పే గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఆటో, ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు పేదలు పొట్టకూటికోసం నడుపుకొనే ఆటోలపై రవాణా పన్నును రద్దు చేశాం. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపైనా రవాణా పన్నును మినహాయించాం. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపు కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశాం. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశాం. వడగళ్లు, భారీ వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా అందించాలని నిర్ణయించాం. ఇందుకోసం విడుదల చేసిన రూ. 482 కోట్లు రైతుల ఖాతాల్లోనే నేరుగా జమవుతాయి. పవర్‌లూం కార్మికులను ఆదుకొనేందుకు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఐదున్నర కోట్ల రూపాయలను విడుదల చేశాం. ఎంబీసీలకు ప్రత్యేక పథకాలు.. తెలంగాణలో బీసీలపట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంది. ముఖ్యంగా బాగా వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందిస్తాం. గిరిజన, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించే విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తున్నాం. తెలంగాణలోని గిరిజన తండాలు, 500 వరకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. అందుబాటులో 35 లక్షల ఎకరాలు తెలంగాణలో సాగుకు పనికిరాని 35 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అందులో 10 లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనువుగా ఉంది. ఈ భూమిపై పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 3 లక్షల ఎకరాలను గుర్తించాం. మరో ఆరేడు లక్షల ఎకరాలు కలిపి మొత్తం 10 ల క్షల ఎకరాల ను పారిశ్రామిక జోన్‌గా ప్రకటిస్తాం. క్రీడాకారులకు ప్రోత్సాహం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఇకపై ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆయా పోటీల్లో స్వర్ణ పతకం సాధిస్తే రూ. 50 లక్షలు, రజత పతకం సాధిస్తే రూ. 25 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే రూ. 15 ల క్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకున్నాం. పతకాలు సాధించిన క్రీడాకారులతో సమానంగా కోచ్‌లకు కూడా నగదు అందజేస్తాం. హైదరాబాద్‌కు బస్సు, రైల్వే టెర్మినల్లు హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నాం. 3,600 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతినిచ్చాం. హైదరాబాద్‌ను త్వరలోనే వైఫై నగరంగా, ఐటీ ఇంక్యుబేటర్‌గా మార్చేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌కు నలుదిశలా కొత్తగా బస్, రైల్వే టెర్మినల్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాం. దీంతోపాటు ఫార్మా, స్పోర్ట్స్, సినిమా, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌లను నగరం నలు దిశలా ఏర్పాటు చేస్తాం. చర్చి నిర్మాణానికి పంచాయతీ అనుమతి దళిత, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అనుమతి పొందాల్సి ఉంది. ఇకపై చర్చిల నిర్మాణానికి గ్రామ పంచాయతీ పరిధిలోనే అనుమతి ఇచ్చేలా వెసులుబాటు కల్పిస్తాం. సర్వేపై దుష్ర్పచారం రాష్ట్రంలో ప్రజల పరిస్థితిపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కల్లేవు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లోకి వెళుతున్నాయి. దీనిని అధిగమించేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నాం. కానీ దీనిపై కొన్ని దుష్టశక్తులు లేనిపోని ప్రచారం చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అర్హులకు మాత్రమే అందాలని చేపట్టిన కార్యక్రమమే తప్ప మరొకటి కాదు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రజలు, మేధావుల భాగస్వామ్యంతో పథకాలను రూపొందిస్తాం. అందుకు ప్రజలంతా సహకరించాలి. దళితులకు భూ పంపిణీ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘పేద దళితులకు మూడెకరాల భూ పంపిణీ’ పథకాన్ని గోల్కొండ కోట నుంచి కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఎంపిక చేసిన మొత్తం 48 మంది మహిళలకు సీఎం భూమి పట్టాలను అందజేశారు. మంత్రులు సైతం అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. విజ్ఞానానికి, వైభవానికి ప్రతీక ఇది.. ‘‘తెలుగు జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటిన గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం సముచిత నిర్ణయం. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న గోల్కొండ కోట ఫతేదర్వాజా దగ్గర చప్పట్లు కొడితే బాలాహిస్సార్ దర్వాజా వద్ద ప్రతిధ్వనించే ఏర్పాటు.. ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కౌశలానికి నిదర్శనంగా నిలిచింది. తానీషా ప్రభువుకు శ్రీరామలక్ష్మణులు సాక్షాత్కరించిందీ, భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించిందీ ఈ కోటలోనే... ఏటా భద్రాద్రి రామయ్యకు ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయం ప్రారంభమైంది కూడా ఈ గోల్కొండ కోటలోనే... మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్య చరిత్ర రచించిన పొన్నెగంటి తెలగనార్యుడు ఇక్కడి ఆస్థానకవే.. యక్షగానం సుగ్రీవ విజయం జాలువారిందీ, ఇబ్రహీం కుతుబ్‌షాకు మల్కిభ రాముడిగా బిరుదునిచ్చిందీ ఈ కోటలోనే... సుప్రసిద్ధ కోహినూర్, దరియా, దహూప్ వంటి వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లిందీ, హైదరాబాద్ నిర్మాణానికి పురుడుపోసుకుందీ ఈ కోటలోనే... తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ప్రారంభించేదీ ఇక్కడి నుంచే... తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ మకుటాయమానమైతే.. తెలంగాణ పరిపాలనా అస్తిత్వం, వారసత్వ వైభవం ఎగరేసిన జెండా ఈ గోల్కొండ కోట.’’ అమర జవానులకు ముఖ్యమంత్రి నివాళులు కంటోన్మెంట్: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని ఆర్మీ యుద్ధ స్మారక స్థూపం (వీరుల సైనిక స్మారక స్థూపం) వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమర జవానులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా సబ్ ఏరియా కమాండర్ జీఓసీ-ఇన్-సీ మేజర్ జనరల్ సీఏ పిఠావాలా, ఎయిర్ వైస్ మార్షల్, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమాండర్ శ్రీనివాస్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు మారినప్పటికీ, ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే సాంప్రదాయాన్ని కొసాగించడం గమనార్హం. దసరా నుంచి వరాలు వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి.. వికలాంగులకు రూ. 1,500కు పింఛన్ పెంపును దసరా నుంచి అమలు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను వచ్చే దసరా నుంచి తెరిపిస్తాం. దీనివల్ల 60 వేల మంది కల్లు గీత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. రుణమాఫీ అమలు వల్ల ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల భారం పడుతున్నా.. 40 లక్షల మంది రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని కూడా దసరా నుంచే ప్రారంభిస్తున్నాం. ఆడపిల్ల పుట్టిందనగానే పెళ్లి ఎలా చేయాలా? అని రందిపడే రోజులివి. దళిత, గిరిజన కుటుంబాల్లోనైతే ఆడపిల్ల పుడితే చంపేసే దుర్భర పరిస్థితులున్నాయి. వారిని ఆదుకోవడం కోసం చేపడుతున్న ఇలాంటి పథకం దేశ చరిత్రలో ఎక్కడా అమలు కాలేదు. వచ్చే దసరా నుంచి తెలంగాణలోనే ప్రథమంగా అమలు చేస్తుండటం గర్వ కారణం. -
అందరికీ శుభం కలుగు గాక..
-
చర్చిల నిర్మాణానికి కలెక్టర్ అనుమతి అక్కర్లేదు: కేసీఆర్
స్వేచ్ఛా తెలంగాణలో జెండా ఎగరేయడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల అనుమతి లేకుండానే ఇకపై చర్చిల నిర్మాణం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 68వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా గోల్కొండ కోటలో మువ్వన్నెల జెండా ఎగరేసిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ముందుగా ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సైనిక వీరులకు నివాళులు అర్పించారు. గోల్కొండ కోటలో రాణిమహల్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. 500 జనాభా పైబడ్డ గిరిజన తండాలన్నీ ఇకపై పంచాయతీలుగా మారుతాయని చెప్పారు. -
‘కోట’పై జెండాకు ఓకే
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలను జరిపేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతించింది. రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే చేసిన దరఖాస్తుకు స్పందించిన ఆ శాఖ షరతులతో అప్పట్లోనే తాత్కాలికంగా ఓకే అంది. ఇప్పుడు అధికారికంగా లిఖితపూర్వక అనుమతి మంజూరు చేస్తూనే నిబంధనలు విధించింది. ప్రభుత్వ కార్యక్రమం కోసం గోల్కొండ కోట ప్రాంగణాన్ని వినియోగిస్తున్నందున నిర్దేశిత అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ చె ల్లించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.60 వేలను గోల్కొండ కోట ఇన్ఛార్జిగా ఉన్న ఏఎస్ఐ అధికారికి చెల్లించి అధికారిక అనుమతి పత్రం పొందింది. ఈ అనుమతి కేవలం ఆగస్టు 15కే పరిమితమని, మరుసటి రోజు కోటలో ప్రభుత్వపరంగా ఎలాంటి కార్యక్రమాలు జరపొద్దని, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వస్తువులు, పరికరాలను కూడా తొలగించాలని సూచించింది. 15న భద్రతాపరమైన చర్యల పేర సందర్శకులకు ఇబ్బందులు సృష్టించొద్దని స్పష్టం చేసింది. కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తుండటంతో జీహెచ్ఎంసీ రోడ్లను ముస్తాబు చేసింది. ప్రధాన రోడ్లన్నింటిని కొత్తగా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. -
దాస్య శృంఖలాలు తెగినా సమస్యలు తీరలేదు..
ఈ వెతల ‘చెర’ఇంకెన్నాళ్లు స్వాతంత్య్ర దినోత్సవం అంటే ‘పతాక’ స్థాయి సంబరం. ఇది ఏటా వచ్చేదే అయినా ఈసారి ప్రత్యేకత ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొట్టతొలి జెండా పండుగ ఇది. తెలంగాణ సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటేలా ఈ వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం చారిత్రక గోల్కొండ కోటను వేదికగా ఎంచుకుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న సంతోషంలో అంబరాన్నంటేలా పంద్రాగస్టు సంబరాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ తరుణంలో నగరవాసి గుండెల నిండా జెండా పండుగ సంబరాలు ప్రతిఫలిస్తున్నా.. ఏదో వెలితి. నాడు దాస్య శృంఖలాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలితంగా స్వాతంత్య్రం లభించినా.. నేటికీ మన చుట్టూనే తిష్టవేసి ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి మాత్రం విముక్తి లభించట్లేదు. ఇంకెన్నేళ్లు ఈ సమస్యలపై పోరాడాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని, విశ్వనగరంగా కీర్తిపతాక ఎగురవేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నిజమై, హామీలు అమలై ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతుల్లో మార్పు రావాలని ఆశిస్తున్నారు. కనీస సదుపాయాలు సమకూరి, అంతా నాణ్యమైన జీవనం గడిపిన నాడే నగరవాసి సమస్యల చెర నుంచి బయటపడినట్టని, కొత్త ప్రభుత్వ హయాంలోనైనా పాత సమస్యల నుంచి విముక్తి కలగాలని అంతా కలలు కంటున్నారు. ఆ కలలు సాకారం కావాలంటే, ఆశలు నెరవేరాలంటే మొదట ఈ సమస్యలు తీర్చాలని నగరవాసులు ఏకరువు పెడుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నడక యాతన ఇంకెన్నాళ్లు? గ్రేటర్లో 7 వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నా.. ప్రజలు నడిచేందుకు ఒక్క మార్గమూ సరిగా లేదు. పాదచారులు నడిచేందుకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లు కబ్జాల పాలయ్యాయి. ఇక కాస్తో కూస్తో ఉన్న వాటిపై నడిచే పరిస్థితి లేదు. ఫలితంగా ఏటా దాదాపు 200 మంది పాదచారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వివిధ ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్న వారిలో 40 శాతం మంది పాదచారులే కావడం విషాదం. ‘పాదచారే మహారాజు’ అనేది నినాదానికే పరిమితమైంది. కేసీఆర్ సర్కారు మొదట పాదచారుల కష్టాలు తప్పించాల్సి ఉంది. నగరంలో రోడ్డు దాటడమంటే మాటలు కాదు. అవసరమైన చోట్ల ఎఫ్‌ఓబీలు ఏర్పాటు చేయాలి. రోడ్డు దాటేందుకు ప్రత్యేక మార్కింగ్‌లు ఉండాలి. వాటిని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంటి నంబరు ఓ పజిల్ ప్రస్తుతం సమగ్ర సర్వేకు సర్కారు సిద్ధమైంది. ఈ నిమిత్తం ఇంటింటికి వెళ్లే అధికారులకే మతిపోయేలా నగరంలో ఇంటి నంబర్లు ఉన్నాయి. అస్తవ్యస్తపు ఇళ్ల నంబర్లతో గజిబిజి గల్లీలతో నగరంలో చిరునామా కనుక్కోవడం అంత ఈజీ కాదు. సులభంగా, శాస్త్రీయ పద్ధతిలో ఇంటి నంబర్లుండాలనే ఆలోచన పాతదే అయినా, అమలుకు నోచలేదు. దశాబ్దాలుగా, ప్రభుత్వాలు మారుతున్నా కొలిక్కిరాని ఈ సమస్యను టీఆర్ఎస్ సర్కారైనా పరిష్కరిస్తుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి నీడలో మురికివాడల జాడ ఎన్నెన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన రాజధానిలో మురికివాడలూ తక్కువేం లేవు. సీఎం కేసీఆర్ ‘స్లమ్ ఫ్రీ సిటీ’ చేస్తామని హామీనిచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ముందు నగరంలో మురికివాడలు లేకుండా చేయాలని పేదలు కోరుతున్నారు. బ్రాండ్ ఇమేజ్ సాధనకు ముందు ప్రజలందరికీ కనీస సదుపాయమైన గూడు గోడు తీర్చాలి. గ్రేటర్లో ఇప్పటికే గుర్తించిన 1476 స్లమ్స్ రూపురేఖలు మార్చడంతోపాటు.. కొత్తగా ఏర్పడిన వాటినీ గుర్తించి మురికివాడరహిత నగరంగా తీర్చిదిద్దాలి. జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం పథకం ద్వారా గ్రేటర్‌కు 78,746 ఇళ్లు వుంజూరు కాగా ఆరేళ్లుగా పదివేల మందికీ లబ్ధి చేకూరలేదు. ‘చెత్త’శుద్ధి ఏదీ? జీహెచ్ఎంసీ ఏటా రూ.225 కోట్లు పారిశుధ్య కార్మికులకు వేతనాలుగా చెల్లిస్తున్నా, దాదాపు 20 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నా చెత్త సమస్య తీరట్లేదు. రోజూ దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. రోడ్లు, కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా చెత్తే.. ఈ పరిస్థితిని మెరుగుపర్చాల్సి ఉంది. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టులను అమలుచేయాలి. తద్వారా పారిశుధ్య ఇబ్బంది తీరడంతో పాటు విద్యుత్ అవసరాలూ కొద్దిమేర తీరతాయి. కొన్ని రోడ్లను మాత్రమే చెత్తరహితంగా కాకుండా అన్నిటినీ అదే మాదిరిగా తీర్చిదిద్దాలి. ముంపు ముప్పు తప్పేనా? పేరుగొప్ప నగరంలో వానొస్తే రోడ్లే చెరువులయ్యే దుస్థితి. ఇందుకు కారణం వరద నీటి కాలువలు కుంచించుకుపోవడమే. నాలాల విస్తరణ, అభివృద్ధికి వందల కోట్ల నిధులున్నా.. పనులు సాగట్లేదు. నగరాభివృద్ధికి తగిన మాస్టర్‌ప్లాన్‌కు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు పొందేందుకు సిద్ధమైన ప్రభుత్వం వరదనీటి కాలువల విస్తరణపైనా శ్రద్ధచూపాలి. ఇందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తే తప్ప రాదార్లు గోదారులయ్యే సమస్య నుంచి నగరం బయటపడదు. వివిధ ప్రాంతాల్లో 71 కిలోమీటర్ల మేర నాలాల వెడల్పు/ఆధునీకరణకు జేఎన్ఎన్యూఆర్ఎం నుంచి రూ.266 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆరేళ్లుగా పనులు అతీగతీ లేవు. ఇప్పటికి రూ.125 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. వచ్చే మార్చి వరకు మాత్రమే గడువుంది. ఈలోగా ఏంచేస్తారో.. ఏమో!. మన ‘దారి’.. యమదారి నగరంలో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. పట్టుమని పది మీటర్ల మేర రోడ్లు కూడా సవ్యంగా ఉండదు. అస్తవ్యస్తపు రహదారుల వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ట్రాఫిక్ సమస్యా పెరుగుతోంది. గుంతల రోడ్లతో వాహనదారుల నడుములు విరుగుతున్నాయి. ఏడువేల కిలోమీటర్ల రహదారుల్లో వీఐపీల ప్రాంతాల్లోవి తప్పస్తే అన్నింటా అవస్థలే. అందమైన రోడ్లే నగరాభివృద్ధి ముఖచిత్రంగా నిలుస్తాయి. మరి మన రోడ్ల సమస్య ఎన్నటికి తీరేనో?!. నగరవాసి ఆరోగ్యానికి ‘పొగ’ ఆరోగ్యానికి పొగబెడుతున్న వాయు, శబ్ద కాలుష్యాల నుంచి విముక్తి కల్పించాలని సిటిజన్లు కోరుతున్నారు. గ్రేటర్లో నిత్యం రోడ్డెక్కుతోన్న సుమారు 35 లక్షల వాహనాలతో నగర జీవనం పొగచూరుతోంది. అబిడ్స్, పంజగుట్ట, చార్మినార్, జూపార్క్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ధూళిరేణువుల స్థాయి అత్యధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్డెక్కకుండా చేయాలి. ప్రతి వాహనానికి ఏటా కాలుష్య తనిఖీలు నిర్వహించాలి. ఇంధన కల్తీకి అడ్డుకట్ట వేయడంతో పాటు కాలుష్యకారక బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలను ఔటర్ రింగురోడ్డు ఆవలకు తరలించాలి. మంచినీళ్లే మహా ప్రసాదం గ్రేటర్లో నివాస సముదాయాలు 24 లక్షలు. నల్లా కనెక్షన్లు 8.25 లక్షలు మా త్రమే. అంటే మూడో వంతు జనానికే నీళ్లందుతున్నాయి. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లోని వెయ్యి కాల నీలకు మంచినీటి సరఫరా వ్యవస్థ లేదు. 35 లక్షల మంది కి నిత్యం ‘పానీ’పట్లు తప్పట్లేదు. ఆయా ప్రాంతాలకు సు మారు రూ.5 వేల కోట్లతో పైప్‌లైన్ వ్యవస్థ, నీటి స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. గోదావరి, కృష్ణా మూ డో దశలను పూర్తిచేస్తేనే అంతోఇంతో సమస్య తీరుతుంది. నగరం ‘మురుగు’తోంది గ్రేటర్ పరిధిలో డ్రైనేజీ వసతు లు లేని వెయ్యి కాలనీలు, బస్తీ ల్లో నిత్యం రోడ్లపై మురుగునీ రు పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో జనం అవస్థలు పడుతున్నారు. రూ.4 వేల కోట్ల అంచనాతో డ్రైనేజి వసతులు కల్పిస్తేనే ఈ సమస్య నుంచి జనానికి విముక్తి. డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి గతంలో సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌కు తెలంగాణ నూతన సర్కారు నిధులు విడుదల చేస్తే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. పౌరసేవలు.. ఏ ప్రభుత్వ విభాగంలో సేవలు పొందాలన్నా కాళ్లరిగేలా తిరగాల్సిందే. జనన, మరణ ధ్రువీకరణపత్రాల నుంచి మొదలు పెడితే.. భవన నిర్మాణ అనుమతులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల దాకా ఇదే దుస్థితి. చేతులు తడపనిదే పనులు కావట్లేదు. దీన్ని నివారించి వివిధ విభాగాల్లో జవాబుదారీతనం పెర గాలి. అందరి సహకారంతో... అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లక్ష్యాలకనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉంది. అందులో భాగంగా స్లమ్‌ఫ్రీ సిటీ, గుంతలు లేని రోడ్లు, మెరుగైన పారిశుధ్యం నిర్వహణకు ఇప్పటికే ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. అందుకు అందరి సహకా రం కావాలి. అధికారులు, సిబ్బందితో పాటు ప్రజల సహకారంతో వీటిని పూర్తిచేయగలమన్న నమ్మకం ఉంది. - సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ -
గోల్కొండ కోటలో పటిష్ఠ భద్రత
స్వాతంత్ర్య దిన వేడుకలకు గోల్కొండ కోటలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాటి వేడుకలకు 5వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత కల్పించారు. గోల్కొండ కోట లోపల 1200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మొదటి దశలో సీఆర్పీఎఫ్, ఆక్టోపస్, సీఏఆర్ పోలీసుల బలగాలు, రెండో దశలో తెలంగాణ పోలీసులు ఉంటారు. అదనపు కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో డీసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 70 మంది ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలతో పాటు 200 సిబ్బందితో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేశారు. -
ఇక నుంచి గోల్కొండ కోటలోనే...
-
గోల్కొండంత జనం
-
బోనమెత్తిన నగరం
అంగరంగ వైభవంగా గోల్కొండలో ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో తొలి పండుగకు పోటెత్తిన భక్త జనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించిన బోనాల ఉత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు ఈసారి కొత్త శోభను సంతరించుకున్నాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లంగర్‌హౌస్ చౌరాస్తా నుంచి అమ్మవారి తొట్టెలను, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ప్రథమ నజర్ బోనాలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పోతరాజుల నృత్యాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు నగినాబాగ్లోని నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించి తలలపై బోనం పెట్టుకుని అమ్మవార్ల ఆలయానికి చేరుకున్నారు. 23 కుల వృత్తుల వారు అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంసృ్కతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని వాటి వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటుదామని ఉత్సవాలను ప్రారంభించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బోనాలు, రంజాన్ పండుగలకు భారీ భద్రత బోనాలు, రంజాన్ పండుగలను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు, అన్ని జిల్లాల ఎస్పీలకు తెలంగాణ రాష్ర్ట డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ఆదేశాలు జారీచేశారు.అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని, గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిఘా విభాగం సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. -
బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం
* తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం * ఇక నుంచి అధికారిక సంబరం * ‘అమ్మా బెలైల్లినాదో నాయనా.. తల్లీ బయలెల్లినాదో నాయనా..’ ఏటా ఆషాఢ మాసంలో ఈ గానం భాగ్యనగరాన్ని పులకింపజేస్తుంది. ఆధ్యాత్మికతలో ఓలలాడిస్తుంది. నాలుగు శతాబ్దాల పైచిలుకు నగరంలో అన్ని వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే మహోన్నత చారిత్రక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. జాతీయ ఖ్యాతి గడించిన విశిష్ట వేడుక. ఆషాఢంలోని తొలి ఆదివారం లేదా గురువారం ప్రారంభమయ్యే పండుగను నెల రోజులు నిర్వహిస్తారు. రాష్ర్టప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నేడు గోల్కొండ కోటలో బోనాలకు శ్రీకారం. వచ్చే నెల 27 వరకు కోటపై తొమ్మిది రకాల పూజలు నిర్వహిస్తారు. ఇవే రోజుల్లో పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలూ ప్రారంభమవుతాయి. నగరమంతటా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ప్రత్యేక కథనం.. గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్‌షాహీల కాలంలోనే బోనాలకు శ్రీకారం చుట్టారు. అబుల్ హసన్ తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల సలహాతో తానీషా తన కోటపైన శ్రీ జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఆలయాన్ని కట్టి ఉత్సవాలు ప్రారంభించాడు. తరువాత అధికారంలోకి వచ్చిన అసఫ్జాహీలు వాటిని కొనసాగించారు. ఇది ఆనవాయితీగా మారింది. కోటపై ఉన్న అమ్మవారిని గోల్కొండ ఛోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో తిరిగి కోటపైన ప్రతిష్టిస్తారు. నవాబు పూజతో శాంతించిన మూసీ 1908 సెప్టెంబర్‌లో మూసీ వరదల కారణంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వరద నీరొచ్చింది. వరదలో అప్పటికే వేలాది మంది చనిపోయారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్ లాల్‌దర్వాజా అమ్మవారి మహత్యాన్ని నిజాం నవాబుకు వివరించారు. ఆలయంలో పూజలు చేస్తే అమ్మవారు శాంతించి వరదలు తగ్గుముఖం పడతాయన్నారు. దీంతో నవాబు ఒక బంగారు చాటలో కుంకుమ, పసుపు, మేలిమి ముత్యాలు తీసుకొని పూజలు చేశారు. అలా ఈ ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖరేంద్ర సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. 2008 ఏప్రిల్‌లో అప్పటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వర్ణ శిఖరం, వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యమంత్రం బోనాల వేడుకల్లో ప్రతీ ఘట్టం ఆరోగ్య పరిరక్షణతో ముడిపడిందే. తొలకరి వర్షాలతో పాటే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దీంతో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. నీటి కాలుష్యం వల్ల కలరా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అలాంటి కలుషిత వాతావరణాన్ని శుభ్రం చేసే అద్భుతమైన ప్రక్రియ బోనాల పండుగలో ఉంది. ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రం చేసుకొని పసుపు, గుగ్గిలం, మైసాక్షి వంటి వాటిని పొగ వే యడం వల్ల వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ఇక వేపచెట్టు గొప్పతనం అందరికీ తెలిసిందే. వేపాకు ముద్దను ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులకు వేప దివ్య ఔషధం. బోనాల పండుగ రోజు వేప కొమ్మలతో బోనాలను అలంకరించినా, గుమ్మానికి, దర్వాజలకు వాటిని వేలాడదీసినా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇక బోనం. కొత్త కుండలో పసుపుతో కలిపి అన్నం వండడం కూడా ఆరోగ్య పరిరక్షణలో భాగమే. ఈ వేడుకల్లో ఆరోగ్యభాగ్యం కూడా ఇమిడి ఉందని నగరానికి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడ్డారు. వరాల వల్లి.. ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 13, 14వ తేదీల్లో జరుగుతాయి. ఈ వేడుకలకు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 1813లో కలరా సోకింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇది అక్కడ మిలటరీ విధులు నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరటి అప్పయ్యను కలచి వేసింది. వెంటనే ఆయన ఉజ్జయినీ మహంకాళిని... కలరాను తగ్గించమనీ, అలా చేస్తే తన స్వస్థలంలో ఆలయం నిర్మిస్తామని వేడుకున్నారు. కలరా అదుపులోకి వచ్చింది. దీంతో అప్పయ్య సహచరుల సాయంతో 1815లో సికింద్రాబాద్‌లో కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించి ‘ఉజ్జయినీ మహంకాళి’గా నామకరణం చేశారు. 1864లో ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అప్పయ్యే చేయించి, ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. 1953 నుంచి దేవాదాయ శాఖ వేడుకలు నిర్వహిస్తోంది. చల్లని చూపుల... శీతల్‌మాత పిల్లా పాపలను ఆయురారోగ్యాలతో చల్లంగా చూసే అమ్మవారు శీతల మాత. సుల్తాన్‌షాహీలో వెలసిన ఈ అమ్మవారిని భక్తులు శీతల్ మాతగా... సిత్లా మాతగా కొలుస్తున్నారు. వందేళ్ల కిందట నిజాంల పాలన లో ఆర్థిక లావాదేవీలు చూసే అధికారిగా ఉన్న శాలిబండ దేవ్డీ నివాసి రాజా కిషన్ పర్షాద్ ఈ దేవాలయాన్ని సుల్తాన్‌షాహిలో నిర్మించారు. పిల్లలకు మశూచి, ఆటలమ్మ (చికెన్‌పాక్స్)లు వచ్చినప్పుడు అమ్మవారికి సాక పెట్టి పూజించేవారు. 1976లో ఆలయ కమిటీ ఏర్పడిన అనంతరం శ్రీ జగదాంబ దేవాలయంగా నామకరణం చేశారు. మీరాలంమండి అమ్మ నిజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రైతులు కూరగాయలు,ధాన్యం ఎడ్ల బండ్లపై మీరాలం మండికి తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్ల బండ్లను ‘బండిఖానా’ లో నిలిపేవారు. ఇక్కడే ఒక రావిమొక్కను నాటి దాని వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేశారు. 1960లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినప్పటి నుంచి ఆషాఢ మాసం మూడో బుధవారం రోజు బోనాల పండుగ జరుగుతుంది. ఐదు తరాలుగా.. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత జరిగే రెండో ప్రధాన ఘట్టం రంగం. ఇందు లో ఏటా స్వర్ణలత చెప్పే ‘భవిష్యవాణి’కి ఎంతో ప్రాముఖ్యత. ఆ వివరాలు ఆమె వూటల్లోనే... వూ అమ్మపేరు ఎరుపుల ఇస్తారమ్మ. నాన్న నరసింహ. అక్క స్వరూప. తమ్ముడు దినేష్. నాతో కలిపి అమ్మ నాన్నలకు ముగ్గురు పిల్లలం. ప్రస్తుతం మారేడుపల్లిలో ఉంటున్నాం. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే అమ్మవారికి అంకితం చేసే ఆచారం అనాదిగా వస్తోంది. అక్క స్వరూపను, నన్ను ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి అంకితం చేశారు. బడికి వెళ్లినా పెద్దగా చదువుకోలేదు. అక్క స్వరూప చనిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర రంగంలో భవిష్యవాణి వినిపించే బాధ్యత తీసుకున్నా. అక్కన్న,మాదన్నలు కొలిచిన తల్లి హరిబౌలిలోని అక్కన్న మాదన్నల మహంకాళి దేవాలయం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం. పాతబస్తీలోని ఈ ఆలయం లోని అమ్మవారికి భక్తులు 17వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ రాజు తానీషా వద్ద కీలక హోదాల్లో పనిచేసిన అక్కన్న, మాదన్నలిరువురు అన్నదమ్ములు. వారు విధినిర్వహణలో భాగంగా రోజూ కోటకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు నిర్వహించే వారు. 1948లో జరిగిన సైనిక చర్య తరువాత అప్పటి ఆర్యసమాజ్ ఈ ఆలయాన్ని గుర్తించింది. కోటకు రక్షణగా.. మైసవ్ము శాలిబండ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసవ్ము దేవాలయుం పాతబస్తీ భక్తుల పాలిట కొంగుబంగారం. నిజాం పరిపాలనలో ప్రధాని కిషన్ పర్షాద్ దేవిడీలోనే శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వెలసింది. కోట రక్షణ గోడకు ఎడమ వైపున అమ్మవారి దేవాలయం ఉంటే అన్ని విధాల కలిసొస్తుందనే నమ్మకంతో నిజాం కాలంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేశారు. హనుమంతు ఉరఫ్ పోతరాజు..! అతను అమ్మవారికి అంగరక్షకుడు. గ్రామదేవతల తోబుట్టువు. వారికి కావలి. ఇదీ పోతరాజు పరిచయం. అదంతా కథల్లోనే.. కానీ పాతబస్తీ ప్రజలకు ఎనిమిది దశాబ్దాలుగా తెలిసిన పోతరాజు మాత్రం హనుమంతే. నిలువెత్తు విగ్రహం, చక్కని శరీర సౌష్ఠవం.. కోర మీసాలు, జులపాల జుత్తు.. పెద్ద కళ్లు. భీతి గొలిపే రూపం.. మెడలో నిమ్మకాయల హారం. ఒంటినిండా పసుపు.. నుదుటిన పొడవాటి కుంకుం బొట్టు. చేతిలో కొరడా.. కాళ్లకు గజ్జెలు. బోనాల ఊరేగింపులో అగ్రభాగాన ఉండి ఎగిరి గెంతులేస్తూ, నృత్యం చేస్తూ జనాన్ని అదిలిస్తూ, బెదిరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ‘పోతరాజు’ చెప్పే వివరాలు ఆయన మాటల్లోనే... మూసీనదికి వరదలొచ్చినప్పుడు పుట్టిన్నట.. మాయమ్మ చెప్పింది. ఆ వరదలు ఊర్ని ముంచెత్తుతా ఉంటే నన్నెత్తుకొని గంగబాయి గుట్ట మీదకు పరుగెత్తిందట. ఒక చింతచెట్టెక్కి ప్రాణాలు దక్కించింది. నా పుట్టుక గురించి నాకు తెలిసింది ఇంతే. మాయమ్మ పేరు నర్సమ్మ. నాయిన రామన్న. చిన్నప్పటి నుంచి ధూల్‌పేట్‌లోనే. మా పెద్దనాయిన నర్సింహ్మ. చెట్టుమీదికెక్కి సిగాలు ఊగేవాడు. మా పెద్దనాయిన నీడ నాకు (దేవత ఆవహించింది) పడింది. అప్పుడు నాకు పదిహేనేళ్లు. మస్తు బలంగా ఉండేవాణ్ణి. గోకుల్ప్రసాద్ అనే పూజారి నాతో తొలిసారి పోతరాజు వేషం వేయించిండు. ఇప్పటి వరకు ఆ ఆచారాన్ని తప్పలేదు. పురాణాపూల్, మంగల్హాట్, ధూల్‌పేట, గౌలిగూడ, గోడీ కీ కబర్, జిన్సీ చౌరాయి.పాతబస్తీలో ఎక్కడ బోనాల పండుగైనా పరుగెత్తుకొని పోయిన. అప్పట్లో యాటను (మేకపోతును) గావు (గొంతు కొరికేయడం) పట్టేవాణ్ణి.అమ్మవారి పండుగొచ్చిందంటే నాకు నిమిషం తీరిక ఉండేది కాదు. పూరానాపూల్‌లో మహంకాళమ్మ గుడి కట్టించిన. యాదగిరిగుట్ట నుంచి గాంధీ బొమ్మ తెప్పించి ఇక్కడ పెట్టించింది కూడా నేనే. ఎన్నెన్నో అపురూప ఘట్టాలు మహంకాళి జాతరలో అనేక అపురూపమైన ఘట్టాలుంటాయి. ఈ నెల 29వ తేదీన ఘటాల ఎదుర్కోలుతో వేడుకలు ప్రారంభమవుతాయి. జాతర సందర్భంగా సికింద్రాబాద్ జనసంద్రాన్ని తలపిస్తుంది. పుట్టింటి నుంచి వచ్చే అమ్మవారికి ఘటం తో స్వాగతం పలుకుతూ తోడ్కొని వచ్చేదే ఘటోత్సవం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ,పూలను తీసుకెళ్లి కర్బలమైదాన్లో ఘటాన్ని అలంకరిస్తారు. వెదురు దబ్బల మధ్యలో రాగి చెంబు ఉంచి, అమ్మవారి వెండి విగ్రహాన్ని పెడతారు. అలా ఊరి పొలిమేర నుంచి బయలుదేరిన తల్లి భక్తజనం నడుమ ఆలయానికి విచ్చేస్తుంది. 9 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. బోనాల చివరి రోజు జరిగే అంబారీ ఊరేగింపుతో తల్లిని సాగనంపుతారు. కుస్తీలకూ పోయేవాణ్ని... ఆ రోజుల్లో లాల్ పహిల్వాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న. కుస్తీపోటీలకు పోయేవాణ్ని. గద్వాల్ మహారాణి దగ్గర కూడా పోటీలల్ల పాల్గొన్నం. బతికినన్ని రోజులు బాగానే బతికిన. నవాబులకు కూడా క్షవరాలు చేసిన. ‘సర్కార్ క్యా హై’ అంటే చాలు చేతికి ఎంతొస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్లు. నాకు ఇద్దరు భార్యలు కమలమ్మ, యాదమ్మ. కమలమ్మ చనిపోయింది. ఇద్దరికీ కలిపి 15 మంది పిల్లలు. వారిని నేనూ, యాదమ్మ సాది పెంచి పెద్ద జేసినం. చాలా కష్టపడ్డం. కడుపు మాడ్చుకొని బతికినం. కానీ ఏం లాభం. అంతా చెట్టుకొకలు, పుట్టకొకలు పోయిండ్రు.హైదరాబాద్‌ల ఎవ్వరు ఎక్కడ ఉంటండ్రో తెల్వదు. నా పెద్దకొడుక్కే 75 ఏళ్లు ఉంటది. ఎంతమంది పిల్లలు ఉంటే మాత్రం ఏమైంది. నా బతుకు నేనే బతకుతున్నా. పిల్లలకు మంత్రం వేయమని నా దగ్గరకొస్తరు. పైసో,ఫలమో ఇస్తరు. ఆ డబ్బులతోనే బతుకుతున్న...’ అని ముగించాడు హనుమంతు. ఉజ్జయినీ మహంకాళి రంగం చెప్పడానికి ముందుగా పెళ్లి (మాంగల్యధారణ) జరగాల్సి ఉంది. అందరికీ జరిగే పెళ్లిలాగే నాకూ జరిగినా పెళ్లి కొడుకు ఉండడు. ఖడ్గంతో నాకు మాంగల్యధారణ చేయించి ఆ తంతు పూర్తి చేశారు. నాటి నుంచి నా జీవితం అమ్మవారికే అంకితమైంది. అలా పదహారేళ్లుగా భవిష్యవాణి వినిపిస్తున్నా. ఆదివారం బోనాలు సమర్పించడం పూర్తికాగానే సోమవారం రంగం ఏర్పాట్లుంటారుు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి దుస్తులు ధరించి ఆలయానికి వస్తా. రోజంతా ఉపవాసమే. ముఖానికి పసుపు రాసుకుంటా.మహంకాళి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ ఎదురుగా పచ్చి కుండపై నన్ను నిలబెడతారు.అప్పుడు అమ్మవారు నన్ను ఆవహిస్తారు. అటు తర్వాత ఏం జరిగిం దనేది నాకు గుర్తుండదు. టీవీల్లో చూసి అసలు నేనేనా ఇదంతా చెప్పిందనిపిస్తుంది. అవ్మువారి సేవకు అంకితమైన నాకు కుటుంబం, పిల్లలు వంటి ఆలోచనలు ఉండవు. ఆలయం నుంచి కొన్నేళ్లుగా నెలకు రూ.3వేలు వస్తున్నాయి. నా జీవనం కోసం కుట్టు పనిచేస్తుంటా. ప్రతి శుక్ర, మంగళవారాల్లో అమ్మవారి దేవాలయానికి వచ్చి ముత్తయిదువులకు పసుపు కుంకుమ అందిస్తుంటా. తొలుత మా పూర్వీకురాలు జోగమ్మ భవిష్యవాణి వినిపించేది. అటు తర్వాత బాలమ్మ, పోచమ్మ, మా నాన్నమ్మ బాగమ్మ, మా అక్క స్వరూపరాణి దాన్ని కొనసాగించారు. ఐదు తరాల నుంచి మేవుు తల్లిసేవలో కొనసాగుతున్నాం. - దార్ల వెంకటేశ్వరరావు -
'ప్రేమికులకు గుంజిళ్ల'పై డీసీపీ సీరియస్
గోల్కొండ కోటలో ప్రేమికులతో గుంజిళ్లు తీయించిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కౌన్సెలింగ్ అంటూ గుంజిళ్లు తీయించిన వీడియోలు మొత్తం యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం, మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మొత్తంపై తగిన విచారణ జరిపించి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్‌ను ఆయన ఆదేశించారు. ఆ నివేదిక అందగానే దాని ఆధారంగా అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.