ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి | Selfie Death: Karimnagar Man Dies Tragedy | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి

Published Sun, Dec 12 2021 1:13 PM | Last Updated on Sun, Dec 12 2021 3:32 PM

Selfie Death: Karimnagar Man Dies Tragedy - Sakshi

సాక్షి, చందుర్తి(కరీంనగర్‌): సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, ఖిల్లా మీది నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన చందుర్తి మండలంలోని ఎన్గల్‌లో విషాదం నింపింది. గ్రామానికి చెందిన సింగం స్వామి–రాజమణి దంపతులకు కుమారుడు రంజిత్‌(25) డిగ్రీ వరకు చదువుకుని, హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌ నేర్చుకుంటున్నాడు.


రంజిత్‌ (ఫైల్‌)

బుధవారం గోల్కొండ ఖిల్లాను చూసేందుకు వెళ్లి, సెల్ఫీ దిగేందుకు ఖిల్లా ఎక్కాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి తమ్ముడు రాకేశ్, ఒక అక్క ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement