selfie death
-
సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. బాగా ప్రాచుర్యం పొందిన, ఎవరికి వారు స్వయంగా తీసుకునే సెల్ ఫోన్ ఆధారిత ఫొటో. దీనికోసం ప్రత్యేక సెల్ ఫోన్లు, స్టిక్కులతో పాటు కోర్సులు కూడా అందు బాటులోకి వచ్చాయంటేనే వాటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకో వచ్చు. ముఖ్యంగా కొంతమంది యువ తలో ఈ క్రేజ్ విపరీత స్థాయిలో ఉంటోంది. అయితే ఈ క్రేజ్ కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలనే హరి స్తోంది. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో గత ఏడాది సెల్ఫీ సంబంధిత మరణాలు 190 నమోద య్యాయి. తీవ్రంగా గాయపడిన ఉదంతాలు 55 చోటు చేసుకున్నట్లు వికీపీడియా గణాంకాలు చెప్తు న్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదాలు భారత్‌లోనే ఎక్కువని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. నగరంలో 2016లో తొలి సెల్ఫీ డెత్ నమోదైంది. జూ పార్క్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో కాలుజారి పడటంతో జియాగూడ వాసి మంజీత్ చౌదరి కన్నుమూశాడు.2024 జనవరి 7ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు (16) అల్వాల్‌లో ఉంటున్న తన బాబాయి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ బాలుడు బొల్లారం బ్యారెక్ సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్దకు చేరుకున్నాడు. వెనుక నుంచి రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రైలు దూసుకు రావడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.2024 జనవరి 29హైదరాబాద్ బహదూర్‌పురకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ (23) అబిడ్స్ లోని కళ్లజోళ్ల దుకాణంలో పనిచేస్తు న్నాడు. తనస్నేహితులతో కలిసి ఉప్పుగూడ–యాకత్‌పుర రైల్వే స్టేష న్ల మధ్య రైల్వే ట్రాక్‌ల వద్దకు వెళ్లా డు. అక్కడ సెల్ఫీ తీసుకునే ప్రయ త్నాల్లో రైలు పట్టాల మీదకు చేరుకు న్నాడు. అదే సమయంలో దూసుకు వచ్చిన ఎంఎంటీఎస్ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చనిపోయాడు.2024 ఏప్రిల్ 5ఏపీకి చెందిన ఎస్.అనిల్ కుమార్ (27) భార్యతో కలిసి హైదరా బాద్‌లోని మాదాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అర్ధ రాత్రి వేళ తన స్నేహితుడు అజ య్‌తో కలిసి కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. తమ ద్విచక్ర వాహనాన్ని వంతెనపై నిలిపిన ఈ ద్వయం సెల్ఫీలు తీసుకుంటోంది. ఇంతలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అనిల్ చికిత్స పొందుతూ అసువులు బాశాడు.2024 జూన్ 15హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్ (17), శివదీక్షిత్ (17) మరో బాలుడు (17) ఇంటర్ పూర్తి చేశారు. బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకుకోసిన అనంతరం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 2.18 ప్రాంతంలో ముగ్గురూ స్కూటీపైనే ఉండి రీల్స్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఉదయ్, దీక్షిత్ అక్కడిక్కడే మరణించగా.. బాలుడు గాయపడ్డాడు. అత్యుత్సాహంతోనే చేటు..సెల్ఫోన్లు వచ్చినప్పటి నుంచే ఈ సెల్ఫీల జాఢ్యం మొదలవలేదు. ఎప్పుడైతే వాటిల్లో ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో అప్ప ట్నుంచీ సెల్ఫీ క్రేజ్ ప్రారంభమై, క్రమంగా మంచి రెజుల్యూషన్ (ఫొటో స్పష్టంగా కన్పిస్తుంది)తో కూడిన ఫొటోలు వచ్చే ఫ్రంట్ కెమెరాలు కూడా వస్తుండటంతో ఈ సెల్ఫీల పిచ్చి మరింత ముదిరి పోయింది. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటు న్నారు. ఏదో రకంగా విభిన్నమైన సెల్ఫీని తీసుకో వాలనే తాపత్రయంలో ప్రమాదకర పరిస్థితుల్ని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్ని స్తున్నారు. వెనుక నుంచి రైలు వస్తుండగానో, వాహనాలు డ్రైవ్ చేస్తూనో, జలపాతాల వద్దో, బీచ్ ల్లోనో, ఎత్తైన ప్రదేశాల్లోనో సెల్ఫీలకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.సోషల్ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత..ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత ఎక్కువైంది. ఆయా సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తు న్నాయి. ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీల బాటపడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటితో పాటు రీల్స్ (షార్ట్ వీడియోలు) కూడా సోషల్ మీడియాల్లో ఎక్కువగా కన్పిస్తుండటం గమనార్హం. మరోపక్క ఈ సెల్ఫీలను మార్ఫింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే సైబర్ నేరాలు పెరుగుతుండటం గమనార్హం.‘నో పార్కింగ్’ తరహాలో..ప్రజల్లో ముఖ్యంగా యువతలో మితిమీరి పోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేప థ్యంలోనే ‘నో పార్కింగ్’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమల్లోకి వచ్చాయి. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియుల కారణంగా అనేక ప్రాంతాలు ఇరుకైన ప్రదేశాలుగా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆయా ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. సెల్ఫీలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్‌లోనూ తీసుకోవాలనే అభిప్రాయంగా గట్టిగా వ్యక్తమవుతోంది.సెల్ఫీకి ముందు సప్త ప్రశ్నలుసెల్ఫీలు, రీల్స్ వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండటం, అవి ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)2. ఈ ప్రదేశంలో సెల్ఫీ కారణంగా తనకు కానీ తన చుట్టు పక్కల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానా శ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, వాహనాలు నడుపుతూ)3. సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటివారు చూస్తున్న వాటికి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గా నికి చెందినవారి మనోభావాలు దెబ్బతీస్తు న్నామా? (ప్రార్థనా స్థలాలు)5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు)7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతకరం అవుతుందా?(పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) -
బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్లో సెల్‌ఫోన్ రిపేర్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఆత్మహత్యపై అనుమానాలు.. ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్‌డేకు చిన్న గిఫ్ట్ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్ ఫెయిల్యూర్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ.. ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య -
సిద్దిపేటలో విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.
సాక్షి, సిద్దిపేట, హైదరాబాద్: సెల్ఫీ సరదాకు ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన షేక్ కైసర్ (28), అతని అన్నకొడుకు షేక్ ముస్తఫా (3), సమీప బంధువు, జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్ సోహెల్ (17) గురువారం రాత్రి సిద్దిపేట (దుద్దెడ)లో జరగనున్న ఫంక్షన్లో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులతో కలసి గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లిలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారు వర్గల్ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలోగల బంధువుల పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో షేక్ ఖైసర్, మమ్మద్ సోహెల్‌లు ముస్తఫాను తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సమీపంలో ఉన్న సామల చెరువుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ముస్తఫా చెరువులో ఉన్న గుంతలో జారిపడ్డాడు. ఇది గమనించి అతడిని రక్షించే ప్రయత్నంలో సోహెల్, అతడిని కాపాడేందుకు ఖైసర్‌లు వరుసగా గుంతలో దిగారు. ఈత రాకపో వటంతో బాలుడితో పాటు వారిద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. సమీపంలో వున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మొదట బాలుడి బయటకు తీసి చికిత్స కోసం తరలించగా అప్పడికే అతను మృతిచెందాడు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుంచి ఖైసర్, సోహెల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్‌కు భార్య, మూడు నెలల కూతురు ఉన్నారు. అప్పటిదాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన ముస్తఫా నీట మునిగి విగత జీవిగా మారటంతో తండ్రి జుబేర్, తల్లి అయేశాలు కన్నీరు మున్నీరై బోరుమని విలపించారు. కాగా మహ్మద్ సోహెల్ ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టాలపై సెల్ఫీ.. దూసుకొచ్చిన లోకల్ ట్రైన్.. క్షణాల్లో!
కోల్‌కతా: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలకు క్రేజ్ పెరిగింది. అయితే, అదే సెల్ఫీ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదమని తెలిసి కూడా సెల్ఫీలకు పోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర రీతిలో సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు టీనేజర్లపైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సోమవారం రాత్రి కుల్గాచియా- బగ్నాన్ రైల్వేస్టేషన్ల మధ్య మహిష్రేఖ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని జీఆర్పీ పోలీసులు మంగళవారం తెలిపారు. మృతులను బగ్నాన్ ప్రాంతానికి చెందిన షరీఫ్ అలీ ముల్లిక్ (18), షరిఫుల్ ముల్లిక్ (14)గా గుర్తించినట్టు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత గుడ్‌బై.. బీజేపీలో చేరిక! -
ప్రాణం మీదకు తెచ్చిన సరదా..సెల్ఫీ కోసం రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి..
బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్ రాజ్‌పుర్ నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి. ధార్వాడ్ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉండే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు. వానలు పడినప్పుడు నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్ -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి
సాక్షి, చందుర్తి(కరీంనగర్): సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, ఖిల్లా మీది నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన చందుర్తి మండలంలోని ఎన్గల్‌లో విషాదం నింపింది. గ్రామానికి చెందిన సింగం స్వామి–రాజమణి దంపతులకు కుమారుడు రంజిత్(25) డిగ్రీ వరకు చదువుకుని, హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రంజిత్ (ఫైల్) బుధవారం గోల్కొండ ఖిల్లాను చూసేందుకు వెళ్లి, సెల్ఫీ దిగేందుకు ఖిల్లా ఎక్కాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి తమ్ముడు రాకేశ్, ఒక అక్క ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులు, తరచూ భార్యతో గొడవలు.. పొద్దున్న తలుపు తెరచి చూస్తే..
సాక్షి,రాజేంద్రనగర్( హైదరాబాద్ ): సెల్ఫీ వీడియో తీసుకోని ఓ ఫోటోగ్రాఫర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(30) కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీనికి తోడు భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకోని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో భార్యతో పాటు బావమరిది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. ఉదయం ఇంట్లో నుంచి చంద్రశేఖర్ బయటకు రాకపోవడంతో స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది
పరిగి/ మిడ్జిల్: సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆదివారం వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ నగరంలోని సూరారం కాలనీకి చెందిన వీరరాజు(25) ఆదివారం ఉదయం అనంతగిరి అందాలను వీక్షించేందుకు ఎనిమిది మంది స్నేహితులతో కలిసి కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో పరిగి సమీపంలో లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు వద్దకు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు వీరరాజుతో పాటు మరో ఇద్దరు పడిపోయారు. వీరరాజుకు ఈతరాకపోవడంతో నీటమునిగిపోయాడు. పక్కనే ఉన్న మత్స్యకారులు బయటకు తీయగా, స్నేహితులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ వీరరాజు మృతి చెందాడు. మరో ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుందేళ్ల శివప్రసాద్ (23) జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఓ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో బాబాయి కూతుళ్లతో కలిసి సమీప దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి నీట మునిగి మృతి చెందాడు. కాగా, శివప్రసాద్ తండ్రి కృష్ణయ్య మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి యశోద ప్రస్తుతం కుమారుడిపైనే ఆధారపడి ఉంది. -
నవ వధువుని.. సెల్ఫీ దిగుదామని గుట్టపైకి తీసుకెళ్లి..
సాక్షి, వనపర్తి (మహబూబ్‌నగర్): సెల్ఫీ దిగుదామని చెప్పి నవ వధువును గుట్టపైకి తీసుకెళ్లిన భర్త..అక్కడి నుంచి ఆమెను తోసేసి హతమార్చిన ఘటన వనపర్తి జిల్లా తిరుమలయ్యగుట్టపై చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు చెప్పిన కథనం ప్రకారం..... గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని జిలెల్ల ́పాడుకు చెందిన సరోజమ్మ, మద్దిలేటి దంపతులు 18 నెలల కిందట అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురానికి బతుకుదెరువు కోసం వచ్చారు. వారి కుమార్తె శరణ్య అలియాస్ గీతాంజలిని గట్టు మండలం చిన్నోని పల్లెకు చెందిన జయరాం గౌడ్‌తో రెండు నెలల క్రితం... వివాహం జరిపించారు. అతను భార్యను బుధవారం వన పర్తి వద్ద ఉన్న తిరుమలయ్య గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. సెల్ఫీ దిగుదామని చెప్పి ఎత్తై ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఏమీ తెలియనట్లు జయరాంగౌడ్ అయిజకు వచ్చి తన భార్య కన బడడడం లేదని గురువారం పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అయిజలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. జయరాం కదలికలపై అనామానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో తన భార్యను తానే హత్య చేసిన ట్లు అంగీకరించినట్లు సమాచారం.... పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. గురువారం... సాయంత్రం సంఘట స్థలం వనపర్తి జిల్లా తిరుమలయ్యగుట్టకు వచ్చి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. -
జలపాతం అంచున సెల్ఫీ, అనూహ్యంగా మృత్యు ఒడిలోకి
హాంకాంగ్: డేర్‌డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించింది. వాటర్‌ఫాల్ అందాలు వీక్షించడానికి శనివారం తన స్నేహితులతో కలిసి హాంకాంగ్‌లోని హాపాక్లై అనే పార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి జలపాతం అంచున సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పట్టు తప్పి కింద పడిపోయింది. సుమారు 16 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోఫియాను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధృవీకరించారు. కాగా సోఫియా కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. డేంజరస్ స్టంట్లు చేయడంతో పాటు వాటి ఫొటోలను ఫాలోవర్లతో పంచుకునేది. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో.. అభిమానులందరికీ మంచి వీకెండ్ ఉండాలని ఆశిస్తూ పెట్టిన ఆఖరి పోస్ట్ వైరల్‌గా మారింది. 'అందరికీ మంచి జరగాలని ఆశించిన నువ్వు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయావు' అంటూ నెటిజన్లు సోఫియాకు నివాళులు అర్పిస్తున్నారు. -
దారుణం: ప్రేమించిన యువతి దక్కలేదని..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హమిర్పూర్ జిల్లా జాఖరీ గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసాద్ ప్రజాపతి అనే యువకుడు రాజస్థాన్‌లోని అల్వాల్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో, తను ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే, లక్ష్మీ ప్రసాద్ ప్రేమను అతని, తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. తాను ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుందనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నేరుగా వ్యవసాయ భూమికి చేరుకున్నాడు. అక్కడ, తీవ్ర ఆవేదనకు లోనై ఏడుస్తూ.. సెల్ఫీవీడియో తీసి బంధువులకు, తన మిత్రులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా ఉన్న సదరు యువకుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం
సాక్షి, పర్లాకిమిడి(ఒరిస్సా) : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానిక రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆగి ఉన్న పాసింజర్ రైలులోని 2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పర్లాకిమిడి నుంచి రైళ్లు తిరగడం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం పాసింజర్ రైలును స్థానిక స్టేషన్లో నిలుపుదల చేశారు. బోగీలు, ఇంజిన్ వేరుచేసి, పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు ఎలక్ట్రికల్ లైన్‌ను సరి చేస్తున్నారు. చదవండి: నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో అయితే అటుగా వచ్చిన పర్లాకిమిడిలోని గౌరచంద్ర వీధికి చెందిన సూర్యకుమార్ ఎలక్ట్రిక్ ట్రైను బోగి ఎక్కి, సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్‌ను పట్టుకున్నాడు. బోగీలుపై కప్పి ఉన్న గోనె సంచులు తగులుకుని మంటలు చెలరేగి, బోగీలకు వ్యాపించాయి. దీంతో బాలుడు కూడా మంటల్లో చిక్కి, కాలిపోయాడు. అగి్నమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన జీఆర్పీ పోలీసులు.. మృతదేహాన్ని కిందికి దించారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ఆదిలాబాద్‌రూరల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ రోజున జలపాతం వద్దకు స్నేహితులతో వెళ్లిన యువకుడు అందులోపడి గల్లంతు కాగా మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల, కుటుంబ సభ్యుల క థనం ప్రకారం.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన డి.సచిన్ (20) స్నేహితుడితో కలిసి సోమవారం మండలంలోని ఖండాల జలపాతానికి వెళ్లాడు. సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారీ పడ్డాడు. దీంతో తోటిమిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టిగా చీకటి పడడంతో ఆచూకీ లభ్యం కాలేదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచే జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబం.. సచిన్ తండ్రి ఏడేళ్ల కిందట పాముకాటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి తిర్వణబాయి సచిన్‌తో పాటు మరో కుమారుడిని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే సచిన్ ఆదిలాబాద్ పట్టణంలో డిగ్రీ చదువుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ టీ హోటల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సచిన్ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సచిన్ కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
పలమనేరు(చిత్తూరు జిల్లా) : సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లిన వ్యక్తి శవమైన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు కౌండిన్య అటవీ ప్రాంతంలోని గంగనశిరసు జలపాతం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. సముద్రపల్లి గ్రామానికి చెందిన కట్టెల సుబ్బయ్య కుమారుడు కట్టెల తిరుమలేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల కురిసిన వర్షాలకు గంగనశిరసు జలపాతం హోరెత్తుతోందని తెలిసి స్నేహితులతో కలసి వెళ్లాడు. అత్యంత ప్రమాదకరమైన ఈ చోటుకెళ్లి అక్కడి ఎత్తైన కొండల నుంచి కిందికి ప్రవహిస్తున్న నీటితో సహా తాను సెల్ఫీ తీస్తూ ప్రమాదవశాత్తు జలపాతంలోకి పడ్డాడు. పైకి రావడానికి సాధ్యం కాక అక్కడే మృతిచెందాడు. గుహల మధ్య వచ్చే నీటి ప్రవాహంలో ఓ చోట బండరాళ్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుపోయింది. తమతో వచ్చిన స్నేహితుడు లోయలో పడ్డారని ఆందోళన చెందిన వారంతా అతన్ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా వీలుకాలేదు. ఈ విషయం తెలిసి గ్రామానికి చెందిన పలువురు, చుట్టుపక్కల గ్రామస్తులు జలపాతానికి చేరుకున్నారు. అతికష్టమ్మీద మూడుగంటల పాటు కష్టపడి మృతదేహాన్ని బయటకులాగారు. ఆపై మూడు కిలోమీటర్ల మేర శవాన్ని మోసుకొచ్చి స్వగ్రామానికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తిరుమలేష్ మృతితో సముద్రపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. -
విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది!
సాక్షి, గుంటూరు: సెల్ఫీ దిగితే చాలా అందంగా ఉంటాం.. కానీ జీవితం అంతకంటే అందమైనదీ, అద్భుతమైనది. ఒక్క సెల్ఫీ కోసం అలాంటి జీవితాన్ని పణంగా పెట్టకూడదు. సెల్ఫీ విషాదాలు ఎన్ని జరిగినా.. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట సెల్ఫీ విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం.. జాగ్రత్త పడండి అంటూ వచ్చే సందేశాలు చూసి ఆ ప్రమాదం మనదాకా రాదులే అనుకుంటాం. అలా అనుకొనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ధనలక్ష్మి నిర్లక్ష్యంగా సెల్ఫీ దిగుతూ.. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయింది. నరసరావుపేటకు చెందిన 20 ఏళ్ల ధనలక్ష్మి... గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. బంధువుల ఇంట్లోని పెళ్లి కోసం తన స్వగ్రామం వెళ్లింది. అదే రోజు కండ్లకుంటలో నివసిస్తున్న తన అక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో నీటితో పరవళ్లు తొక్కుతున్న గుంటూరు బ్రాంచ్ కాలువ కనిపించింది. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి కాల్వ వద్ద చాలాసేపు రకరకాల సెల్ఫీ ఫోటోలు దిగారు. అందరూ తిరగి వెళ్తున్నప్పుడు చివరిగా ఒక్క ఫోటో దిగుతానంటూ ధనలక్ష్మి మళ్లీ కాల్వ వద్దకు వెళ్లింది. అంతే సెల్ఫీకి ఫోజిచ్చే క్రమంలో కాల్వలోకి జారి పడిపోయింది. అంతా తేరుకొని చూసేసరికి సెల్ ఫోన్ మాత్రమే గట్టుమీద కనిపించింది.. సెల్ ఫోన్లోని ఫోటోలు చూశాక ఆమె నీటిలో పడిపోయిందని నిర్ధారించుకున్నారు. పది నిమిషాల్లోనే ధనలక్ష్మి నీటిపై తేలుతూ కనిపించడంతో కాల్వలోకి దిగి బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ప్రతి జ్ఞాపకాన్నీ స్మార్ట్ గా బంధించాలనీ.. అందరితో పంచుకోవాలనీ యువత ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జరిగే ప్రమాదాలను ఉపద్రవాలనూ గుర్తించకపోవడంవల్ల కన్నవారికి కడుపుకోత మిగులుతోంది.. సెల్ఫీ అందంగానే ఉంటుంది.. కానీ జీవితం అంతకంటే అపురూపమైనది.. ! -
ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా
-
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం
మెల్బోర్న్: భారతీయ విద్యార్థి ఒకరు సెల్ఫీ తీసు కుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయి చనిపోయిన విషాద ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అంకిత్ అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బనీ పట్టణం దగ్గర్లోని ప్రఖ్యాత పర్యాటక సముద్ర తీరం వద్ద ఉన్న రాళ్లపై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం అక్కడికి వెళ్లిన అంకిత్, అక్కడి రాళ్లపై ఉత్సాహంగా దూకుతూ ఉన్న సమయంలో, 40 అడుగుల ఎత్తైన రాతి శిఖరం నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
కొండపై సెల్ఫీకి యత్నం.. భారతీయ విద్యార్థి మృతి
మెల్బోర్న్: సెల్ఫీ సరదాకి మరో ప్రాణం బలైపోయింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండపై సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి సముద్రంలో పడి మృతి చెందాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బెనీ పట్టణంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల అంకిత్ పెర్త్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. తన ఫ్రెండ్స్‌తో సరదాగా షికారుకు వెళ్లాడు. ఈ ప్రయత్నంలో 40 మీటర్ల ఎత్తైన కొండ రాయిపై సెల్ఫీకి యత్నించి.. జారి సముద్రంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తర్వాత అతని మృతదేహాన్ని బయటకు తీశారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, రెండేళ్ల క్రితం మూసివేసినప్పటికీ తరచూ కొందరు అక్కడికి వస్తున్నారని అధికారులు వెల్లడించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫొటోకు పోజు.. తలలోకి తూటా..
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం వార్తల్లో వస్తున్న అప్రమత్తం కాకపోవడంతో సెల్ఫీ మరణాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ప్రమాదకరమైన వస్తువులతో కెమెరాకు పోజులివ్వడం.. క్లిక్ ఇచ్చే సమయానికి తమ చేతుల్లోని వస్తువులను కూడా నొక్కేయడం ఆ వస్తువు కాస్త తుపాకీ అయి ఉంటే అది పేలిపోయి ప్రాణాలుపోవడం పరిపాటిగా జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ఉపాధ్యాయుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఓ టీనేజీ యువకుడితో కలిసి గన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా అనూహ్యంగా అది పేలి అతడు చనిపోయాడు. సెల్ఫీ తీస్తున్న 17 ఏళ్ల బాలుడే ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కినట్లు తెలుస్తోంది. ఆ తుపాకీ ఆ యువకుడి తండ్రిది అని దానికి లైసెన్స్ కూడా ఉందని, అతడు ప్రాపర్టీ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మైనర్ అయిన ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. -
సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
-
సెల్ఫీ చంపేసింది
సుల్తాన్‌బజార్: సెల్ఫీ సరదా ఓ ఐఐటీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఎంజే మార్కెట్‌కు చెందిన నరేన్(20) ఉత్తరాఖండ్‌లోని చల్లా వాటర్‌డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులోపడి మృతి చెందాడు. ఈ నెల 18న డ్యామ్‌లోపడి గల్లంతు కాగా సోమవారం మృతదేహం దొరికింది. వివరాలు.. మాధవి, రాజేంద్రమోహన్ దంపతులు మోజంజాహి మార్కెట్లో నివాసముంటున్నారు. రాజేంద్రమోహన్ జూబ్లీహిల్స్‌లోని శౌర్యభవన్‌లో స్పెషల్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నరేన్ ఒక్కగానొక్క సంతానం. ఢిల్లీలో ఐఐటీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నరేన్ తన 8 మంది స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బయలు దేరారు. ఈ నెల 18న ఉత్తరాఖండ్‌లోని చెల్లా డ్యామ్ వద్ద సరదాగా సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేశారు. మూడు రోజుల తరువాత పోలీసులు నరేన్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరేన్ మృతితో ఎంజేమార్కెట్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. -
మృత్యువులోనూ వీడని స్నేహం
బయ్యారం(ఇల్లందు): దీపావళి పండుగ సెలవుల్లో ఇళ్లకు వచ్చారు.. సరదాగా మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు అందాలను తిలకించేందుకు వెళ్లారు. చెరువు అలుగు పోస్తుండగా సెల్‌ఫోన్‌తో ఫొటోలు దిగుతున్నారు.. స్నేహితులిద్దరూ సెల్ఫీ దిగుతున్న క్రమంలో ప్రేమ్‌భరత్ ప్రమాదవశాత్తు నీటిలో పడగా రక్షించేందుకు వెళ్లి జయరాజు నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో వారి కుటుంబాలతో పాటు స్నేహితులు, బంధువుల్లో పెనువిషాదం నింపింది. పట్టణంలోని నెహ్రూసెంటర్ సమీపంలో నివసించే నాగేళ్ల ప్రేమ్‌భరత్, అదే వీధిలో శ్రావణి మెస్ నిర్వహిస్తున్న జయరాజు బాల్యస్నేహితులు. ప్రేమ్‌భరత్ కాజీపేటలో డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతుండగా, జయరాజు మెస్‌ను నిర్వహిస్తున్నాడు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన వారిద్దరూ తమ అక్కలు, తోటి స్నేహితులతో చెరువు వద్దకు వచ్చి నీటిలో గల్లంతయ్యారు. విషయాన్ని తెలుసుకున్న గార్ల ఎస్సై వంశీధర్, మహబూబాబాద్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికి చీకటి పడటంతో లభ్యం కాలేదు. -
ఫొటోల మోజులో ప్రాణాలు హరీ
శ్రీకాకుళం రూరల్: ఫొటోల పిచ్చి పెచ్చుమీరుతుంది. ప్రాణాలు పోగొట్టుకునేవరకు తీసుకెళుతుంది. ఓ అందమైన సెల్ఫీ, ఫొటో తీసి ఫేస్బుక్లో, వాట్సాప్‌లో పోస్టు చేయాలనుకున్నాడు. చివరకు ఆ ఫొటో వ్యామోహమే అతని ప్రాణాలను బలిగొంది. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి గోవిందనగర్ కాలనీ సమీపంలో రామిగెడ్డలో గెంతుతూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలావున్నాయి. శ్రీకాకుళం నగరంలోని పెద్దరెల్లివీధికి చెందిన అరుగుల యువతేజ(17) స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఓకేషనల్ కోర్సు అభ్యసిస్తున్నాడు. రోజూలాగే శనివారం ఉదయం కూడా కళాశాలకు వెళ్లి తన స్నేహితులతో కలిసి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చేశాడు. అక్కడ నుంచి స్నేహితులైన జి.ఢిల్లేశ్వరరావు, పి.జయకృష్ణ, జె.అరుణ్‌తో కలిసి రామిగెడ్డలో స్నానాలు చేసేందుకు సైకిల్‌పై బయలుదేరారు. వీరిలో కొందరు కల్వర్టు పైనుంచి గెడ్డలో గెంతుతూ స్నానాలు చేస్తుండగా ఒడ్డున ఉన్న ఇంకొక స్నేహితుడు వారికి ఫొటోలు తీస్తున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఇంకొకరు గెడ్డలో గెంతుతూ సెల్ఫీ, ఫొటోల మోజులో పడిపోయారు. అయితే యువతేజ కల్వర్టు పైనుంచి దూకిన వెంటనే గెడ్డ అడుగు భాగాన ఉన్న రాయికి తలవెనుక భాగం ఢీకొట్టింది. ఒక్కసారిగా అపస్మారకస్థితికి చేరుకుని గెడ్డ అడుగు భాగాన ఉండిపోయాడు. యువతేజ కనిపించడం లేదంటూ స్నేహితులంతా గెడ్డపరిసర ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు. అయినా అతడి ఆచూకీ కనిపించకపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి వెంకట్రావు తన సిబ్బందితో కలిసి రామిగెడ్డ వద్దకు చేరుకొని యువతేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మృతదేహం లభ్యమయింది. ఈ విషయాన్ని వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వాసునారాయణ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరాతీసి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు యువతేజ మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు అప్పన్న, తిరుపతమ్మ గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. ముగ్గురు సంతానంలో ఆఖరివాడైన యువతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బోరున విలపిస్తున్నారు. -
జంబో సెల్ఫీ ఎంత పని చేసిందంటే...
సాక్షి, భువనేశ్వర్: సెల్ఫీ మోజు మరో వ్యక్తి ఒడిషాలో మరో వ్యక్తి ప్రాణాలు బలిగింది. ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయాడు. రూర్కెలా జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కటక్‌కు చెందిన 30 ఏళ్ల అశోక్ భారతి సుందర్ఘడ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక మందియాకుదార్ ప్రాంతంలో రెండు వారాలుగా ఓ ఏనుగు సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని తరిమేందుకు రంగంలోకి దిగారు. విషయం తెలిసిన అశోక్ గ్రాస్తులతోపాటు ఆ ఘటనను చూసేందుకు వెళ్లాడు. ఘటననంతా తన కెమెరాలో బంధించిన అశోక్ చివరకు ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన ఏనుగు అతని వెంటపడి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం అతన్ని రూర్కెలా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని కన్జర్వేటర్ సహయ అధికారి జేకే మహంతి తెలిపారు. -
కొండచివరెక్కి.. సెల్ఫీలకి పోజులిచ్చి..
డెహ్రాడూన్: ప్రతిరోజు సెల్ఫీల మరణాలు చూస్తున్నా యువత తీరు మాత్రం మారడం లేదు. ఏది ప్రమాదమో.. ఏది కాదో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే కోల్పోతున్నారు. డెహ్రాడూన్‌లో మన్దీప్, మునీర్ అహ్మద్ అనే ఇద్దరు స్నేహితులు. వారు ఒక రోజంతా టూర్‌కోసం ముస్సోరి బయలుదేరి సరదాగా గడిపారు. అక్కడ పడితే అక్కడ ఫొటోలు దిగారు. తిరిగి వచ్చే క్రమంలో ఒక కొండను చూసి అక్కడి నుంచి స్వీయ చిత్రాలు తీసుకోవాలనిపించింది. దీంతో ఆ ఇద్దరు తమ బైక్‌లు పార్కింగ్ చేసి కోలుకేట్ అనే గ్రామంవద్ద దాదాపు 50 అడుగుల ఎత్తున్న కొండ ఎక్కారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలు రావాలని వెనక్కి జరిగి సెల్ఫీ తీసుకుంటుండగా మునీర్ అహ్మద్ అంతెత్తుమీద నుంచి కిందపడ్డాడు. తోటి స్నేహితుడు సహాయం కోసం అక్కడే ఉన్న గ్రామస్తులను తీసుకొచ్చినా అతడి స్నేహితుడు ప్రాణాలుకోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తలకు బలమైన గాయాలయిన కారణంగానే మునీర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో మునీర్ బీకామ్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇప్పటికే సెల్ఫీ మరణాల్లో డెహ్రాడూన్ తొలి స్థానంలో ఉంది.