సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం వార్తల్లో వస్తున్న అప్రమత్తం కాకపోవడంతో సెల్ఫీ మరణాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ప్రమాదకరమైన వస్తువులతో కెమెరాకు పోజులివ్వడం.. క్లిక్ ఇచ్చే సమయానికి తమ చేతుల్లోని వస్తువులను కూడా నొక్కేయడం ఆ వస్తువు కాస్త తుపాకీ అయి ఉంటే అది పేలిపోయి ప్రాణాలుపోవడం పరిపాటిగా జరుగుతున్నాయి.
తాజాగా ఢిల్లీలో ఓ ఉపాధ్యాయుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఓ టీనేజీ యువకుడితో కలిసి గన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా అనూహ్యంగా అది పేలి అతడు చనిపోయాడు. సెల్ఫీ తీస్తున్న 17 ఏళ్ల బాలుడే ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కినట్లు తెలుస్తోంది. ఆ తుపాకీ ఆ యువకుడి తండ్రిది అని దానికి లైసెన్స్ కూడా ఉందని, అతడు ప్రాపర్టీ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మైనర్ అయిన ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
ఫొటోకు పోజు.. తలలోకి తూటా..
Published Fri, Mar 9 2018 2:47 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment