![19 Years Old boy Suicide In UPs Hamirpur After Girl He Loved Gets Married - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/6/suc.gif.webp?itok=ZntuRTTS)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హమిర్పూర్ జిల్లా జాఖరీ గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసాద్ ప్రజాపతి అనే యువకుడు రాజస్థాన్లోని అల్వాల్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.
ఈ క్రమంలో, తను ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే, లక్ష్మీ ప్రసాద్ ప్రేమను అతని, తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. తాను ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుందనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు.
దీంతో నేరుగా వ్యవసాయ భూమికి చేరుకున్నాడు. అక్కడ, తీవ్ర ఆవేదనకు లోనై ఏడుస్తూ.. సెల్ఫీవీడియో తీసి బంధువులకు, తన మిత్రులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా ఉన్న సదరు యువకుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment