Young boy
-
17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదన
ఆలోచన ఉండాలే గానీ.. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో అయితే.. కంటెంట్ క్రియేషన్ & డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో యువకులు డబ్బు సంపాదించడానికి సిద్దమైపోతున్నారు. ఇలాంటి మార్గాలను అనుసరించే ఓ బ్రిటీష్ యువకుడు నెలకు ఏకంగా రూ.16 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.17 ఏళ్ల బ్రిటీష్ యువకుడు కెలన్ మెక్‌డొనాల్డ్.. పండుగ సీజన్లో ప్రత్యేకమైన స్టిక్కర్లను విక్రయించడం ద్వారా నెలకు 19000 డాలర్లు (రూ. 16,08,748) సంపాదిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అతని తల్లి ఇచ్చిన డిజిటల్ డ్రాయింగ్, కటింగ్ & ప్రింటింగ్ మెషీన్‌ను ఉపయోగించే ఇంత పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు.కెలన్ మెక్‌డొనాల్డ్ రూపొందించిన స్టిక్కర్ల ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేశారు. సొంతంగా రూపొందించిన స్టిక్కర్లను గాజు వస్తువులు, యాక్రిలిక్పై అంటించి.. డబ్బు సంపాదించేవారు. ప్రతి రోజూ కాలేజ్ పూర్తయిన తరువాత స్టిక్కర్ల వర్క్ మీద మూడు గంటలకు పనిచేసేవాడు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇప్పటి వరకు కెలన్ 94,410.31 డాలర్లు సంపాదించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 79.93 లక్షల కంటే ఎక్కువే. నాకు లభించిన క్రిస్మస్ కానుక ద్వారా ఇంతలా డబ్బు సంపాదించవచ్చని నేను ఊహించనే లేదు. ప్రస్తుతం నా సమయం కూడా చాలా వేగంగా సాగిపోతోంది కెలన్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. -
హీరో విజయ్ బర్త్‌డే వేడుకల్లో అపశృతి.. కాలిపోయిన బాలుడి చేయి!
దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానుల అత్యుత్యాహం ప్రమాదానికి దారి తీసింది. విజయ్ 50వ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా చెన్నై విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఈసీఆర్ శరవణన్ ఫ్యాన్స్ కోసం ఒక ట్రిక్రీ షోను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ షోలో ఓ యువకుడు కిరోసిన్ ఉపయోగించి స్టంట్ చేస్తున్నాడు. చేతికి మంటలు అంటించుకొని టైల్స్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ కమ్రంలో ప్రమాదం జరిగింది. టైల్స్ పగలగొట్టిన తర్వాత యువకుడి చేతి మంటలు ఆరిపోలేదు. అది కాస్త ఎక్కువై చేయి మొత్తం కాలిపోయింది. ఈవెంట్లో పక్కనే ఉన్నవారు త్వరగా స్పందించి.. మంటలు ఆర్పేశారు. అనంతరం అంబులెన్స్‌లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. -
వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్ చూపాడు
వీల్‌చైర్‌కు పరిమితమైన ఈ యువకుడు విల్ పవర్ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్‌చైర్‌లో నుంచి రిషికేష్‌లో బంగీ జంప్ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ డేర్’ ‘మోర్ పవర్ టు యూ, బాయ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. చాలామంది హార్ట్ ఇమోజీలతో రియాక్ట్ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్ అవనీష్ బాజ్‌పాయ్ ఆర్టిఫిషియల్ లింబ్‌తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం!
అనంతపురం: ప్రేమించిన బాలికతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థి (మైనర్) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన సోమనాథ్, రుక్మిణమ్మ దంపతుల పెద్ద కుమారుడు అభిషేక్ (17) కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. ఈ వయసులోనే పెళ్లి వద్దని బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అమ్మాయితో పెళ్లి చేస్తామని, అప్పటి వరకూ బుద్ధిగా చదువుకోవాలని తండ్రి సోమనాథ్ తెలిపాడు. ఇందుకు అభిషేక్ అంగీకరించలేదు. తనకిప్పుడే పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు.... మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలను కుమారుడికి వివరించారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ గురువారం తెల్లవారుజామున తమ తోటలోకి వెళ్లి చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి సోమనాథ్... చెట్టు వేలాడుతున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇవి చదవండి: ‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు -
రూ.350 కోసం దారుణ హత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బాలుడు కేవలం రూ.350 కోసం 18 ఏళ్ల యువకుడిని అత్యంత పాశవికంగా హత్యచేశాడు. హత్య చేసి దోచుకున్న సొమ్ముతో బిర్యానీ తిందామని నిందితుడు భావించాడు. గొంతు నులిమి ఊపిరిపోయేలా చేసి కుప్పకూల్చాడు. వెంటనే కత్తితో విచక్షణారహితంగా 60 సార్లకుపైగా పొడిచాడు. తల, మెడ, కళ్లు, వీపు.. ప్రతి చోటా పొడిచాడు. ఒళ్లంతా రక్తసిక్తమైన మృతదేహంపై నిల్చుని డ్యాన్స్‌చేశాడు. ఈ దారుణ హత్య అక్కడి సీసీటీవీలో రికార్డయింది. మంగళవారం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలోని జనతా మజ్దూర్ కాలనీలో చోటుచేసుకుంది. హత్య తర్వాత నిందితుడు అక్కడ గుమికూడిన జనాన్ని దగ్గరకు రాకుండా బెదిరించాడు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని బుధవారం ఉదయం అరెస్ట్‌చేశారు. చనిపోయిన 18 ఏళ్ల మృతుడికి, 16 ఏళ్ల నిందితుడికి అస్సలు ముఖ పరిచయం కూడా లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు గత సంవత్సరంలోనూ ఇలా ఒకరిని డబ్బు దొంగలించేందుకు బెదిరించాడని తెలుస్తోంది. నిందితుడుసహా నలుగురు మైనర్లు ఒక గ్యాంగ్‌లా ఏర్పడి చిన్నపాటి చోరీలు చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మద్యం మత్తులో ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించానని పోలీసుల ముందు నిందితుడు నేరం అంగీకరించాడు. -
సింగిల్‌ఫేజ్ స్థంబానికి కరెంట్ వైర్ పెడుతుండగా.. విషాదం!
నిజామాబాద్: తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడిలో దూదేకుల ఇంతియాజ్ (25)అనే యువకుడు శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామ శివారులోని తన ఫౌల్ట్రీఫాం వద్దకు వెళ్లిన ఇంతియాన్ అక్కడనేఉన్న సింగిల్‌ఫేజ్ స్థంబానికి కరెంట్ వైర్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అఫ్రిస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవి చదవండి: రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడు.. -
వీడు మాములోడు కాదు, డ్రమ్ములు అదిరిపోవాల్సిందే
-
బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్ను గురి చూసి కొడుతున్నాడు. దూరంలో ఉన్న లక్ష్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rudra Pratap singh (@littleyogaguru) ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన్నోడు టాలెంట్ చూసేయండి. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని..
పామును చూస్తేనే మనం వణికిపోతాం.. తెలిసీ తెలియని వయసులో ఓ చిన్నారి పాముకు చుక్కలు చూపించాడు. పాము తోకను పట్టుకుని దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి అందరినీ భయపెట్టాడు. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఒక బుడతడు ఏకంగా పాముతో ఆడుకున్నాడు. దానిని చేతితో పట్టుకుని ఇంటి లోపలకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అది చూసి కుటుంబ సభ్యులు దడుచుకున్నారు. ఈ క్రమంలో నేలపై కూర్చొన్న వారు ఒక్కసారిగా పైకి లేచి దూరంగా పరిగెత్తారు. గట్టిగా అరుస్తూ భయపడిపోయారు. అలాగే పామును లోపలకు తీసుకురావద్దని, బయటకు తీసుకెళ్లాలంటూ బాలుడికి సైగలు చేస్తూ గట్టిగా అరిచారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ బాలుడి మరో చేయి పట్టుకుని పాముతో సహా అతడిని ఇంటి బయటకు తీసుకెళ్లాడు. దీంతో, ప్రమాదం తప్పింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఈ ఘటనకు ఇంటి పెద్దల నిర్లక్ష్యాన్ని కొందరు విమర్శించారు. జంగిల్ బుక్ విలేజ్ బుక్‌గా మారిందని కామెంట్స్ చేశారు. ఈ వీడియో చూస్తే ఖంగు తింటారు.. నేడు(జూలై 16న) వరల్డ్ స్నేక్ డే.. ఈ సందర్భంగా పలువురు పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఓ నెటిజన్ షాకింగ్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోకు తోక పట్టుకుని పామును జడ్జ్ చేయకండి అంటూ కామెంట్స్ పెట్టారు. Never Judge a snake by it's tail ? @Pendrive_Baba pic.twitter.com/ytet6ps7bg — Jude David (@judedavid21) September 6, 2021 ఇది కూడా చదవండి: వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య.. -
ఫ్రాన్స్‌లో ఆగని నిరసనలు
పారిస్: ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్‌డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు. పారిస్‌లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్‌ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది. టీనేజర్లను బయటకు రానివ్వకండి: తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్‌లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
తగ్గేదే లే.. ఈ బుడ్డోడి డాన్స్ చూశారా?
-
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్‌తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
Viral Video: మ్యాన్ హోల్ ను డంబెల్ లా ఎత్తేశాడు.. కానీ..!
-
హైదరాబాద్ నుంచి పారిపోయి కర్ణాటకలో సహజీవనం
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన ఓ మైనర్ బాలుడిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ బాలుడు(17), బాలిక (16) మే నెలలో తమ తమ ఇళ్లల్లో నుంచి పారిపోయారు. కూతురు కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటకలో వారు ఉన్నట్లు గుర్తించారు. కాగా బాలిక అప్పటికే నాలుగు మాసాల గర్భవతి. బాధ్యుడైన మైనర్ బాలుడిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్) -
Viral Video : సింహంతో వ్యక్తి పరాచకాలు..
-
కన్నీళ్లు మిగిల్చి... వెళ్లిపోయావా కన్నా
విశాఖపట్నం: తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. పాఠశాలకు వెళ్తూ తల్లి కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన ఉక్కునగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక డీపాల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పెరుమాళ్ల ఎలీజా సేవారిన్ (9) తల్లితో కలిసి శనివాడలో నివసిస్తున్నాడు. తండ్రి ఎలై సేవారిన్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా తల్లి సౌజన్యతో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తల్లి సౌజన్య కుమారుడిని తీసుకుని స్కూటీపై స్కూల్‌కు బయల్దేరారు. సరిగ్గా డీపాల్ పాఠశాల కూడలి వద్దకు వచ్చేసరికి మలుపు తిరుగుతున్న స్కూటీని ఫార్మా కంపెనీకి చెందిన బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎలీజా సేవారిన్ కింద పడిపోవడంతో బస్సు బాలుడి తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో చిన్నారి తల భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతిచెందాడు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో తల్లి సౌజన్య షాక్‌కు గురైంది. అప్పటి వరకూ తనతోనే ఉన్న కుమారుడు విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయింపు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బస్సు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో డ్రైవర్, అందులోని ఫార్మా ఉద్యోగులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఉక్కునగరం పోలీసులు ఘటనా స్థలికి భారీగా చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ఫార్మా బస్సులు ఈ మార్గంలో ప్రయాణించరాదని, ప్రమాదానికి కారణమైన ట్రాన్స్‌ఫోర్టు సంస్థ యజమాని రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాఠశాల విద్యార్థి మృతి చెంది బయట ఉద్రిక్తతగా ఉండగా తరగతులు నిర్వహించడంపై యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక డీసీపీ ఆనందరెడ్డి, ఏసీపీ టి.త్రినాథ్, స్టీల్‌ప్లాంట్, దువ్వాడ, గాజువాక సీఐలు, ఎస్ఐలు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నంచారు. అనంతరం టౌన్ అడ్మిన్ విభాగంలో ఉక్కు యాజమాన్యం ప్రతినిధులు చర్చలు జరిపారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, బయ్యే మల్లయ్య, ఎస్.మోహన్‌బాబు జరిపిన చర్చల్లో మృతుని కుటుంబీకులకు డీపాల్ పాఠశాల యాజమాన్యం రూ. 5 లక్షలు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. ఫార్మా కంపెనీ చిన్న స్థాయి అధికారులు రూ.లక్ష ఇస్తామని చెప్పగా ఎమ్మెల్యే నాగిరెడ్డి తిరస్కరించి రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. వారి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనంతరం స్టీల్‌ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. -
పెళ్ళి విషయమై ప్రేమికుల మధ్య ఘర్షణ.. యువకుడిపై బ్లేడుతో యువతి దాడి
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ యత్నాలు చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య కూడా అదే రోడ్డులోని ఓ మహిళా హాస్టల్లో ఉంటూ ఉద్యోగ వేటలోనే ఉంది. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న టీ స్టాల్ వద్ద మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఇక ఈమధ్యనే తాను ప్రేమిస్తున్నాను, వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పిన అశోక్ ఆమె ఖర్చులు కూడా భరిస్తూ వస్తున్నాడు. కాగా ఈ నెల 5వ తేదీన టీస్టాల్ వద్ద ఇద్దరూ కలిసిన సమయంలో అశోక్ పెళ్లి ప్రస్తావన తేగా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న బేడు (మినీ కట్టర్)తో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్రగాయమైంది. పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదునైన బ్లేడ్ (మినీ కట్టర్)తో బలంగా దాడి చేయడంతో అశోక్ చెంపపై భాగంలో లోతైన గాయమైంది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంతమేరకు పెరాలసిస్ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. చదవండి: (కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు) -
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
-
బాలుడిని కాటేసి అక్కడే చనిపోయిన పాము.. షాక్‌లో పేరెంట్స్
మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ చేసిన వినయ విధేయ రామ సినిమాలో విలన్‌ను పాము కాటు వేశాక.. ఆ పాము చనిపోవడం చూశాము కదా.. అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటుచేసుకుంది. ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు అనూజ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. కాగా, అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కోట్లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్ ఇంటి ముందు ఆడుకుంటుడగా.. ఓ పాము(విష సర్పం)ను బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు.. అనూజ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే పాము చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులుతో పాటు స్థానికులు షాకయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు.. అధికారులకు అందజేశారు. ఇక, పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: నదీస్నానంలో భార్యకు ముద్దు.. బయటకు లాగి చితకబాదిన జనం -
బాలుడిపై మహిళ లైంగిక దాడి.. చివరకు భలే ట్విస్టు
బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్‌చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
బాత్రూమ్లో ట్యూషన్ టీచర్.. ఫోన్‌తో వీడియోలు తీసి..
సాక్షి, ముంబై: విద్య నేర్పిన గురువులకు ఎంతో విలువనిచ్చే దేశం మనది. కానీ, కొంత మంది విద్యార్థులు తమకు పాఠాలు నేర్పిన టీచర్ల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ టీచర్ బాత్ రూమ్‌లో ఉండగా విద్యార్థి తన సెల్ ఫోన్ కెమెరాతో ఆమె వీడియోలు రికార్డు చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. పుణెలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థికి పాఠాలు చెప్పిందుకే తన పేరెంట్స్ ఓ ట్యూషన్ టీచర్‌ను ఎంపిక చేశారు. సదరు విద్యార్థికి ఆమె.. గత ఐదేళ్లుగా పాఠాలు చెబుతోంది. టీచర్ ప్రతీరోజు బాలుడి ఇంటికి వచ్చి పాఠాలు బోధిస్తుండేది. ఈ క్రమంలో సదరు బాలుడు.. టీచర్‌పై వ్యామోహంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా బాత్రూమ్లోని ఓ సోప్ బాక్స్‌లో సెల్ ఫోన్‌ను పెట్టి వీడియోలు తీశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు టీచర్.. పాఠం చెప్పిన అనంతరం బాత్రూమ్ వెళ్లింది. ఇంతలో సోప్ బాక్స్‌లో ఏదో ఉన్నట్టు అనిపించడంతో తెరిచి చూసి.. ఒక్కసారిగా షాకైంది. సోప్ బాక్స్‌లో ఉన్న ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్‌కు చెప్పి.. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బాలుడికి పాఠాలు చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫొటోలు తీశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు
-
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్‌తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్‌బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్‌పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
బాగా చదువుకోవాలని చెప్పినందుకు..
చందానగర్: చదువుపై శ్రద్ధ పెట్టాలని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన ఓ బాలుడు 14వ అంతస్తు పైనుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగండ్లలోని ఓ అపార్ట్మెంట్ టవర్స్‌లో సీ–14 బి3లో నివాసం ఉంటున్న అమిత్ కిమోతీ తన కుమారుడు అద్వైత్ కిమోతీ(13)ని బాగా చదువుకోవాలని హెచ్చరించాడు. దీంతో అకస్మాత్తుగా పరుగుపెట్టిన అద్వైత్ 14వ అంతస్తు పై నుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో దగ్గరలోని సిటిజన్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఉదయం 9.30 గంటలకు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.