![Boy Missing Mystery In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/16/missing.jpg.webp?itok=m4T-uvz1)
సత్యనారాయణగుప్తా
సాక్షి, అమీర్‌పేట(హైదరాబాద్): నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనల ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం, కొట్టాయగూడెం రోడ్‌కు చెందిన సత్యనారాయణగుప్తా (30) కూకట్‌పల్లిలో ఉంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో క్రెడిట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
13న రాత్రి 9.30 గంటల సమయంలో సోదరుడు బాపిరాజుకు ఫోన్ చేసి తాను స్వగ్రామికి వెళ్తున్నానని, కేపీహెచ్‌బీలో బస్సు ఎక్కానని తెలిపాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబసభ్యులు నగరానికి వచ్చి సత్యనారాయణ కోసం వివిధ చోట్ల విచారించారు.
బస్సు ఎక్కి ఎస్‌ఆర్‌నగర్‌లో దిగిపోయాడని డ్రైవర్ వారికి చెప్పాడు. ఈ నెల 17న వివాహం జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment