Young Boy Archery Skills Left Internet Amazed - Sakshi
Sakshi News home page

బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌.. నెటిజన్లు ఫిదా..!

Published Fri, Jul 28 2023 6:23 PM | Last Updated on Fri, Jul 28 2023 6:41 PM

Young Boy Archery Skills Left Internet Amazed - Sakshi

సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్‌ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్‌ను గురి చూసి కొడుతున్నాడు. 

దూరంలో ఉన్న లక్ష‍్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు.  ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష‍్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన‍్నోడు టాలెంట్ చూసేయండి.

ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement