అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Young person suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Sat, Nov 5 2016 8:05 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి - Sakshi

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఫిరంగిపురం: ఓ యువకుడు గాయాలపాలై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఫిరంగిపురం శాంతిపేటకు చెందిన తలకోల క్రీస్తురాజు అలియాస్‌ మహేష్‌బాబు (26) కారు డ్రై వరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9గంటల వరకు ఇంటి వద్దనే ఉన్నాడు. బజారుకు వెళ్ళి వస్తానని ఇంటిలో చెప్పి బయటకు వచ్చిన మహేష్‌బాబు శనివారం తెల్లవారుజామున మార్నింగ్‌స్టార్‌ కళాశాల వెనుకవైపున రైలు పట్టాలు పక్కన విగతజీవిగా కనిపించాడు. తలభాగంలో, కుడిభుజంపై పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు గాయాలు ఉన్నాయి.  గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం అక్కడకు తీసుకువెళ్ళి మహేష్‌బాబును హతమార్చి ఉంటారని చర్చించుకుంటున్నారు.  అటువైపుగా పొలాలకు వెళుతున్న రైతులు గమనించి రైల్వే స్టేషన్‌లో సమాచారం అందించడంతో జీఆర్‌పీ పోలీసులు మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement