
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, వరంగల్: ఇయర్ ఫోన్ ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. ఇయర్ ఫోన్ పెట్టుకొని సరదాగా పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతల్‌లో రైలు పట్టాలపై జరిగింది. వరంగల్ జీఆర్పీ ఎస్‌ఐ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్ (28) రోజూ మాదిరిగానే పెయింటింగ్ పని కోసం వెళ్లాడు. (బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం)
పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ చింతల్‌లోని రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఏడీఆర్‌ఎం స్పెషల్ రైలు ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఎంజీఎం మార్చూరీకి తరలించారు. వరంగల్ రైల్వేస్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment