
11న తిరుపతి వెళ్తుండగా రైలు ప్రమాదం
కోరుట్ల: రైలు ప్రమాదంలో గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్లలోని ప్రకాశం రోడ్‌కు చెందిన సామల్ల గణేశ్–నీరజ దంపతులు తమ కూతురు ఉదయశ్రీతో కలిసి, గత సోమవారం తిరుపతి వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
అక్కడ రైలు ఎక్కుతుండగా ఉదయశ్రీ ప్రమాదవశాత్తు జారిపడి, తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఒక్కగానొక్క కూతురి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాదం నెలకొంది.