జవహర్‌నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ మహేష్‌కుమార్, జవహర్‌నగర్ సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం..దమ్మాయిగూడ పరిధిలోని న్యూ భవానీనగర్‌లో నివసించే పొనగంటి తానేష్, పద్మ దంపతుల కుమార్తె పూర్ణిమ (19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ట్యూషన్లు కూడా చెబుతుంది.
ఈ నెల 24వ తేదీన కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన పూర్ణిమ..పిల్లలకు ట్యూషన్ చెబుతూ మధ్యలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగి పడుకుంది. యాసిడ్ తాగానని ట్యూషన్‌కి వచ్చిన పిల్లలకు చెప్పడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. నిఖిల్ అనే యువకుడి వేధింపుల కారణంగానే పూరి్ణమ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment