యువకుడి ఇంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన చిన్నాన్న
ఇద్దరికి తీవ్ర గాయాలు
అల్వాల్: అన్న కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువతి చిన్నాన్న ప్రేమించిన యువకుడి ఇంటిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాచ బొల్లారం గోపాల్‌నగర్ ఎరుకల బస్తీలో ప్రకాష్ హేమలత దంపతులు తమ కుమారుడు ప్రదీప్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రదీప్ అదే ప్రాంతంలోని వివేకానందకు చెందిన బైక్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. వివేకానంద అన్న కుమార్తెతో ప్రదీప్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
దీంతో పలుమార్లు వివేకానంద ప్రదీప్‌ను హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరి మార్చుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన వివేకానంద ప్రదీప్, అతడి కుటుంబసభ్యులను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పెట్రోల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలతో పాటు ఇంటి తలుపులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో ప్రకా‹Ùకు తీవ్ర గాయాలు కాగా, పక్కింట్లో ఉండే దిలీప్ అనే వ్యక్తి కుమార్తె చిన్నారి చాందిని (4) రెండు కాళ్లకు మంటలంటున్నాయి. చిన్నారి చాందినిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రకాష్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వివేకానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment