ఆలోచన ఉండాలే గానీ.. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో అయితే.. కంటెంట్ క్రియేషన్ & డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో యువకులు డబ్బు సంపాదించడానికి సిద్దమైపోతున్నారు. ఇలాంటి మార్గాలను అనుసరించే ఓ బ్రిటీష్ యువకుడు నెలకు ఏకంగా రూ.16 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
17 ఏళ్ల బ్రిటీష్ యువకుడు కెలన్ మెక్‌డొనాల్డ్.. పండుగ సీజన్‌లో ప్రత్యేకమైన స్టిక్కర్‌లను విక్రయించడం ద్వారా నెలకు 19000 డాలర్లు (రూ. 16,08,748) సంపాదిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అతని తల్లి ఇచ్చిన డిజిటల్ డ్రాయింగ్, కటింగ్ & ప్రింటింగ్ మెషీన్‌ను ఉపయోగించే ఇంత పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు.
కెలన్ మెక్‌డొనాల్డ్ రూపొందించిన స్టిక్కర్‌ల ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. సొంతంగా రూపొందించిన స్టిక్కర్‌లను గాజు వస్తువులు, యాక్రిలిక్‌పై అంటించి.. డబ్బు సంపాదించేవారు. ప్రతి రోజూ కాలేజ్ పూర్తయిన తరువాత స్టిక్కర్ల వర్క్ మీద మూడు గంటలకు పనిచేసేవాడు.
ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
ఇప్పటి వరకు కెలన్ 94,410.31 డాలర్లు సంపాదించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 79.93 లక్షల కంటే ఎక్కువే. నాకు లభించిన క్రిస్మస్ కానుక ద్వారా ఇంతలా డబ్బు సంపాదించవచ్చని నేను ఊహించనే లేదు. ప్రస్తుతం నా సమయం కూడా చాలా వేగంగా సాగిపోతోంది కెలన్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment