టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్‌ఇన్ సర్వే వెల్లడించింది.
గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్‌ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్‌షాట్’ తెలిపింది.
‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్‌ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట.
ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్‌ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది.
అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్‌ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.
‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్‌లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్‌ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్‌లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్‌ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment