ఆధునిక భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న సమయంలో కేవలం ఉద్యోగం చేసి మాత్రమే డబ్బు సంపాదించాలంటే కొంత అసాధ్యమైన పనే. అయితే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు వ్యవసాయం ద్వారా కూడా అధిక లాభాలను పొందుతున్నారు. మనం ఈ కథనంలో 'శ్రీగంధం' (Sandalwood) ద్వారా ఎలా సంపాదించవచ్చు? వీటి పెంపకానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా? అనేవి వివరంగా తెలుసుకుందాం.
సౌందర్య లేపనాలు, క్రీములు వంటి వాటి తయారీలో చందనం ఎక్కువగా వినియోగిస్తారు. కావున చందనం (శ్రీగంధం) చెట్లు పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ చెట్లను రెండు ప్రాథమిక పద్ధతుల ద్వారా పెంచవచ్చు. ఒకటి సేంద్రీయ వ్యవసాయం, మరొకటి సాంప్రదాయ పద్ధతి.
సేంద్రీయ విధానం ద్వారా సాగు చేస్తే 10 నుంచి 15 సంవత్సరాలలో చెట్లు పక్వానికి వస్తాయి. అయితే సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తే 20 నుంచి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ చెట్ల పెంపకం సమయంలో కనీస రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు!
చెట్టు పక్వానికి వస్తుందనే సమయంలో సువాసనలు వెదజల్లడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కొన్ని జంతువులు భారీ నుంచి మాత్రమే కాకుండా స్మగ్లర్ల భారీ నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి దాదాపు సమశీతోష్ణ పరిసరాల్లో ఏపుగా పెరుగుతాయి.
ఒక చందనం చెట్టు ద్వారా రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన 10 చెట్లను పెంచితే రూ. 50 లక్షలు, 100 చెట్లు సాగు చేస్తే రూ. 5 కోట్లు వరకు ఆర్జించవచ్చు.
ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు!
ప్రభుత్వ నిబంధనలు:
శ్రీగంధం మొక్కలు పెంచాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ తెలుసుకుని ఉండాలి. ఇందులో ప్రధానంగా 2017లో ఇండియన్ గవర్నమెంట్ గంధపు చెక్కలను ప్రైవేట్‌గా కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నిషేధించింది. కావున చట్టం పరిధిలో చెట్లను పెంచవచ్చు, కానీ వాటిని ప్రభుత్వానికి విక్రయించాలి. అంతే కాకుండా వీటి పెంపకం ప్రారంభం సమయంలోనే అటవీ శాఖ అధికారులను తెలియజేయాలి. వారు వీటిని ఎప్పటికప్పుడు నావిగేట్ చేస్తూ ఉంటారు.
(Disclaimer: ఎక్కువ లాభాలు వస్తాయని శ్రీగంధం చెట్ల పెంపకం చేయాలనే వారు ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సంబంధిత ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటివన్నీ బేరీజు వేసుకోవాలి.)
Comments
Please login to add a commentAdd a comment