ప్రస్తుతం పంటల సాగు లాభదాయకమైన వ్యాపార మార్గంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్న పంటలు సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. మీకూ ఇలాంటి వ్యాపార ఆలోచన (Business Idea) ఉంటే లెమన్ గ్రాస్ ఫార్మింగ్ (Lemon grass farming) చేయొచ్చు.
లెమన్ గ్రాస్ (నిమ్మ గడ్డి) సాగును ఇప్పటికే చాలా చోట్ల చేపడుతూ మంచి లాభాలు గడిస్తున్నారు. కొన్ని చోట్ల దీన్ని మహిళా గ్రూప్‌లు, పొదుపు సంఘాల సభ్యులు ఉమ్మడిగా సాగుచేస్తున్నారు. ఈ ఆలోచనను ప్రధాని మోదీ కూడా గుర్తించడం మరింత ఆసక్తికర అంశం. 2020లో ప్రధాని మోదీ నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగం సందర్భంగా నిమ్మగడ్డి సాగును ప్రశంసించారు.
నిమ్మగడ్డి కేవలం నాలుగు నెలల్లోనే పెరుగుతుంది. దీని నూనెకు మార్కెట్‌లో అత్యంత గిరాకీ ఉంటుంది. అందుకే మంచి ధర లభిస్తోంది. సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, మందులతో సహా వివిధ పరిశ్రమలలో లెమన్ గ్రాస్ నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వర్గానికి చెందినది. పలు రకాల చికిత్సల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు.
లెమన్ గ్రాస్‌కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇది శుష్క ప్రాంతాలలోనూ పెరుగుతుంది. ఇది కరువు ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. సహజంగానే స్థితిస్థాపకంగా ఉండే ఈ పంటకు ఎరువులు కూడా అవసరం లేదు.
రూ. 20,000 కంటే తక్కువ పెట్టుబడితోనే హెక్టారుకు ఏటా రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. పంట ప్రారంభించిన తర్వాత, వరుసగా ఐదారు సంవత్సరాల పాటు స్థిరమైన దిగుబడి లభిస్తుంది.
అయితే లెమన్‌గ్రాస్ సాగుకు సమయం చాలా కీలకం. ఫిబ్రవరి నుంచి జులై నెలల మధ్య కాలం ఈ పంట సాగుకు అనువుగా ఉంటుంది. మొక్కల నర్సరీ బెడ్స్ సిద్ధం చేయడానికి సరైన సమయం మార్చి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలం.
ఈ పంటను ఒకసారి నాటితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు పంటలు ఆశించవచ్చు. అంటే దాని విలువైన నూనెను అధిక మొత్తంలో తీసి విక్రయించి లాభాలు పొందవచ్చు. మీడియాలో వచ్చిన పలు నివేదికల ప్రకారం. హెక్టారుకు సంవత్సరానికి 3 నుంచి 5 లీటర్ల లెమన్‌గ్రాస్ నూనెను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్‌లో ఒక్కో లీటరు లెమన్ గ్రాస్ ఆయిల్ ధర రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాలలో దాని ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
(Disclaimer: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమేనని గమనించగలరు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ అవగాహన, ఇతర వివరాలను పరిశీలించడం అవసరం.)
Comments
Please login to add a commentAdd a comment