Business Ideas in Telugu
-
తక్కువ ఖర్చుతో.. ఎక్కువ లాభాలు..! మీ కోసం బెస్ట్ బిజినెస్ ఐడియాలు
హార్డ్ వర్క్ కాదు.. ఇప్పుడంతా స్మార్ట్ వర్క్ కావాలి! ఇది స్మార్ట్ ఎరా! కావలసింది ఏదైనా క్షణాల్లో కళ్లముందు ఉండాలి..వేచి చూసే సమయం.. ఓపికా రెండూ లేవు! ఈ పల్స్‌ని పట్టుకుంది ఈ కాలపు వ్యాపారం! జగం స్మార్ట్ ఫోన్లో ఇమిడి ఉందన్న సత్యాన్ని గ్రహించింది.. స్ట్రాటజీ అల్లుకుంది! సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని మార్కెట్ చేసుకుంది.. ప్రపంచాన్నే కస్టమర్స్‌గా మలచుకుంది!ఇబ్బడిముబ్బడిగా బిజినెస్ చేస్తోంది!ట్రెండింగ్‌లో ఉన్న ఆ స్మార్ట్ ట్రేడ్ గురించి కొన్ని వివరాలు.. వినోదం.. కాసింత విజ్ఞానం.. అంతా వ్యాపారం.. అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సూత్రం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేనివారున్నారేమో కానీ సోషల్ మీడియాలో అకౌంట్‌లేని వాళ్లు లేరు. కొంచెం అతిగా అనిపించినా వాస్తవం అదే! చుట్టూ ఉన్న అంగడినంతా ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు! కాలు కదపక్కర్లేదు. కాలం తెలియనివ్వని కాలక్షేపమూనూ! ఇది కాసులు కురిపిస్తుందని కామన్ పీపుల్‌కీ అర్థమైంది. స్మార్ట్ ఫోన్‌ను అత్యవసర వస్తువుగానే కాదు కమర్షియల్ ఎలిమెంట్‌గానూ ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అంతే సెల్ ఫోన్లో డౌన్లోడ్ అయిన సోషల్ మీడియా సింపుల్‌గా ఓ కుటీర పరిశ్రమ అయిపోయింది. కాలక్షేపం, ఆర్ట్.. ఆసక్తులు.. అభిరుచులనూ బిజినెస్‌గా మలచుకోవచ్చని నేర్పుతోంది. క్రియేటివ్ కంటెంట్ నుంచి వంటింటి చిట్కాల దాకా అంతా వ్యాపారమే! పైగా దీనికో కొట్టు.. దాని మెయింటెనెన్స్.. అడ్వర్టైజ్మెంట్.. ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు.. మార్కెటింగ్ స్టాఫ్.. వంటి ఖర్చులేమీ లేకుండా అన్నీ తానై యజమానే సింగిల్ హ్యాండ్‌తో హ్యాండిల్ చేసుకోవచ్చు. అందుకే సామాన్యుల నుంచి బిజినెస్ టైకూన్స్ వరకు అందరూ సోషల్ మీడియా మార్కెట్లో అకౌంట్లు తెరిచారు. స్టార్టప్స్‌కైతే వరమనే చెప్పుకోవచ్చు. కోవిడ్ లాక్డౌన్ ఈ సోషల్ మీడియా మార్కెట్‌కి మరింత ఊతమిచ్చింది. బయట ప్రపంచమంతా షట్ డౌన్ అయిపోయి ఓన్లీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరైతే ఆ మార్కెట్లో ఏమేం ఉన్నాయో చూద్దాం! రీల్స్.. షాట్స్ నుంచి.. ‘పనీపాటా లేదా? 24 గంటలూ రీల్స్.. షాట్సేనా అని అడిగేవాళ్లకు ఈ సమాధానం.. పనీపాటా ముగించుకుని.. పనీపాటా మానేసి.. సోషల్ మీడియాలో తలదూర్చే వాళ్లకోసమే మేం పనీపాటా పక్కన పెట్టి రీల్స్, షాట్స్ చేస్తున్నాం’ అని చెప్పే రీల్ ఉంటుంది ఇన్‌స్టాలో. కొంచెం వ్యంగ్యంగా అనిపించినా అందులో నిజం ఉంది. ఆ నిజం చుట్టే సోషల్ మీడియాలో వ్యాపారం సాతుతోంది. వేలం వెర్రిగా పెరుగుతున్న.. తిరుగుతున్న రీల్స్.. షాట్స్ అన్నీ డబ్బులు ఊరించేవే. ‘రాత్రి రీల్స్ చూస్తూ నిద్రను మరచిపోతున్నాను. అందుకే పడుకునే ముందు సెల్ ఫోన్ బెడ్ మీద కాకుండా టేబుల్ మీద పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆ టేబుల్ని బెడ్‌కి దగ్గరగా జరుపుకొన్నా. ఇప్పుడు టేబుల్ మీద సెల్ పెట్టి రీల్స్ చూస్తున్నా’ అంటూ తను ఇన్‌స్టాకు ఎంత ఎడిక్ట్ అయ్యాడో చెప్పుకున్నాడు ప్రముఖ స్టాండప్ కమేడియన్ రాజశేఖర్ మామిడాల ఒక స్టాండప్ కామెడీ షోలో. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మార్కెట్ ఎంత బలమైందో! లాభాల గిఫ్ట్స్.. అందమైన రేపర్లో చుట్టిన కానుక ఏంటో అని కుతూహలం కలగనివారుంటారా? అలాంటి ఆసక్తికరమైన గిఫ్ట్స్ కస్టమైజ్ సౌకర్యంతో సోషల్ మీడియా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నోములు – వ్రతాలు, పండగపబ్బాలకు ఇచ్చే ఆకు, వక్క తాంబూలం, వాయనాల నుంచి బర్త్‌డేలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, గెట్ టుగెదర్ పార్టీలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వరకు అన్ని రకాల కానుకలను ఆర్డర్ ఇచ్చిన వాళ్ల అభిరుచి.. ఆయా పార్టీల థీమ్‌కి తగ్గట్టుగా తయారు చేసి హోమ్ డెలివరీ చేస్తున్నారు వయా సోషల్ మీడియా మార్కెట్! ఈ గిఫ్ట్స్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటున్నాయి. అందుకే ఈ వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది. మూడు పువ్వులు .. ఆరు అగరుబత్తులు ఇప్పుడు పువ్వుల కోసమూ బయట మార్కెట్‌కి వెళ్లక్కర్లేదు. అవీ సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ పువ్వులు కాదండీ.. ప్రాణమున్న సుమాలే! ఇందులో ఎక్కువగా మల్లెలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామరపువ్వులు లభిస్తున్నాయి. పండగలు, నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్ష¯Œ ్స వంటి ప్రత్యేక సందర్భాల అలంకరణకు అవసరమయ్యే ప్రత్యేక పువ్వులూ దొరుకుతున్నాయి. ఇలా తాజా పువ్వులతో ఈ బిజినెస్ నడుస్తూంటే .. ఫంక్షన్స్ అయిపోయాక ఆ వాడిపోయిన పువ్వులతో మరో బిజినెస్ అంతే లాభాలతో సాగుతోంది. ఆ వాడిపోయిన పూలను చెత్తలోనో.. నీటిలోనో పడేయకుండా వాటిని సేకరించి ఎండబెట్టి.. అగరుబత్తులు, ధూప్ స్టిక్స్ తయారుచేసి అదే సోషల్ మీడియా మార్కెట్లో అమ్ముతున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. ఇటు తాజా.. అటు వాడిన పూల వ్యాపారం కోట్లలో సాగుతోందట. పాత జ్ఞాపకాలతో కొత్త వస్తువులు చాలామందికి కొన్ని వస్తువులతో ప్రత్యేకమైన ప్రేమానుబంధాలు ఉంటాయి. అలాంటి జ్ఞాపకాల నేతను అల్లుకున్న పాత దుస్తులను పంపిస్తే.. వాటితో అందమైన బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు సోషల్ మీడియా మార్కెట్లో. పాత దుస్తులను రీసైక్లింగ్ ద్వారా కొత్త వస్తువులుగా మలచడం కొంత మందికి ఆసక్తి.. అభిరుచి కూడా. దాన్నే వాళ్లిప్పుడు సోషల్ మీడియా మార్కెట్ ద్వారా ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సంచులు, బ్యాగులు, పౌచులు.. తయారుచేసి సోషల్ మీడియా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ వేస్ట్.. వేస్ట్ బాటిల్స్, విరిగిపోయిన వాటర్ పైప్స్, పనికిరాని టైర్స్, డామేజ్ మగ్గులు, పగులు ఏర్పడ్డ కుండలు, నూనె డబ్బాలు, చెడిపోయిన సీడీలు వంటివన్నీ చేరేది డస్ట్ బిన్లోకే. కానీ ఆ చెత్త నుంచి కొంతమంది అద్భుతాలు సృష్టిస్తున్నారు. గృహాలంకరణ వస్తువులతోపాటు కూరగాయల సాగూ చేస్తూ ఆ వ్యర్థాలకు కొత్త అర్థమిస్తున్నారు. టైంపాస్‌గా మొదలైన ఈ ఇంట్రెస్టింగ్ హాబీని సోషల్ మీడియా మార్కెట్ ద్వారా ఓ కెరీర్‌గా మలచుకుంటున్నారు. ఇంట్లో పెట్టుకునే ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్ మేడ్ కార్డ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూలరీ దాకా వివిధ రకాల వస్తువులను తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సాయం.. ఆధునిక సాంకేతికతను అందుకోవడంలో వ్యాపారం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆ క్రమంలోనే అమెజాన్ వంటివి ఆన్లైన్ మార్కెట్‌కి గొడుగుపట్టాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్ వాటి కిందకు చేరాయి. ఆన్లైన్ మార్కెట్‌ను అనివార్యం చేసిన కోవిడే సోషల్ మీడియా మార్కెట్‌కూ దారిని చూపించింది. డిమాండ్ పెరుగుతున్న ఈ మార్కెట్‌కి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పబ్లిసిటీ కల్పిస్తున్నాయి. ఉదాహరణ.. షార్క్ ట్యాంక్ ఇండియా అనే హిందీ షో. బిజినెస్ అనేది బ్రహ్మపదార్థం కాదు.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకోగలిగినంత కామన్ థింగ్ అని చూపించింది.. సగటు మనిషీ బిజినెస్ కలను కనేలాచేసింది ఆ షో. దేశం నలుమూలల నుంచి చిన్న చిన్న వ్యాపారులను ఆహ్వానించి.. వారి ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ స్టోరీలను చెప్పించింది. ఔత్సాహిక వ్యాపారుల్లో స్ఫూర్తి నింపింది. క్రైమ్ సిరీస్‌ను చూసినట్టుగా షార్క్ ట్యాంక్ ఇండియాను కూడా బింజ్ వాచ్ చేశారట. దాన్నిబట్టే చెప్పొచ్చు సోషల్ మీడియా మార్కెట్‌కున్న క్రేజ్.. డిమాండ్ ఎట్సెట్రా ఎలాంటిదో! షార్క్ ట్యాంక్ ఇండియాలాగే ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ఓ షో నడుస్తోంది ‘సూపర్ విమెన్’ పేరుతో. సోషల్ మీడియాలోని ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఇటీవల ‘అమెజాన్ ఇండియా స్మాల్ బిజినెస్ డేస్’ అనే సేల్‌ని పెట్టింది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా వాళ్లు వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తూ. లక్షలాది చిన్న వ్యాపారులు, 1,000కి పైగా స్టార్టప్ కంపెనీలు, 6.8 లక్షల మంది మహిళా వ్యాపారులు, 12 లక్షల పైచిలుకు చేతివృత్తులవారు, చేనేత కళాకారులు, 50,000 దాకా స్థానిక దుకాణదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని అమెజాన్ తెలిపింది. ఇలా ఏడాదికి రెండుసార్లు సోషల్ మీడియా వ్యాపారులకు తన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే వీలు కల్పిస్తోంది. ఇదే తరహాలో మరికొన్ని ఈ కామర్స్ సంస్థలూ సోషల్ మీడియా వ్యాపారులకు తమ చేయూతను అందించనున్నాయట. వీళ్లంతా.. దేశంలో మొత్తం 229 మిలియన్ల జనం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అలాగే మన దగ్గర 467 మిలియన్లకు పైగా జనం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదీ ప్రపంచంలో అత్యధికమే. మన దగ్గర ఎక్స్ (మాజీ ట్విటర్) యూజర్స్ సంఖ్య 27. 25 మిలియన్లకు పైమాటే. దీంట్లోనూ మనమే ముందున్నాం. ఇలా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్స్‌ని ఉపయోగిస్తున్న యూజర్స్ అందరూ కూడా ఏదోరకంగా సోషల్ మీడియా బిజినెస్‌ను ప్రభావితం చేస్తున్నవారే. ఈ సంఖ్య పెరిగే అవకాశమే ఉంటుంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు వర్చువల్ మార్కెట్‌కు ఉన్న స్కోప్‌ని. అయితే మోస్తరు పట్టణాల్లో ఇంకా సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాపారం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావాన్ని వాళ్లు అంతగా పట్టించుకోవట్లేదు. కాని వర్చువల్ మార్కెట్ స్కోప్‌ని గ్రహించి వీలైనంత త్వరగా తమ వాళ్లూ తమ వ్యాపార వృద్ధికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకోవాలని అభిప్రాయపడుతోంది ఆ సంప్రదాయ వ్యాపారకుటుంబాల్లోని నేటి తరం. భోజనం తయారు ‘సముద్రం ఒడ్డున చింతపండు దొరకదు.. అడవిలో ఉప్పు దొరకదు. ఈ రెండింటినీ కలిపి పట్టణాల్లో పచ్చడిగా అమ్మితే పచ్చనోట్ల పంట పండుతుంది’ అని పచ్చళ్ల వ్యాపారానికి కిటుకు కనిపెట్టారు వ్యాపారులు. నగరాల్లో ఇప్పుడున్న కర్రీ పాయింట్స్కీ ఆ కిటుకే ప్రేరణ. సోషల్ మీడియాలోని ఈ భోజనం తయారీ బిజినెస్‌కి కూడా! దాని పేరే ‘హోమ్ షెఫ్స్’. చదువులు, కొలువుల కోసం కుటుంబాలను వదిలి సిటీస్‌కి వచ్చిన వారిని చవులూరిస్తోంది. వండి పంపిస్తున్న వారి వాలెట్ నింపుతోంది. రుచికి.. శుచికి అమ్మ చేతి వంటను మరపిస్తోంది. ధరనూ అందుబాటులోనే ఉంచుతోంది సోషల్ మీడియాలో ఈ సరికొత్త హోటల్ వ్యాపారం. పండగలప్పుడు పిండి వంటలు, స్వీట్స్ సహా ఉగాది పచ్చడినీ చేయించుకుని మరీ ఆరగించవచ్చు. ఇప్పుడు జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సర్వీసెస్ కూడా సోషల్ మీడియాలోని హోమ్ షెఫ్స్‌తో అనుసంధానం అవుతున్నాయి. ఆర్డర్ అందిన వెంటనే వేడి వేడి మీల్స్ తయారు చేసి ఉంచితే.. ఈ ఫుడ్ డెలివరీ పార్టనర్స్ డెలివరీ చేస్తాయి. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనుందట. వంటను ఆర్ట్‌గా భావించే చాలామంది కుకింగ్ లవర్స్‌ని ఆంట్రప్రెన్యూర్స్‌గా మార్చనుందీ కాన్సెప్ట్ అంటున్నారు సోషల్ మీడియా మార్కెట్ నిపుణులు. మేకప్ .. ఫ్యాషన్.. అలంకరణ అంటే ఆసక్తి చూపని అమ్మాయిలు అరుదు. ఆ మెజారిటీనే తమ ఆదాయానికి వనరుగా మార్చుకుంటున్నారు కొందరు .. మేకప్ వేసుకునే విధానాన్ని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ! ఇంకొంత మంది ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఎర్నింగ్ సోర్స్‌గా మలచుకుంటున్నారు. ఫ్యాషన్ అంటే ఉన్న ఇంట్రెస్ట్‌తో తమ సృజనకు పదును పెట్టి కాజువల్ వేర్ నుంచి వెడ్డింగ్ వేర్ వరకు డ్రెసెస్‌ను డిజైన్ చేసి సోషల్ మీడియా అకౌంట్లో ఇట్టే డెమో ఇచ్చి.. అట్టే బ్యాంక్ అకౌంట్లో డబ్బును జమ చేసుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా మంచి ఫ్యాషన్ డిజైనర్ అయిపోయి.. అదే సోషల్ మీడియా మార్కెట్ ద్వారా ఆంట్రప్రెన్యూర్‌గానూ అంతే సక్సెస్‌ను సాధిస్తున్నారు. స్థానికంగానే కాదు దేశీయ,అంతర్జాతీయ ఆర్డర్లనూ అందుకుంటూ అదే స్థాయిలో పాపులర్ అవుతున్నారు. ఇదే బాటలో జ్యూలరీ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ కూడా సాగుతోంది. 77 శాతం మంది చిన్న వ్యాపారులు తమ వినియోగదారులతో కనెక్ట్ అవడానికి సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారట. 2025 నాటికి ఈ డైరెక్ట్ టు కస్టమర్ మార్కెట్ వంద బిలియన్ డాలర్లకు చేరనుందని మార్కెట్ పరిశోధన నివేదికలు చెబుతున్నాయి. :::దీపిక కొండి -
ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..
ఆధునిక భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న సమయంలో కేవలం ఉద్యోగం చేసి మాత్రమే డబ్బు సంపాదించాలంటే కొంత అసాధ్యమైన పనే. అయితే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు వ్యవసాయం ద్వారా కూడా అధిక లాభాలను పొందుతున్నారు. మనం ఈ కథనంలో 'శ్రీగంధం' (Sandalwood) ద్వారా ఎలా సంపాదించవచ్చు? వీటి పెంపకానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా? అనేవి వివరంగా తెలుసుకుందాం. సౌందర్య లేపనాలు, క్రీములు వంటి వాటి తయారీలో చందనం ఎక్కువగా వినియోగిస్తారు. కావున చందనం (శ్రీగంధం) చెట్లు పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ చెట్లను రెండు ప్రాథమిక పద్ధతుల ద్వారా పెంచవచ్చు. ఒకటి సేంద్రీయ వ్యవసాయం, మరొకటి సాంప్రదాయ పద్ధతి. సేంద్రీయ విధానం ద్వారా సాగు చేస్తే 10 నుంచి 15 సంవత్సరాలలో చెట్లు పక్వానికి వస్తాయి. అయితే సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తే 20 నుంచి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ చెట్ల పెంపకం సమయంలో కనీస రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! చెట్టు పక్వానికి వస్తుందనే సమయంలో సువాసనలు వెదజల్లడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కొన్ని జంతువులు భారీ నుంచి మాత్రమే కాకుండా స్మగ్లర్ల భారీ నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి దాదాపు సమశీతోష్ణ పరిసరాల్లో ఏపుగా పెరుగుతాయి. ఒక చందనం చెట్టు ద్వారా రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన 10 చెట్లను పెంచితే రూ. 50 లక్షలు, 100 చెట్లు సాగు చేస్తే రూ. 5 కోట్లు వరకు ఆర్జించవచ్చు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రభుత్వ నిబంధనలు: శ్రీగంధం మొక్కలు పెంచాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ తెలుసుకుని ఉండాలి. ఇందులో ప్రధానంగా 2017లో ఇండియన్ గవర్నమెంట్ గంధపు చెక్కలను ప్రైవేట్‌గా కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నిషేధించింది. కావున చట్టం పరిధిలో చెట్లను పెంచవచ్చు, కానీ వాటిని ప్రభుత్వానికి విక్రయించాలి. అంతే కాకుండా వీటి పెంపకం ప్రారంభం సమయంలోనే అటవీ శాఖ అధికారులను తెలియజేయాలి. వారు వీటిని ఎప్పటికప్పుడు నావిగేట్ చేస్తూ ఉంటారు. (Disclaimer: ఎక్కువ లాభాలు వస్తాయని శ్రీగంధం చెట్ల పెంపకం చేయాలనే వారు ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సంబంధిత ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటివన్నీ బేరీజు వేసుకోవాలి.) -
వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు!
ఆధునిక కాలంలో జాబ్ చేసేవారికంటే ఏదో ఒక బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేవారు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితే మంచి లాభాలు పొందాలనుకునేవారికి ఎండిపోయిన లేదా వాడిపోయిన పూలను ఉపయోగించి బిజినెస్ చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి బిజినెస్ అంటేనే.. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ వాడిపోయిన పూలతో అనగానే కొంత అనుమానం రావొచ్చు. కానీ ఎండిపోయిన పూలతో అగరుబత్తీలు వంటివి తయారు చేసి బాగా సంపాదించవచ్చు. ఇది ఒకరకమైన రీసైక్లింగ్ బిజినెస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పువ్వులు మనిషి నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రతి రోజు గుడికెళ్లాలన్నా, స్త్రీలు అలంకరించుకోవాలన్నా పూలు అవసరం. అయితే దేవాలయాల్లో ఎక్కువ పువ్వులు వినియోగిస్తారు. వీటిని ఒకటి రెండు రోజుల్లో తీసి బయట పడేస్తుంటారు. అలాంటి వాటిని ఉపయోగించి సువాసనలు వెదజల్లె అగరుబత్తీలు తయారు చేయవచ్చు. వాడిపోయిన పూలు.. వాడిపోయిన పూలను వృధాగా చెత్తలో పడేసినా లేదా నీటిలో పడేసినా ఎక్కువ కలుషితం అవుతుంది. కావున అలా వృధాగా పోనీయకుండా వాటిని ఎండబెట్టి, సువాసనల కోసం కొన్ని రసాయనాలు చల్లి అగరుబత్తీలు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! నిర్మాలయ సంస్థ.. వాడిపోయిన పూలను ఉపయోగించి భరత్ బన్సాల్ అనే వ్యక్తి సుర్భి అండ్ రాజీవ్‌లతో కలిసి నిర్మాలయ సంస్థను స్థాపించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీరు కేవలం అగరుబత్తీలు మాత్రమే కాకుండా దూపం ఉత్పత్తులను తయారు చేసి దేశం మొత్తం విక్రయిస్తున్నారు. గత ఏడాది వీరు సంవత్సరానికి రూ. 2.6 కోట్లు ఆదాయం పొందారు. 2024 నాటికి రూ. 20 కోట్ల వార్షిక ఆదాయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇదీ చదవండి: పెరుగు అమ్ముతూ లక్షలు గడిస్తున్న బీహార్ వ్యక్తి - ఎలాగో తెలిస్తే.. మన దేశంలో ఇప్పటికే కొంత మంది కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు వంటివి రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు. మనిషి అనుకోవాలే గానీ ఏదైనా చేయగలడు, ఏదైనా సాదించగలరని ఇప్పటికే చాలామంది రుజువు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nirmalaya (@nirmalaya) -
ఇది లాభాల పంట! ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి..
ప్రస్తుతం పంటల సాగు లాభదాయకమైన వ్యాపార మార్గంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్న పంటలు సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. మీకూ ఇలాంటి వ్యాపార ఆలోచన (Business Idea) ఉంటే లెమన్ గ్రాస్ ఫార్మింగ్ (Lemon grass farming) చేయొచ్చు. లెమన్ గ్రాస్ (నిమ్మ గడ్డి) సాగును ఇప్పటికే చాలా చోట్ల చేపడుతూ మంచి లాభాలు గడిస్తున్నారు. కొన్ని చోట్ల దీన్ని మహిళా గ్రూప్‌లు, పొదుపు సంఘాల సభ్యులు ఉమ్మడిగా సాగుచేస్తున్నారు. ఈ ఆలోచనను ప్రధాని మోదీ కూడా గుర్తించడం మరింత ఆసక్తికర అంశం. 2020లో ప్రధాని మోదీ నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగం సందర్భంగా నిమ్మగడ్డి సాగును ప్రశంసించారు. నిమ్మగడ్డి కేవలం నాలుగు నెలల్లోనే పెరుగుతుంది. దీని నూనెకు మార్కెట్లో అత్యంత గిరాకీ ఉంటుంది. అందుకే మంచి ధర లభిస్తోంది. సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, మందులతో సహా వివిధ పరిశ్రమలలో లెమన్ గ్రాస్ నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వర్గానికి చెందినది. పలు రకాల చికిత్సల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్‌కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇది శుష్క ప్రాంతాలలోనూ పెరుగుతుంది. ఇది కరువు ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. సహజంగానే స్థితిస్థాపకంగా ఉండే ఈ పంటకు ఎరువులు కూడా అవసరం లేదు. రూ. 20,000 కంటే తక్కువ పెట్టుబడితోనే హెక్టారుకు ఏటా రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. పంట ప్రారంభించిన తర్వాత, వరుసగా ఐదారు సంవత్సరాల పాటు స్థిరమైన దిగుబడి లభిస్తుంది. అయితే లెమన్‌గ్రాస్ సాగుకు సమయం చాలా కీలకం. ఫిబ్రవరి నుంచి జులై నెలల మధ్య కాలం ఈ పంట సాగుకు అనువుగా ఉంటుంది. మొక్కల నర్సరీ బెడ్స్ సిద్ధం చేయడానికి సరైన సమయం మార్చి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలం. ఈ పంటను ఒకసారి నాటితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు పంటలు ఆశించవచ్చు. అంటే దాని విలువైన నూనెను అధిక మొత్తంలో తీసి విక్రయించి లాభాలు పొందవచ్చు. మీడియాలో వచ్చిన పలు నివేదికల ప్రకారం. హెక్టారుకు సంవత్సరానికి 3 నుంచి 5 లీటర్ల లెమన్‌గ్రాస్ నూనెను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్లో ఒక్కో లీటరు లెమన్ గ్రాస్ ఆయిల్ ధర రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాలలో దాని ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. (Disclaimer: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమేనని గమనించగలరు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ అవగాహన, ఇతర వివరాలను పరిశీలించడం అవసరం.) -
పెరుగు అమ్ముతూ లక్షలు గడిస్తున్న బీహార్ వ్యక్తి - ఎలాగో తెలిస్తే..
మనిషి జీవితంలో పెరుగు అనేది ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగమైపోయింది. దాదాపు పెరుగంటే ఇష్టం లేని వారు ఉండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది పెరుగును తెగ ఇష్టపడిపోతుంటారు. బీహార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పెరుగు అమ్ముతూ రూ. 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఇప్పుడు ప్యాకెట్లలో లభించే పెరుగుని ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా బీహార్‌లోని ఖగారియాకు చెందిన 'చంద్రభూషణ్ కుమార్' అనే వ్యక్తి 'మట్కా' పెరుగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. 2018 ప్రారంభించిన ఈయన వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలతో తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. 'గావ్ సే' బ్రాండ్‌ను స్థాపించడానికి తన గ్రామం నుండి వలస వచ్చిన కార్మికులతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత ఇది మంచి ప్రజాదరణ పొందగలిగింది. ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా.. నిజానికి మట్కా పెరుగు ప్రత్యేకత ఏమిటంటే.. కుండను కిందికి బోర్లించినప్పటికీ పెరుగు కిందపడదు. అలాగే కుండకు అతుక్కుని ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ పెరుగు నాణ్యత ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మార్కెట్లోని ఇతర బ్రాండెడ్ పెరుగులకంటే కూడా ఈ మట్కా పెరుగుకి డిమాండ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ పెరుగు బీహార్ సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారిస్తోంది. -
ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
Blueberry Farming: రోజులు మారుతున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలనే విధానానికి నేటి యువత చెక్ పెడుతున్నారు. వ్యవసాయం మీద ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగాలు వదిలి మళ్ళీ మన దేశానికే వస్తున్నారు. ఆధునిక పద్దతులతో, శాస్త్రీయమైన విధానంతో పంటలు పండించి లాభాలను పొందుతున్నారు. ఈ కథనంలో మనం 'బ్లూబెర్రీ' (Blueberry) సాగుతో మంచి ఆదాయం ఎలా పొందాలనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒకప్పటి నుంచి పండిస్తున్న వరి, రాగి వంటివి మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు వంటివి కూడా టెక్నాలజీ ఉపయోగించి పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే డ్రాగెన్ వంటి విదేశీ పంటల విషయంలో కూడా నేర్పు ప్రదర్శిస్తున్నారు. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికన్ బ్లూబెర్రీ సాగుచేస్తున్నారు. అనేక పోషక విలువలు కలిగిన బ్లూబెర్రీని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికన్ సూపర్ ఫుడ్‌గా భావించే ఈ బెర్రీస్ ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ పొందుతున్నాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి చాలా తక్కువ, కావున అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. 10 సంవత్సరాల పాటు పండ్లు.. ప్రస్తుతం మన దేశంలో పండుతున్న విదేశీ పంటల్లో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీని సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. బెర్రీస్ సాగులో ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటంటే.. దీనిని ఒకసారి నాటితే సుమారు 10 సంవత్సరాల పాటు పండ్లు వస్తూనే ఉంటాయి. బెర్రీస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. అనేక విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండ్లకు గిరాకీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుని పండిస్తే తప్పకుండా ఆశించిన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు అనువైన కాలం ఏప్రిల్, మే నెలలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు 10 నెలలకే ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడతాయి. కావున ఫిబ్రవరి & మార్చి సమయంలో కోతకు వస్తాయి. జూన్ నెల వరకు దిగుబడి వస్తుంది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు.. దిగుబడి అయిన తరువాత మొక్కలను కొంత కత్తిరించినట్లయితే.. మళ్ళీ చిగురిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి మరింత ఎక్కువవుతుంది. ఎకరం భూమిలో సుమారు 3000 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టు సుమారు 2 కేజీల వరకు పండ్లు అందిస్తుంది. కేజీ రూ. 1000 విక్రయిస్తే సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పంట పండించాలనుకునే వారు అవగాహన ఉన్న వ్యక్తులను లేదా ఇప్పటికే పంట పండిస్తున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.