ఆధునిక కాలంలో జాబ్ చేసేవారికంటే ఏదో ఒక బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేవారు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితే మంచి లాభాలు పొందాలనుకునేవారికి ఎండిపోయిన లేదా వాడిపోయిన పూలను ఉపయోగించి బిజినెస్ చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి బిజినెస్ అంటేనే.. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ వాడిపోయిన పూలతో అనగానే కొంత అనుమానం రావొచ్చు. కానీ ఎండిపోయిన పూలతో అగరుబత్తీలు వంటివి తయారు చేసి బాగా సంపాదించవచ్చు. ఇది ఒకరకమైన రీసైక్లింగ్ బిజినెస్ అనే చెప్పాలి.
ప్రస్తుతం పువ్వులు మనిషి నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రతి రోజు గుడికెళ్లాలన్నా, స్త్రీలు అలంకరించుకోవాలన్నా పూలు అవసరం. అయితే దేవాలయాల్లో ఎక్కువ పువ్వులు వినియోగిస్తారు. వీటిని ఒకటి రెండు రోజుల్లో తీసి బయట పడేస్తుంటారు. అలాంటి వాటిని ఉపయోగించి సువాసనలు వెదజల్లె అగరుబత్తీలు తయారు చేయవచ్చు.
వాడిపోయిన పూలు..
వాడిపోయిన పూలను వృధాగా చెత్తలో పడేసినా లేదా నీటిలో పడేసినా ఎక్కువ కలుషితం అవుతుంది. కావున అలా వృధాగా పోనీయకుండా వాటిని ఎండబెట్టి, సువాసనల కోసం కొన్ని రసాయనాలు చల్లి అగరుబత్తీలు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
నిర్మాలయ సంస్థ..
వాడిపోయిన పూలను ఉపయోగించి భరత్ బన్సాల్ అనే వ్యక్తి సుర్భి అండ్ రాజీవ్‌లతో కలిసి నిర్మాలయ సంస్థను స్థాపించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీరు కేవలం అగరుబత్తీలు మాత్రమే కాకుండా దూపం ఉత్పత్తులను తయారు చేసి దేశం మొత్తం విక్రయిస్తున్నారు. గత ఏడాది వీరు సంవత్సరానికి రూ. 2.6 కోట్లు ఆదాయం పొందారు. 2024 నాటికి రూ. 20 కోట్ల వార్షిక ఆదాయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.
ఇదీ చదవండి: పెరుగు అమ్ముతూ లక్షలు గడిస్తున్న బీహార్ వ్యక్తి - ఎలాగో తెలిస్తే..
మన దేశంలో ఇప్పటికే కొంత మంది కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు వంటివి రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు. మనిషి అనుకోవాలే గానీ ఏదైనా చేయగలడు, ఏదైనా సాదించగలరని ఇప్పటికే చాలామంది రుజువు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment