మనిషి జీవితంలో పెరుగు అనేది ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగమైపోయింది. దాదాపు పెరుగంటే ఇష్టం లేని వారు ఉండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది పెరుగును తెగ ఇష్టపడిపోతుంటారు. బీహార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పెరుగు అమ్ముతూ రూ. 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి ఇప్పుడు ప్యాకెట్లలో లభించే పెరుగుని ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా బీహార్‌లోని ఖగారియాకు చెందిన 'చంద్రభూషణ్ కుమార్' అనే వ్యక్తి 'మట్కా' పెరుగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. 2018 ప్రారంభించిన ఈయన వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది.
కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలతో తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. 'గావ్ సే' బ్రాండ్‌ను స్థాపించడానికి తన గ్రామం నుండి వలస వచ్చిన కార్మికులతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత ఇది మంచి ప్రజాదరణ పొందగలిగింది.
ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..
నిజానికి మట్కా పెరుగు ప్రత్యేకత ఏమిటంటే.. కుండను కిందికి బోర్లించినప్పటికీ పెరుగు కిందపడదు. అలాగే కుండకు అతుక్కుని ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ పెరుగు నాణ్యత ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మార్కెట్లోని ఇతర బ్రాండెడ్ పెరుగులకంటే కూడా ఈ మట్కా పెరుగుకి డిమాండ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ పెరుగు బీహార్ సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment