దేశంలో టీ దుకాణాలకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ కొత్తగా టీ దుకాణం ఏర్పాటైనా అది విజయవంతం అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. తాజాగా బీహార్‌లో వినూత్న టీ దుకాణం ఏర్పాటయ్యింది. దాని పేరు వినగానే ఎవరికైనా వింతగా అనిపిస్తుంది.
మాధేపురాలోని సింగేశ్వర్‌కు చెందిన రోహిత్ ‘అన్‌పఢ్ చాయ్‌వాలా’ (చదువురాని చాయ్‌వాలా) పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఐదు రకాల టీలు లభిస్తాయి. అయితే ఇక్కడ టీ బాగోలేదని ఎవరైనా వినియోగదారుడు అంటే రోహిత్ వారికి డబ్బు వాపసు చేస్తాడు. విద్యార్థులకు టీపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తుంటాడు. రోహిత్ తన దుకాణంలో టీని రూ. 10కే అందిస్తున్నాడు.
మొదట్లో తన దుకాణం పేరు బాగోలేదని చాలామంది అన్నారని, అయితే ఆ పేరు అలాగే ఉంచాలని అనుకున్నానని రోహత్ తెలిపాడు. తాను ఎటువంటి డిగ్రీ చదవలేదని, పెద్దగా ఏమీ చదువుకోలేదని అందుకే అన్‌పఢ్ చాయ్‌వాలా అని దుకాణానికి పేరు పెట్టానని రోహిత్ వివరించాడు. ఇప్పుడు తన టీ దుకాణం పేరు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోందని, తాను ప్రతిరోజూ 400 నుండి 500 కప్పుల టీ విక్రయిస్తున్నానని రోహిత్ తెలిపాడు.
విద్యార్థులకు 10శాతం తగ్గింపు ధరకే టీ ఇస్తున్నానని, దీనివలన చదువుకుంటున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని రోహిత్ తెలిపాడు. యూట్యూబ్‌లో పలు టీ దుకాణాల వీడియోలను చూశాక, తాను ‘అన్‌పఢ్ చాయ్‌వాలా’ పేరుతో సొంత స్టార్టప్‌ను ప్రారంభించానని అన్నాడు. తాను వినియోగారులకు మసాలా టీ, ప్లెయిన్ టీ, స్పెషల్ టీ, అల్లం టీ, కాఫీ టీ అందిస్తున్నానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment