Business Ideas: Blueberry Farmers Get Rs 60 Lakh for Year | Blue Berry Farming Latest News, - Sakshi
Sakshi News home page

Business Idea: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు!

Published Tue, Aug 8 2023 3:01 PM | Last Updated on Tue, Aug 8 2023 3:27 PM

Business Ideas blueberry farmers get rs 60 lakh for year - Sakshi

Blueberry Farming: రోజులు మారుతున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలనే విధానానికి నేటి యువత చెక్ పెడుతున్నారు. వ్యవసాయం మీద ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగాలు వదిలి మళ్ళీ మన దేశానికే వస్తున్నారు. ఆధునిక పద్దతులతో, శాస్త్రీయమైన విధానంతో పంటలు పండించి లాభాలను పొందుతున్నారు. ఈ కథనంలో మనం 'బ్లూబెర్రీ' (Blueberry) సాగుతో మంచి ఆదాయం ఎలా పొందాలనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

ఒకప్పటి నుంచి పండిస్తున్న వరి, రాగి వంటివి మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు వంటివి కూడా టెక్నాలజీ ఉపయోగించి పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే డ్రాగెన్ వంటి విదేశీ పంటల విషయంలో కూడా నేర్పు ప్రదర్శిస్తున్నారు. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికన్ బ్లూబెర్రీ సాగుచేస్తున్నారు.

అనేక పోషక విలువలు కలిగిన బ్లూబెర్రీని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికన్ సూపర్ ఫుడ్‌గా భావించే ఈ బెర్రీస్ ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ పొందుతున్నాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి చాలా తక్కువ, కావున అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది.

10 సంవత్సరాల పాటు పండ్లు..
ప్రస్తుతం మన దేశంలో పండుతున్న విదేశీ పంటల్లో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీని సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. బెర్రీస్ సాగులో ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటంటే.. దీనిని ఒకసారి నాటితే సుమారు 10 సంవత్సరాల పాటు పండ్లు వస్తూనే ఉంటాయి. బెర్రీస్‌లో అనేక రకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా..

అనేక విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండ్లకు గిరాకీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుని పండిస్తే తప్పకుండా ఆశించిన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు అనువైన కాలం ఏప్రిల్, మే నెలలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు 10 నెలలకే ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడతాయి. కావున ఫిబ్రవరి & మార్చి సమయంలో కోతకు వస్తాయి. జూన్ నెల వరకు దిగుబడి వస్తుంది.

ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..

సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు..
దిగుబడి అయిన తరువాత మొక్కలను కొంత కత్తిరించినట్లయితే.. మళ్ళీ చిగురిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి మరింత ఎక్కువవుతుంది. ఎకరం భూమిలో సుమారు 3000 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టు సుమారు 2 కేజీల వరకు పండ్లు అందిస్తుంది. కేజీ రూ. 1000 విక్రయిస్తే సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పంట పండించాలనుకునే వారు అవగాహన ఉన్న వ్యక్తులను లేదా ఇప్పటికే పంట పండిస్తున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement