ideas
-
స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ
ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్‌గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు కావు. అవి చాక్లెట్స్.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్‌ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు. దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.కాస్త భిన్నంగా ఉండాలని.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్ పేరుతో చిన్నపాటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది. -
ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..!
ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేయాలి. ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్‌తో గది కార్నర్‌ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది. నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్‌ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్‌ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. (చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!) -
ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..
ఆధునిక భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న సమయంలో కేవలం ఉద్యోగం చేసి మాత్రమే డబ్బు సంపాదించాలంటే కొంత అసాధ్యమైన పనే. అయితే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు వ్యవసాయం ద్వారా కూడా అధిక లాభాలను పొందుతున్నారు. మనం ఈ కథనంలో 'శ్రీగంధం' (Sandalwood) ద్వారా ఎలా సంపాదించవచ్చు? వీటి పెంపకానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా? అనేవి వివరంగా తెలుసుకుందాం. సౌందర్య లేపనాలు, క్రీములు వంటి వాటి తయారీలో చందనం ఎక్కువగా వినియోగిస్తారు. కావున చందనం (శ్రీగంధం) చెట్లు పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ చెట్లను రెండు ప్రాథమిక పద్ధతుల ద్వారా పెంచవచ్చు. ఒకటి సేంద్రీయ వ్యవసాయం, మరొకటి సాంప్రదాయ పద్ధతి. సేంద్రీయ విధానం ద్వారా సాగు చేస్తే 10 నుంచి 15 సంవత్సరాలలో చెట్లు పక్వానికి వస్తాయి. అయితే సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తే 20 నుంచి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ చెట్ల పెంపకం సమయంలో కనీస రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! చెట్టు పక్వానికి వస్తుందనే సమయంలో సువాసనలు వెదజల్లడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కొన్ని జంతువులు భారీ నుంచి మాత్రమే కాకుండా స్మగ్లర్ల భారీ నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి దాదాపు సమశీతోష్ణ పరిసరాల్లో ఏపుగా పెరుగుతాయి. ఒక చందనం చెట్టు ద్వారా రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన 10 చెట్లను పెంచితే రూ. 50 లక్షలు, 100 చెట్లు సాగు చేస్తే రూ. 5 కోట్లు వరకు ఆర్జించవచ్చు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రభుత్వ నిబంధనలు: శ్రీగంధం మొక్కలు పెంచాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ తెలుసుకుని ఉండాలి. ఇందులో ప్రధానంగా 2017లో ఇండియన్ గవర్నమెంట్ గంధపు చెక్కలను ప్రైవేట్‌గా కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నిషేధించింది. కావున చట్టం పరిధిలో చెట్లను పెంచవచ్చు, కానీ వాటిని ప్రభుత్వానికి విక్రయించాలి. అంతే కాకుండా వీటి పెంపకం ప్రారంభం సమయంలోనే అటవీ శాఖ అధికారులను తెలియజేయాలి. వారు వీటిని ఎప్పటికప్పుడు నావిగేట్ చేస్తూ ఉంటారు. (Disclaimer: ఎక్కువ లాభాలు వస్తాయని శ్రీగంధం చెట్ల పెంపకం చేయాలనే వారు ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సంబంధిత ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటివన్నీ బేరీజు వేసుకోవాలి.) -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
Blueberry Farming: రోజులు మారుతున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలనే విధానానికి నేటి యువత చెక్ పెడుతున్నారు. వ్యవసాయం మీద ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగాలు వదిలి మళ్ళీ మన దేశానికే వస్తున్నారు. ఆధునిక పద్దతులతో, శాస్త్రీయమైన విధానంతో పంటలు పండించి లాభాలను పొందుతున్నారు. ఈ కథనంలో మనం 'బ్లూబెర్రీ' (Blueberry) సాగుతో మంచి ఆదాయం ఎలా పొందాలనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒకప్పటి నుంచి పండిస్తున్న వరి, రాగి వంటివి మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు వంటివి కూడా టెక్నాలజీ ఉపయోగించి పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే డ్రాగెన్ వంటి విదేశీ పంటల విషయంలో కూడా నేర్పు ప్రదర్శిస్తున్నారు. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికన్ బ్లూబెర్రీ సాగుచేస్తున్నారు. అనేక పోషక విలువలు కలిగిన బ్లూబెర్రీని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికన్ సూపర్ ఫుడ్‌గా భావించే ఈ బెర్రీస్ ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ పొందుతున్నాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి చాలా తక్కువ, కావున అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. 10 సంవత్సరాల పాటు పండ్లు.. ప్రస్తుతం మన దేశంలో పండుతున్న విదేశీ పంటల్లో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీని సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. బెర్రీస్ సాగులో ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటంటే.. దీనిని ఒకసారి నాటితే సుమారు 10 సంవత్సరాల పాటు పండ్లు వస్తూనే ఉంటాయి. బెర్రీస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. అనేక విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండ్లకు గిరాకీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుని పండిస్తే తప్పకుండా ఆశించిన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు అనువైన కాలం ఏప్రిల్, మే నెలలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు 10 నెలలకే ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడతాయి. కావున ఫిబ్రవరి & మార్చి సమయంలో కోతకు వస్తాయి. జూన్ నెల వరకు దిగుబడి వస్తుంది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు.. దిగుబడి అయిన తరువాత మొక్కలను కొంత కత్తిరించినట్లయితే.. మళ్ళీ చిగురిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి మరింత ఎక్కువవుతుంది. ఎకరం భూమిలో సుమారు 3000 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టు సుమారు 2 కేజీల వరకు పండ్లు అందిస్తుంది. కేజీ రూ. 1000 విక్రయిస్తే సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పంట పండించాలనుకునే వారు అవగాహన ఉన్న వ్యక్తులను లేదా ఇప్పటికే పంట పండిస్తున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. -
షార్క్ టైగర్స్
‘నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి. ఫండింగ్ ఉంటే ఎక్కడో ఉండేవాడిని’ అనేది బ్లాక్ అండ్ వైట్ జమాన నాటి మాట. ‘నీ దగ్గర ఐడియా ఉంటే చాలు...దానికి రెక్కలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు’ అనేది నేటి మాట. ‘ఐడియా’ ఉండి ఫండింగ్ అవకాశం లేని స్టార్టప్ కలల యువతరానికి ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లాంటి టీవిప్రోగ్రామ్స్ ఆశాదీపాల్లా మారాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల దావల్ తన సోదరుడు జయేష్‌తో కలిసి స్టార్టప్ కలను సాకారం చేసుకోబోతున్నాడు... దావల్కు కాలేజీ టీ స్టాల్లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం టీ స్టాల్లో పనిచేసే అబ్బాయి ఒక టబ్‌లో అవే నీళ్లలో గ్లాసులను కడగడం. దారిన పోయే మేక ఒకటి వచ్చి ఆ నీళ్లు తాగినా ఆ నీళ్లు అలాగే ఉండడం! టీ స్టాల్ యజమానికి చెప్పినా అతడు పట్టించుకోకపోవడం!! కాలేజీ టీ స్టాల్లోనే కాదు బయట రోడ్డు సైడ్ టీ స్టాల్స్, దాబాలలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు దావల్. ‘ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నాడు గుజరాత్‌లోని బవస్కంత గ్రామానికి చెందిన దావల్. యూట్యూబ్‌లో మెషిన్ డిజైనింగ్ సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఆరు నెలల్లో ఒక అవగాహన వచ్చింది.తండ్రితో కలిసి ఒక హార్డ్‌వేర్ షాప్‌కు వెళ్లి స్క్రాప్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా బతిమిలాడుకున్నాడు. స్క్రాప్ చేతికి వచ్చిన తరువాత ప్రయోగాలుప్రారంభించాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. ‘చేసింది చాలు. ఇక ఆపేయ్. స్క్రాప్ ఇచ్చేదే లేదు’ అన్నాడు హార్డ్‌వేర్ షాప్ యజమాని. దీంతో తనకు తెలిసిన ప్రొఫెసర్‌ను కలిసి విషయం చెప్పాడు. ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈసారి మాత్రం తన ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యి ఆటోమెటిక్ టీ–గ్లాస్ వాషింగ్ మెషిన్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ మెషిన్లోని వాటర్ జెట్‌తో 30 సెకండ్ల వ్యవధిలో 15 టీ గ్లాసులను శుభ్రపరచవచ్చు. దీని సామర్థ్యాన్ని పెంచే కొత్త మెషిన్ కూడా తయారు చేశాడు దావల్. దీని గురించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. కొందరుప్రొఫెసర్లను కలిసి ఈ మెషిన్ గురించి డెమో ఇచ్చాడు. వారికి నచ్చి అభినందించడమే కాదు లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన లక్షతో అయిదు మెషిన్లను తయారుచేసి కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్రలలో అమ్మారు. దావల్ సోదరుడు జయేష్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనేది కల. సోదరులిద్దరు ‘మహంతం’ పేరుతో స్టార్టప్ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా షార్క్‌ట్యాంక్ ఇండియా(సోనీ టీవీ) రియాల్టీ షోలో దావల్, జయేష్లు చెప్పిన స్టార్టప్ ఐడియా నచ్చి అయిదుగురు షార్క్స్(బిగ్–షాట్ ఇన్వెస్టర్స్) డీల్ ఆఫర్ చేయడమే కాదు ‘మీ విజయం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అభినందించారు. ఆ మాటే విజయమంత్రం ‘అపజయం మాత్రమే అంతిమం కాదు’ అనే మాటను ఎన్నోసార్లు విన్నాను. నా ప్రయత్నంలో విఫలమైనప్పుడల్లా ఈ మాటను గుర్తు తెచ్చుకునేవాడిని. మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాడిని. కొందరు నన్ను వింతగా చూసేవారు. కొందరైతే...నీకు నువ్వు సైంటిస్ట్‌లా ఫీలవుతున్నావు అని వెక్కిరించేవాళ్లు. అయితే నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సక్సెస్ కావడమే నా లక్ష్యం అన్నట్లుగా కష్టపడ్డాను. చివరికి ఫలితం దక్కింది. –దావల్ -
Interior: ప్రకృతితో మమేకం.. ప్రతిది నేచురల్‌గా..
ఒత్తిడిగా ఉన్నప్పుడు, ప్రశాంతత కావాలనుకున్నప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న ఆరాటం పెరుగుతుంది. ఇంటి వాతావరణాన్నే అలా మార్చుకుంటే అనే ఆలోచన వస్తుంది. అలా ప్రకృతి ఇంటి అలంకరణలో భాగమై నేచురల్ థీమ్‌గా ఇలా సెటిల్ అయింది. పెద్ద పెద్ద బ్రాండ్లు ప్రకృతిని మరిపించే వస్తువులను తయారుచేయడానికి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మన దేశీ వస్తువులు కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ట్యాగ్‌తో హుందాగా ప్రపంచ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. కళాత్మక వస్తువులు రాజస్థాన్, జైపూర్ కళాకృతులు గ్లోబల్ ట్రెండ్‌గా ఆకట్టుకుంటున్నాయి. వీటి నుంచి కొత్త తరహా డిజైన్లనూ సృష్టిస్తున్నారు. కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, టెర్రకోట వస్తువులు, బ్యాగ్‌లు, ఖరీదైన బొమ్మలు, సిరామిక్స్, కర్ర, మెటల్.. ఇలా ఇల్లు, వంటగది, తోట కోసం కళాఖండాల సేకరణ ఊపందుకుంటోంది. విషయమైన పింక్లే బ్రాండ్ సృష్టికర్త తన్వానీ మాట్లాడుతూ ‘మా కంపెనీ హోమ్ మేడ్ వస్తువుల తయారీని ఏడేళ్ల కిందటే మొదలుపెట్టింది. నాటి నుంచి ఏనాడూ వెనుదిరిగి చూసుకోనంత ముందుకు వెళ్తోంది’ అని చెబుతుంది. ఆన్లైన్లో నేచర్.. గతంతో పోల్చితే ప్రకృతి సిద్ధమైన వాటితో తయారైన వస్తువులను ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడానికి వినియోగదారులు ఎక్కువ శాతం ఉత్సాహం చూపుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. వీటిలో బ్రాండ్ కన్నా ఆ వస్తువు కళాత్మకతపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టూ తెలుస్తోంది. ఖరీదైన వస్తువుగా! ‘సరసమైన ధరలకే సస్టైనబుల్ ఫర్నిషింగ్‌ను సృష్టించడం మా లక్ష్యం’ అంటున్నారు బెంగుళూరులో ది ఎల్లో డ్వెల్లింగ్ కంపెనీ అధినేత అభినయ సుందరమూర్తి. పత్తి, నార, గడ్డి, వెదురు వంటి సహజమైనవాటిని ఉపయోగించి ఫంక్షనల్ హోమ్ డెకర్ ఉత్పత్తులను రూపొందిస్తోందీ కంపెనీ. ఔట్‌డోర్, బాల్కనీలను డిజైన్ చేయడానికి మంచి శిల్పాలు, వెదురుతో చేసిన వస్తువులను అమర్చుతున్నారు. చదవండి: Samantha: దేవనాగరి చీరలో సమంత! సంపన్నుల బ్రాండ్.. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా..! Pratiksha Soni: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో.. -
ఎంఎస్ఎంఈ రంగ వృద్ధికి ఐడియాలు ఇవ్వండి..
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి చెందడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఎంఎస్ఎంఈ పోర్టల్‌లో నమోదైన వ్యక్తులు తమ ఐడియాలు, ఇన్నోవేషన్(ఆవిష్కరణలు), పరిశోధనలను అందించడం ద్వారా ఈ రంగ వృద్ధికి తోడ్పాటును ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబం« దించిన ప్రత్యేక ప్లాట్‌ఫాం ఎం ఎస్ఎంఈ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. -
లాక్డౌన్ తో ఓ రైతు వినూత్న ఆలోచన
-
మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి
న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి ఓనమాలు కూడా తెలియవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో నుంచి ఆలోచనలను, ప్రణాళికలను దొంగిలించాలని అని హితవు పలికారు. ‘సాధారణంగా గ్రామీణ వినియోగం, పట్టణ వినియోగం కన్నా ఎక్కువ వేగంతో పెరుగుతుంటుంది. కానీ సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో అది రివర్స్ అయింది. గత ఏడేళ్లలోనే కనిష్ట స్థాయిలో గ్రామీణ వినియోగం ఉంది’ అంటూ వచ్చిన ఒక మీడియా రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘గ్రామీణ భారతం సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఏం చేయాలో తెలీని స్థితిలో కేంద్రం ఉంది’ అని ట్వీట్ చేశారు. ప్రజల దృష్టి మరలుస్తుంటారు మహేంద్రగఢ్: దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారని రాహుల్ విమర్శించారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్(గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్– జీఎస్టీ)ల కారణంగా వ్యాపార వర్గాలు భారీగా నష్టపోయాయన్నారు. కాగా, ఢిల్లీకి తిరిగి వచ్చే సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం సరిగా లేకపోవడంతో ఓ గ్రౌండ్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. గ్రౌండ్లో ఉన్న వారితో కలసి క్రికెట్ ఆడి అనంతరం రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లిపోయారు. -
బ్యాంకింగ్ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ నెల పాటు బ్రాంచ్‌ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దిగువ స్థాయి నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని, బ్రాంచ్‌ల స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగుతుందని ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలుత బ్రాంచ్ లేదా ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సలహాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం, ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం ఉంటుంది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో కీలక భాగస్వాములైన ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తోంది. -
ఊహిస్తే చాలు... ఆలోచనలు మారతాయి!
‘‘నువ్వు తలచుకోవాలేగానీ.. ఏదైనా సాధ్యమే’’ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి గానీ.. ఎంత మనం అనుకున్నా ఐన్‌స్టీన్‌లా మారిపోగలమా అనే అనుమానం మనకూ వస్తుంది. ఇందులో కొంత నిజం లేకపోలేదని అంటున్నారు బార్సిలోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం... ఐన్‌స్టీన్‌లా అనుకునేవారి ఆలోచనలు క్రమేపీ మెరుగైన దిశగా మార్పు చెందుతాయి. వర్చువల్ రియాలిటీ ఆధారంగా తాము కొందరిపై ఒక పరిశోధన నిర్వహించామని, ఇందులో ఐన్‌స్టీన్ మాదిరి శరీరం ఉన్నట్టు ఊహించుకోవలసిందిగా సూచించినవారు కొంత సమయానికి ఆత్మవిశ్వాస పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెల్ స్లేటర్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ ప్రయోగాల్లో ఇతరుల శరీరం, కదలికలను ఊహించుకోవడం వల్ల తమ అసలు శరీరం, ఆలోచనలను ప్రభావితం చేస్తుందని గతంలోనే కొన్ని ప్రయోగాలు నిరూపించాయని ఆయన అన్నారు. తెల్ల రంగు వారు నల్లటి రంగు శరీరాలను ఊహించుకుని వర్చువల్ రియాలిటీలో చూసుకున్న తరువాత వారికి అప్పటివరకు నల్ల రంగు వారిపై ఉన్న భేదభావం తగ్గిందని చెప్పారు. ఇదే తరహాలో ఐన్‌స్టీన్‌లా ఊహించుకున్నప్పుడు వారి ఆలోచనల్లోనూ మార్పులు వచ్చినట్లు తమ తాజా అధ్యయనం చెబుతోందని వివరించారు. -
27న టీఈఏ ఆధ్వర్యంలో సదస్సు
డల్లాస్: తెలుగు వ్యాపారవేత్తల అసోసియేషన్(టీఈఏ) ఆధ్వర్యంలో 'పిచ్ యువర్ బిజినెస్ ఐడియాస్' పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 27న డల్లాస్‌లోని టీఐ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం నూతన వ్యాపారులను, పెట్టుబడిదారులతో అనుసంధానం చేస్తుందని టీఈఏ సభ్యులు వెల్లడించారు. ఈ సదస్సులో 10 ఉత్తమ బిజినెస్ ఐడియాలను ప్రదర్శించనున్నట్లు టీఈఏ వెల్లడించింది. సదస్సులో వెల్లడించే బిజినెస్ ఐడియాలపై నిపుణుల ఫీడ్‌బ్యాక్ ఉంటుందని తెలిపారు. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి టీఈఏ నిర్వహించే సదస్సు ఒక వేదికగా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. మేనేజ్డ్ స్టాఫింగ్ వ్యవస్థాపక ఛైర్మన్ అబిద్ హెచ్ అబేడీ, క్లిక్ సాఫ్ట్ సీజీఓ క్రిష్ణ కూరపాటి, నయా వెంచర్స్ మేనేజింగ్ పార్ట్నర్ దయాకర్ పుస్కూరు, లిగసీ టెక్సాస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇస్బెత్ నజీరా, టీఈఏ స్ట్రాటజీ టీం ఛైర్మన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
స్మార్ట్ కింగ్ ఖాన్
సెలబ్రిటీ స్టైల్.. బుల్లి తెరతో ప్రస్థానం మొదలుపెట్టి బాలీవుడ్లో కింగ్ ఖాన్‌గా ఎదిగిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం .. సంపదలో టామ్ క్రూయిజ్ వంటి హాలీవుడ్ స్టార్లను కూడా మించిపోయాడు. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న యాక్టర్‌గా నిల్చాడు. నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్ టీమ్ ఓనరు.. ఇలా ఒకటేమిటి అనేక పాత్రలు పోషిస్తున్నాడతను. సీరియస్‌గా సినిమాలు చేసుకున్నా.. సరదాగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసినా.. కోట్లు వచ్చేలా చూసుకుంటాడు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోని షారుఖ్.. వచ్చిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేయడంలోనూ మేటి. ఆ వివరాలే ఈసారి సెలబ్రిటీ స్టయిల్లో.. కొంగొత్త ఐడియాలు.. కింగ్ ఖాన్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంటాడు. ఏ ఒక్క అవకాశాన్నీ వీలైనంత వరకూ వదులుకోడు. దీనికి లేటెస్ట్ నిదర్శనం కొత్తగా రిలీజ్ కాబోతున్న హ్యాపీ న్యూ ఇయర్ సినిమానే. దీని రిలీజ్‌కి ముందే షారుఖ్ భారీగానే వెనకేసుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో షోలు నిర్వహించబోతున్నాడు. ఒక్కో షోకి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. మొత్తం మీద సినిమా రిలీజ్‌కి ముందే ఈ విధంగా సుమారు రూ. 200 కోట్లు రాబట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా లాభాల్లో యాక్టర్లు కూడా వాటాలు తీసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నటుల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. వెండి తెరే కాకుండా బుల్లితెరపై కూడా షారుఖ్ ఖాన్ కింగే. కౌన్ బనేగా కరోడ్‌పతి (సీజన్ 3), క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై, జోర్ కా ఝట్కా వంటి రియాలిటీ షోలతో భారీ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. జోర్ కా ఝట్కాకి దాదాపు రూ.2.5 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇటీవలి సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ శాటిలైట్ రైట్స్‌ను జీ ఎంటర్టైన్మెంట్కి ఏకంగా రూ. 48 కోట్లకు విక్రయించాడు. మార్కెటింగ్ మెగాస్టార్.. పాపులారిటీని మార్కెటింగ్ చేసుకోవడంలో షారుఖ్ దిట్ట. ఢిల్లీలో రెండు టికెట్లు తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ లాంటి ఆఫర్లతో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాడు. దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని సరిగ్గా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచేలా చూశాడట. షారుఖ్.. ఏమాత్రం ప్రెస్టీజ్‌కి పోకుండా బడా పారిశ్రామికవేత్తల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి కూడా బ్యాంకు బ్యాలెన్సు పెంచుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 8 కోట్లు తీసుకుంటాడని టాక్. వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేయడానికి ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఖాన్లు ఇష్టపడని కారణంగా.. ఈ విషయంలోనూ షారుఖ్ కింగే. అందుకే అతనికి బాగా డిమాండ్. 2012లో ఏకంగా 250 ఆఫర్లు రాగా పది మాత్రమే అంగీకరించాడట. ఆ రకంగా చూసినా కేవలం డ్యాన్సులు చేయడం ద్వారా రూ. 80 కోట్లు అందుకున్నాడని అంచనా. వీటిని పక్కన పెడితే .. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తుంటాడు షారుఖ్. టాల్కమ్ పౌడర్ల నుంచి కూల్ డ్రింకుల దాకా రకరకాల ప్రకటనలతో అలరిస్తూ.. ఆర్జిస్తుంటాడు. ఇటీవలే ఒక పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి రూ. 20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలివైన మదుపరి ఆదాయాన్ని ఆర్జించేందుకు అందుబాటులో అన్ని మార్గాలను వినియోగించుకునే షారుఖ్ ఖాన్ .. డబ్బును గౌరవిస్తాడు. దాన్ని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యమిస్తాడు. అందుకే ముంబైలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెట్ టీమ్‌ను కొన్నాడు. రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. అలాగే ఇన్డోర్ థీమ్ పార్క్స్కి సంబంధించిన ఇమేజినేషన్ ఎడ్యుటెయిన్‌మెంట్ ఇండియాలోనూ పెట్టుబడులు పెట్టాడు. ఇలాంటి తెలివైన పెట్టుబడులతో సంపదను మరింత రెట్టింపు చేసుకోవడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తాడు షారుఖ్. మరో విషయం.. కేవలం సినిమాలే లోకంగా కాకుండా, ప్రతి విషయం గురించి అప్ టు డేట్ ఉంటాడు షారుఖ్.