ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే..
ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేయాలి.
ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్‌తో గది కార్నర్‌ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది.
నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్‌ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఇంక్లూడ్ చేయాలి.
సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్‌ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి.
(చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!)
Comments
Please login to add a commentAdd a comment