ఇద్దరు అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచన
డీ మెల్ట్ పేరుతో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు..
ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్‌గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు కావు. అవి చాక్లెట్స్.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్‌ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు.
దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.
కాస్త భిన్నంగా ఉండాలని..
ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్ పేరుతో చిన్నపాటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment