వెరైటీ డ్రెస్సింగ్‌తో సిద్ధమవుతున్న సిటీ యూత్‌ | New Year Outfit Ideas 2025: | Sakshi
Sakshi News home page

వెరైటీ డ్రెస్సింగ్‌తో సిద్ధమవుతున్న సిటీ యూత్‌

Published Mon, Dec 30 2024 7:32 AM | Last Updated on Mon, Dec 30 2024 11:24 AM

New Year Outfit Ideas 2025:

ప్రస్తుతం నగరంలో పార్టీ టైమ్‌ నడుస్తోంది. ప్రీ న్యూఇయర్‌ బాష్‌ నుంచి ఆఫ్టర్‌ నైట్స్‌ దాకా కొత్త సంవత్సరం వేడుకలు చలిగాలులు కమ్మిన నగరాన్ని సైతం హీటెక్కిస్తోంది. పారీ్టస్‌కి అటెండ్‌ అవడం ఒకెత్తయితే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలవడం మరొకెత్తు. ఈ నేపథ్యంలో పలువురు డిజైనర్ల నుంచి సేకరించిన సూచనల సమాహారం ఇది.. 

పార్టీని బట్టి  డ్రెస్సింగ్‌ 
ఎంచుకోవడం  ఎప్పటి నుంచో నగరంలో కొనసాగుతున్న ట్రెండ్‌. అయితే ఇది కేవలం ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌ లాంటిదైతే.. ఒక రకంగా, ఉర్రూతలూగించే సందడితో ఉంటే.. మరో రకంగా ఆహార్యాన్ని తీర్చిదిద్దుకోండి అంటూ సూచిస్తున్నారు నగరంలోని ప్రముఖ డిజైనర్లు. వీరు అందిస్తున్న మరికొన్ని 

సూచనలు... 
⇒ డ్రెస్సింగ్‌లో స్టైల్స్‌ ఎలా ఉన్నా విభిన్న రకాల యాక్సెసరీస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. చంకీ బెల్ట్సŠ, ఫంకీ గాగుల్స్‌.. ఇలా నైట్‌ పారీ్టకి మరీ ముఖ్యంగా న్యూ ఇయర్‌ పార్టీకి నప్పేలా ఏదైనా ట్రై చేయవచ్చు. 

⇒ మహిళలు ఈవెనింగ్‌ గౌన్స్‌ను ట్రై చేయవచ్చు. విభిన్న రకాల ఫ్యాన్సీ జ్యువెలరీకి చోటు ఇస్తే బాగుంటుంది.  
⇒రకరకాల హెయిర్‌స్టైల్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ సింపుల్‌గా సరిపెడితే.. ఇది మరింత అవసరం.  

అమ్మాయిలకు.. 
షార్ట్‌ స్కర్ట్స్, షార్ట్స్, వన్‌ పీస్‌ డ్రెస్‌లు బాగా పోష్‌ లుక్‌ ఇస్తాయి. టీనేజర్‌లకు వన్‌పీస్‌ డ్రెస్‌ బాగుంటుంది. ఫ్లోరల్‌ ప్రింట్‌లో వన్‌పీస్‌ డ్రెస్‌లు పర్ఫెక్ట్‌ పార్టీ కాస్ట్యూమ్‌గా పేర్కొనవచ్చు. ట్యాంక్‌ టాప్స్, ట్యూబ్‌ టాప్స్‌ మంచి లుక్కునిస్తాయి. పొరపాటున కేప్రీస్‌ వేసుకుంటే ఓల్డ్‌ఫ్యాషన్‌ అయిపోతుంది జాగ్రత్త. వన్‌ పీస్‌ విత్‌ ట్యూబ్‌ టాప్‌ సరికొత్తగా న్యూ లుక్‌తో బాగుంటుంది. చలిగాలికి రక్షణగా ఉలెన్‌ స్కార్ఫ్స్‌ బెటర్‌. లైట్‌ కలర్‌ టీ షర్ట్‌కు డార్క్‌ కలర్‌ టీ షర్ట్‌కు లైట్‌కలర్‌ స్కార్ఫ్‌ ఎంచుకోవాలి.

యువకులకు.. 
షార్ట్స్‌ వేసుకోవచ్చు. లుంగీ స్టైల్‌లో వేసుకునే డ్రెస్‌ కూడా ఫంకీగా ఉండి బావుంటుంది. బ్లాక్, బ్రౌన్‌ టీషర్ట్‌తో క్యాజువల్‌ బ్లేజర్‌. రెడ్, పింక్‌ కలర్స్‌ ప్రస్తుతం లేటెస్ట్‌ ఫ్యాషన్‌. యువకులు ఇప్పుడు డ్రెస్సింగ్‌లో షేడ్స్‌ ఎంచుకునేటప్పుడు గోల్డ్‌ కలర్‌ కూడా బాగా వినియోగిస్తున్నారు. వైట్‌ కలర్‌ టీషర్ట్, రెడ్‌కలర్‌ జీన్స్, బ్రౌన్‌ కలర్‌ క్యాజువల్‌ బ్లేజర్‌/ఎల్లో కలర్‌ బ్లేజర్‌ 
కాంబినేషన్‌తో వావ్‌ అనిపిస్తారు.

 జాగ్రత్తలు మరవొద్దు.. 
⇒ తప్పనిసరై దూరంగా ఉన్న వేడుకకు వెళ్లవలసి వస్తే.. కుటుంబ సమేతంగా, వీలైతే మరికొన్ని ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్లడం మంచిది. 
⇒పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
⇒కొన్ని ఈవెంట్స్‌ నిర్వాహకులు రాత్రి పూట బస మరుసటి రోజు బ్రంచ్‌ కూడా కలిపి ప్యాకేజీలు అందిస్తున్నారు. వీలైతే అటువంటిది ఎంచుకోవడం మంచిది. 
⇒కొందరు పికప్‌తో పాటు తిరిగి వెళ్లేటప్పుడు డ్రాప్‌ చేసేందుకు కూడా వాహన సౌకర్యం కూడా అందిస్తున్నారు. గమనించండి.  

అటు సంప్రదాయం.. ఇటు ఆధునికం.. 
ఓ వైపు సంప్రదాయాన్ని, మరోవైపు ఆధునిక పోకడల్ని మేళివింపుతో పారీ్టలకు హాజరవుతూనే హుందగా కనిపించాలని ఆశించే నగర మహిళలూ ఎక్కువే. పార్టీ సీజన్‌ పురస్కరించుకుని హామ్‌స్టెక్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫ్యాక్టరీలు అందిస్తున్న సూచనలివే.. 

⇒కలంకారీ ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకోవచ్చు. పొడవాటి గౌన్‌కి  సిల్క్‌ దుపట్టా జత చేయడం వల్ల లగ్జరీ లుక్‌ వస్తుంది. మోడ్రన్, క్లాసిక్‌ లుక్‌ని మేళవించిన ఈ అవుట్‌ ఫిట్‌ నప్పుతుంది. 
⇒ఎంబ్రాయిడరీ అనేది ఒక ఆర్ట్‌. సరైన పద్ధతిలో రూపొందిన ఎంబ్రాయిడరీ నెట్‌ లెహెంగా.. ఆకర్షణీయంగా ఒదిగిపోతుంది. 
⇒హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో ప్రత్యేకంగా రూపొందిన చీర భారతీయ వస్త్ర విశిష్టతకు అద్దం పడుతుంది. 
⇒ఫార్మల్‌ కుర్తా సెట్స్, పార్టీ ఎతి్నక్‌ వేర్‌ కలిసిన కో–ఆర్డ్‌ సెట్స్‌ ధరించిన వారి ఫ్యాషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తాయి. ఇవి సాయంత్రపు సందడికి, రోజువారీ యాక్టివిటీస్‌కీ అతికినట్టు సరిపోతాయి. 
⇒ సంప్రదాయ బెనారస్‌ చీరల నుంచి మారి స్టైలిష్‌ రఫెల్‌ శారీస్‌ను ఎతి్నక్‌ వేర్‌కు జత చేయవచ్చు. వీటి ఎతి్నక్‌ శైలి, ఫ్రిల్డ్‌ బోర్డర్స్‌.. ప్రతి మహిళనీ అందంగా స్టైలిష్ గా     చూపించగలవు.

ట్రెండీ వేర్‌.. టేక్‌ కేర్‌..  
⇒ న్యూ ఇయర్‌ వేదికలకు వెళ్లేటప్పుడు.. ధరించిన దుస్తులను ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్‌గా ఉంటూనే.. సౌకర్యంగానూ ఉండేలా జాగ్రత్తపడాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు 
⇒షిఫాన్, సిల్క్, సీత్రూ తరహాలో గ్లామరస్‌ వస్త్రధారణకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు.. వీలున్నంత వరకూ సమూహాలతోనే పార్టీలకు హాజరవడం బెటర్‌. అలాంటి సందర్భాల్లో ఊరికి దూరంగా ఉన్న రిసార్ట్స్, క్లబ్స్‌ను కాకుండా కాస్త దగ్గరగా ఉన్నవే ఎంచుకోండి. 
⇒అవుట్‌ డోర్‌ ఈవెంట్లకు హాజరయే సందర్భంగా రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి.. అందుకు తగ్గట్టుగా డ్రెస్‌ ఎంచుకోవాలి.  
⇒  డ్రెస్సింగ్‌ ఎంపికలో చలి వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పారీ్టలో పాల్గొని 
నృత్యాలు చేయడం, డ్రింక్స్‌ 
తీసుకోవడం జరిగితే అవే దుస్తులు అసౌకర్యంగా అనిపించవచ్చు కాబట్టి లేయర్స్‌గా దుస్తుల్ని ధరిస్తే మరింత మంచిది. 
వెరైటీ డ్రెస్సింగ్‌తో సిద్ధమవుతున్న సిటీ యూత్‌ 
⇒కొత్త సందడి వేళ కొత్తగా కనిపించేందుకు ఆసక్తి 
⇒జోష్‌ ఫుల్‌ ఈవెంట్స్‌లో యాక్సెసరీస్‌దే హవా 
⇒చలిలో హీటెక్కిస్తున్న న్యూ ఇయర్‌ ప్రిపరేషన్స్‌ 
⇒ స్టైలిష్‌ లుక్‌కి అ‘డ్రెస్‌’గా నిలిచేందుకు డిజైనర్‌ టిప్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement