క్రిస్మస్‌తో మొదలై సంక్రాంతి వరకూ
వరుసపెట్టి పండుగ వేడుకలు
వెరైటీ థీమ్స్ కోసం పార్టీ లవర్స్ అన్వేషణ
సంప్రదాయ, పాశ్చాత్య రీతులను కలగలిపేలా
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్‌కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి..
నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని..
ట్విన్నింగ్.. స్టన్నింగ్..
తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు
ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే
ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్..
భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్‌ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్‌కు క్రాప్ టాప్స్‌ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్‌కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్‌టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి.
రాయల్టీ.. పార్టీ..
ఇండియన్ రాయల్టీ థీమ్‌తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్‌్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్‌తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్‌బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి.
బాలీవుడ్.. స్టైల్..
నగరం టాలీవుడ్‌కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్‌పై బాలీవుడ్ హిట్స్‌కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి.
పూల్.. పారీ్టస్..
నగరంలోని స్టార్ హోటల్స్‌లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్‌గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి.
పాట్ లాక్.. ఫుడ్ క్లిక్..
చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్‌లాక్‌ని బాగా క్లిక్ చేసింది. పాట్‌లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు.
ఆరోగ్యకరం.. ఆర్గానిక్..
ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్‌కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు.
డెస్టినేషన్..ప్యాషన్..
ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.
ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా..
సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి
పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment