Sandalwood trees
-
ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..
ఆధునిక భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న సమయంలో కేవలం ఉద్యోగం చేసి మాత్రమే డబ్బు సంపాదించాలంటే కొంత అసాధ్యమైన పనే. అయితే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు వ్యవసాయం ద్వారా కూడా అధిక లాభాలను పొందుతున్నారు. మనం ఈ కథనంలో 'శ్రీగంధం' (Sandalwood) ద్వారా ఎలా సంపాదించవచ్చు? వీటి పెంపకానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా? అనేవి వివరంగా తెలుసుకుందాం. సౌందర్య లేపనాలు, క్రీములు వంటి వాటి తయారీలో చందనం ఎక్కువగా వినియోగిస్తారు. కావున చందనం (శ్రీగంధం) చెట్లు పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ చెట్లను రెండు ప్రాథమిక పద్ధతుల ద్వారా పెంచవచ్చు. ఒకటి సేంద్రీయ వ్యవసాయం, మరొకటి సాంప్రదాయ పద్ధతి. సేంద్రీయ విధానం ద్వారా సాగు చేస్తే 10 నుంచి 15 సంవత్సరాలలో చెట్లు పక్వానికి వస్తాయి. అయితే సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తే 20 నుంచి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ చెట్ల పెంపకం సమయంలో కనీస రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! చెట్టు పక్వానికి వస్తుందనే సమయంలో సువాసనలు వెదజల్లడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కొన్ని జంతువులు భారీ నుంచి మాత్రమే కాకుండా స్మగ్లర్ల భారీ నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి దాదాపు సమశీతోష్ణ పరిసరాల్లో ఏపుగా పెరుగుతాయి. ఒక చందనం చెట్టు ద్వారా రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన 10 చెట్లను పెంచితే రూ. 50 లక్షలు, 100 చెట్లు సాగు చేస్తే రూ. 5 కోట్లు వరకు ఆర్జించవచ్చు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రభుత్వ నిబంధనలు: శ్రీగంధం మొక్కలు పెంచాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ తెలుసుకుని ఉండాలి. ఇందులో ప్రధానంగా 2017లో ఇండియన్ గవర్నమెంట్ గంధపు చెక్కలను ప్రైవేట్‌గా కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నిషేధించింది. కావున చట్టం పరిధిలో చెట్లను పెంచవచ్చు, కానీ వాటిని ప్రభుత్వానికి విక్రయించాలి. అంతే కాకుండా వీటి పెంపకం ప్రారంభం సమయంలోనే అటవీ శాఖ అధికారులను తెలియజేయాలి. వారు వీటిని ఎప్పటికప్పుడు నావిగేట్ చేస్తూ ఉంటారు. (Disclaimer: ఎక్కువ లాభాలు వస్తాయని శ్రీగంధం చెట్ల పెంపకం చేయాలనే వారు ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సంబంధిత ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటివన్నీ బేరీజు వేసుకోవాలి.) -
ఏలూరు జిల్లాలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు
-
రాజ్‌భవన్ ప్రాంగణంలోని చందనం చెట్టు మాయం
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్ ఆవరణలో ఉన్న అరుదైన చందనం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న చెట్టును మంగళవారం దుండగులు నరికేసి, ఎత్తుకుపోయారు. గవర్నర్ అధికార నివాసంలో చోటుచేసుకున్న ఘటనపై రాజ్‌భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా కొందరు అనుమానితులపై నిఘా పెట్టామని, దోషులెవరో త్వరలోనే తేలుస్తామని పోలీసులు గురువారం చెప్పారు. చందనం చెట్ల పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. చందనం కలపను కోతకు, రవాణాకు అటవీ శాఖ నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
Sandalwood Cultivation: చందనం సాగుపై ఐ.డబ్ల్యూ.ఎస్.టి. కోర్సు
చందనం తదితర విలువైన కలప జాతుల సాగు, వ్యాపారంలో నైపుణ్యాలపై బెంగళూరులోని, కేంద్ర అటవీ పరిశోధన–విద్యా మండలి అనుంబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ.డబ్ల్యూ.ఎస్.టి.) సంస్థ శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 19 నుంచి 23 తేదీ వరకు శిక్షణ ఉంటుంది. చందనం (శాండల్‌వుడ్) మొక్కల నర్సరీ, తోటలను ఆరోగ్యంగా పెంచడంతోపాటు చందనం చెక్కలో నూనె శాతాన్ని అంచనా వేయటం, చందనం వాణిజ్యం, ఆర్థిక అంశాలు, చందనం సాగును ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు.. ఈ అంశాలపై ఐ.డబ్ల్యూ.ఎస్.టి. ఆచరణాత్మక శిక్షణ ఇస్తుంది. వసతి, భోజన సదుపాయాలతో కూడిన శిక్షణ పొందగోరే అభ్యర్థి రూ. 17,700 లను డీడీ రూపంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ శాస్త్రవేత్త డా. ఆర్. సుందరరాజ్ కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. తెలుగులో ఇతర వివరాలు తెలిసుకోవడానికి 080–22190166. rsundararaj@icfre.org -
కార్డన్ సెర్చ్‌లో దుప్పి కొమ్ములు గుర్తింపు
కొమరోలు(గిద్దలూరు): కార్డన్ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడి ఇళ్లలో గుర్తించిన అడవి జంతువుల కొమ్ములు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాటు సారా అరికట్టేందుకు శుక్రవారం మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి చేరుకున్న గిద్దలూరు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గ్రామంలో అణువణువూ పరిశీలించారు. రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని పలు గృహాల్లో తనిఖీలు నిర్వహించగా 11 దుప్పి కొమ్ములు, మూడు చిన్నపాటి ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ అవసరాల కోసం ఉపయోగించే కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుప్పికొమ్ములు, ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులకు అప్పగించామని సీఐ యు.సుధాకర్‌రావు చెప్పారు. ఇలాంటి వాటిని కలిగి ఉండటం చట్ట విరుద్దమన్నారు. కార్యక్రమంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలు ఎస్.మల్లికార్జునరావు, షేక్ సమందర్‌వలి, త్యాగరాజు, రవీంద్రారెడ్డి, ఎక్సైజ్ ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే ఇక్కడి ప్రజలు ఎర్రచందనం దుంగలతో రోకళ్లు, పచ్చడి బండలు తయారు చేసుకుని ఉపయోగిస్తారని, దుప్పి కొమ్ములను శుభ సూచకంగా ఇళ్లలో అలంకరిస్తారని స్థానికులు తెలిపారు. -
జూపార్కులో గంధపు చెట్లు మాయం
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రెండు గంధపు చెట్లను దొంగలు నరుక్కెళ్లిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూ పార్కులో మీరాలం ఈద్గా వైపు గంధపు చెట్లు ఉన్నాయి. మీరాలం ఈద్గా సమీపంలోని గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు రెండు గంధపు చెట్లను నరుక్కెళ్లారు. జూపార్కు అసిస్టెంట్ క్యూరేటర్–3 సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బహదూర్‌పురా అదనపు ఇన్స్పెక్టర్ శివ కుమార్ సోమవారం గంధపు చెట్లు చోరీకి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. గంధపు చెట్ల మాయంపై జూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలోనూ జూ పార్కులో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. -
కేబీఆర్ పార్క్‌లో దొంగల బీభత్సం
హైదరాబాద్: కేబీఆర్ పార్క్‌లో ఐదుగురు దొంగలు గురువారం బీభీత్సం సృష్టించారు. సువిశాలమైన కేబీఆర్ పార్క్‌లో గంధపు చెట్లు నరకడానికి వచ్చినట్టు సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఆ దొంగలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. చివరికి అతికష్టంమీద వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కనే ఉన్న బిల్డింగ్‌లో దాక్కున్న మరో దొంగ అధికారులపై రాళ్లతో దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.