
చందనం తదితర విలువైన కలప జాతుల సాగు, వ్యాపారంలో నైపుణ్యాలపై బెంగళూరులోని, కేంద్ర అటవీ పరిశోధన–విద్యా మండలి అనుంబంధ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ.డబ్ల్యూ.ఎస్.టి.) సంస్థ శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 19 నుంచి 23 తేదీ వరకు శిక్షణ ఉంటుంది.
చందనం (శాండల్‌వుడ్) మొక్కల నర్సరీ, తోటలను ఆరోగ్యంగా పెంచడంతోపాటు చందనం చెక్కలో నూనె శాతాన్ని అంచనా వేయటం, చందనం వాణిజ్యం, ఆర్థిక అంశాలు, చందనం సాగును ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు.. ఈ అంశాలపై ఐ.డబ్ల్యూ.ఎస్.టి. ఆచరణాత్మక శిక్షణ ఇస్తుంది. వసతి, భోజన సదుపాయాలతో కూడిన శిక్షణ పొందగోరే అభ్యర్థి రూ. 17,700 లను డీడీ రూపంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ శాస్త్రవేత్త డా. ఆర్. సుందరరాజ్ కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. తెలుగులో ఇతర వివరాలు తెలిసుకోవడానికి 080–22190166. rsundararaj@icfre.org
Comments
Please login to add a commentAdd a comment