హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ గ్రూప్.. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాలను అందించే యూకేకు చెందిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ 'పీఎంసీ గ్రూపు'ను కొనుగోలు చేసింది.
పీఎంసీ గ్రూపు కొనుగోలుతో.. రఘు వంశీ గ్రూపు కీలకమైన పరిశ్రమలకు ఉత్పత్తులు సరఫరా చేయనుంది. కాబట్టి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలుగుతుంది. అంతే కాకుండా ఆయిల్ & గ్యాస్ రంగంలో లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.
పీఎంసీ గ్రూపు.. తన ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా ఉన్న గొప్ప అనుభవం కలిగి ఉంది. ఈ కంపెనీ ఎస్ఎల్‌బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్, ఎక్స్‌ప్రో, టెక్ ఎఫ్ఎంసీ, వన్ సబ్ సీ వంటి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ ఓఈఎంలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు.. ఆదాయం రూ. 180 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.
పీఎంసీ గ్రూపును.. రఘు వంశీ గ్రూప్ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, మిధాని సీఎండీ డాక్టర్ ఎస్ కే ఝా, ఏఆర్‌సీఐ సైంటిస్ట్ డాక్టర్ ఎల్.రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. రఘువంశీ కుటుంబంలోకి పీఎంసీ గ్రూపును స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ఇప్పుడు మా ఉత్పత్తి బలాలను, సునిశిత మెషీనింగ్‌లో పీఎంసీ గ్రూపువారి నైపుణ్యంతో మిళితం చేస్తుంది. దీనివల్ల మా అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి, అత్యంత సునిశిత ఉత్పత్తుల విస్తృత విభాగాన్ని రూపొందించడానికి సాయపడుతుందని మేము సంతోషిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment